jump to navigation

ఉరికిచ్చి … ఉరికిచ్చి … No Sale of Telangana మార్చి 28, 2009

Posted by M Bharath Bhushan in Congress, Culture, elections, Identity, politics, TDP, Telangana, Telugu (తెలుగు), TRS.
add a comment

ఉరికిచ్చి… ఉరికిచ్చి…
-అల్లం నారాయణ

ఆ మంట, ఈ మంట ‘ఉరికిపిచ్చి… ఉరికిపిచ్చి’… ఇదేదో… అల్‌జైదీ లెవెల్‌ వ్యవహారంలా అందరికీ అనిపించి ఉండకపోవచ్చు. కానీ… ఏక పక్షంగా ఒక భావోద్వేగ ఉద్యమంతో ఆడుకుంటున్న వాళ్లను ఇట్లా కనీసం ప్రతిఘటించినప్పుడు అనుభవించే ఒక ఆక్రోశం నుంచి దీన్ని చూడవలసి ఉన్నది.

తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంపికైన వెంకటరెడ్డిని ‘ఉరికిచ్చి…ఉరికిచ్చి’ కొట్టిండ్లు. టీవీలో చెబుతున్న ఆ పిలగా ని మాటలు ఎంత బలమైనవో చాలా మందికి తెలియవు. తెలంగాణ పలుకుబడి నుడికారం ,స్థానికీయ పదాల సొగసు, సూటిగా తుపాకి గుండులా తాకే పోటెత్తిన మాటలు ఎంత శక్తివంతంగా ఉంటాయో! ముచ్చటేస్తుంది. అట్లాగే ‘గెదిమి గెదిమి’ కొట్టిండ్రని కూడా అంటరు. అయినా రాజకీయ రగడలో భాషవేట ఎందుకు గానీ… కొందరు ఏడుస్తున్నరు. కొందరు నవ్వుతున్నరు. కొందరు కోట్ల మదంతో కొనగోట మీసం మెలిపెడ్తున్నరు.

అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు ‘కొన్న వాడిదే టికెట్‌’ హవా నడుస్తున్నది. కోట్లున్న వాడు టికెట్‌ కొనుక్కుంటడు. అప్పుడు దున్నేవాడిదే భూమి అనే వోడు మూలన్నే ఉంట డు. అందుకే మంట పుట్టి తెలంగాణ భవన్‌లో ‘పవర్‌’ చూపి ఉరికిచ్చి, ఉరికిచ్చి (గెదిమి గెదిమి) కొట్టి ఉంటారు. ఇది సరే… తీసుకున్న వాడి సంగతేమి టి? ఎవరు తీసుకున్నట్టు… భవిష్యత్‌లో వాళ్ళను కూడా గెదుముతారా! ఉరికిస్తారా! తెలంగాణ కదా! ఈ చైతన్యం మూలాలు ఇక్కడి ఉద్యమ స్వభావం లో ఉండవచ్చు. యాభై ఏండ్లుపై బడిన మోసం ఇక వశం కాని అసహనం నుంచి ప్రజ్వరిల్లిన ఆగ్రహం కావచ్చు. ఏండ్ల తరబడి తెలంగాణ జెండా మోసి, నిద్ర కాసి, ఎగిరి, దుమికి అధినేత ‘కారు’ కూతలే విప్లవ శంఖారావాలనుకుని, అధినేత పరాకుగా మాట్లాడినా, చిరాకుగా మాట్లాడినా, అర్ధరాత్రో, అపరాత్రో ఆవేశంతో మాట్లాడినా, ‘బిందాస్‌’ అనుకుని తోచిన కాడికి ఉన్న కాడికి ఖర్చు పెట్టుకుని ఇగ ఇట్లనే ‘తెలంగాణ’ వస్తదని ‘నమ్మినాన బోస్తె పుచ్చి బుర్రలయిన’ ఒక దిగ్భ్రాంతి నుంచి కోపం రావొచ్చు. (మరింత…)

కేసీఆర్‌ చెరలో తెలంగాణ Telangana privatised by KCR & Family Ltd మార్చి 28, 2009

Posted by M Bharath Bhushan in Essays, Identity, politics, TDP, Telangana, Telugu (తెలుగు), TRS.
add a comment

కేసీఆర్‌ చెరలో తెలంగాణ
– ఆదిత్య

ఇప్పుడు తెలంగాణవాదం అనేది తెలంగాణ ప్రజల కోసం కాకుండా, ‘కేసీఆర్‌ చేత, కేసీఆర్‌ వలన, కేసీఆర్‌ కోసం’గా మారింది. ఆయన పుణ్యాన ఇప్పుడు తెలంగాణవాదమనేది ప్రజల ఆకాంక్షగా కాకుండా ఓట్లు- సీట్ల లెక్కగా, రాజకీయ పార్టీల మధ్య బేరసారాల వస్తువుగా మారింది.

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎంతో తెలివైనవారు. మంచి భాషతో, తెలంగాణ మాండలికం నిండిన యాసతో జనాన్ని ముగ్ధుల్ని చేయగల మాటల మాంత్రికుడు. రాజకీయ వ్యూహరచనా దురంధరుడు. ఎన్నిసార్లు దెబ్బతిన్నా, సహజ సిద్ధమైన నేర్పరితనంతో మళ్లీ లేచి నిలబడగలిగిన సమర్థుడు, అదృష్టవంతుడు. అందువల్లే తెలంగాణవాదాన్ని కేసీఆర్‌ గతంలో ఎవరికీ సాధ్యంకాని రీతి లో, ఇంతలా ఇంత సుదీర్ఘ కాలం ఒడిసిపట్టగలిగారు. అయితే అన్ని రోజులూ మనవి కావన్నట్టు రాజకీయాల్లోనూ అదృష్టం ఎప్పుడూ ఏకపక్షంగా ఉండదు. గడుసరి రాజకీయాలు కాలం కలసి వచ్చినపుడు బాగానే ఉంటాయి. తమకు ఎదురేలేదన్న భ్రమను కలిగిస్తాయి. కానీ వికటిస్తే అవి దీర్ఘకాలంలో చేసే నష్టం అంతాఇంతా కాదు. గడుసరి తనంతో వ్యవహరించే నాయకుడే కాదు; అతను చేపట్టిన ఎజెండా, ఆశ్రయించిన నేతలు, అవతరించిన పార్టీ అన్నీ ఇబ్బందుల్లో పడతాయి.

ప్రస్తుతం కేసీఆర్‌, ఆయన చేపట్టిన తెలంగాణవాదం పరిస్థితి ఇదే. అతి సంక్లిష్టమైన అన్ని అంశాలతో ఏకకాలంలో గేమ్‌ ఆడడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైన జాదూ! ఆయన ఎంత సమర్థుడంటే తెలంగాణవాదంతో, మిత్రపక్షాలతో, మీడియాతో ఒకేసమయంలో ఆటాడగలరు. అందునా… ఒకదానితో మరొకదానికి ముడిపెట్టి… తన ప్రయోజనాలు సాధించుకోగలరు. తెలంగాణ వాదాన్ని ఓట్లుగా చూపించి, మీడియాలో వార్తలు/ లీకులు రాయించి, మిత్రపక్షాలతో బేరాలు జరపడం ఆయనకు మాత్రమే చేతనైన కళ. తెలంగాణవాదం విషయంలో ఒకప్పుడు చంద్రబాబు అందరితో ఆడుకున్నారు. ఇక కేసీఆర్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ ఒక ఆటాడుకుంటే, ఇప్పుడు కేసీఆర్‌ తనవంతుగా చంద్రబాబుతో ఆడుకుంటున్నారు. ‘రోజు మొత్తంలో కేసీఆర్‌ గంటసేపు మాత్రమే ఆలోచిస్తారు. మిగతా నేతల్లా రోజంతా ఆలోచిస్తే పరిస్థితి ఇంకెట్లా ఉండేదో!’ ఇది ఇటీవల ఒక మిత్రుడు భయంతో చేసిన వ్యాఖ్య. ఈ అభిప్రాయం ప్రస్తుత పరిణామాలకు అతికినట్టు సరిపోతుంది. మహాకూటమితో పొత్తు, సీట్ల సర్దుబాటు విషయంలో కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరి,

వ్యవహరిస్తున్న తీరు మిత్రపక్షాలకు చికాకు కలిగించడంతో పాటు సొంతపార్టీ టీఆర్‌ఎస్‌లోనూ అసహనానికి కారణమవుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ వాసుల ఆకాంక్షల రూపంలో నిక్షిప్తమై ఉన్న తెలంగాణా వాదాన్ని, రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ కెలుకుతూ వచ్చింది. చీమల పుట్టలో పాము దూరి ఆక్రమించినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా తెలంగాణ జెండా పట్టుకోవడం మొదలుపెట్టింది. అలా తెలంగాణవాదం రాజకీయ అంశంగా స్థిరపడిపోయింది. దీనికి భిన్నంగా, కొందరు తెలంగాణ విద్యావంతులు, మేధావులు 2001 కి ముందు సమాంతర తెలంగాణ ఉద్యమానికి పెద్దఎత్తున రంగం సిద్ధం చేశారు. ఈ తరుణంలో తెలుగుదేశంతో సరిపడక బయటకు వచ్చిన కేసీఆర్‌, 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించి తెలంగాణవాదాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. క్రమంగా దాన్నొక రాజకీయ ఉద్యమ స్థాయికి తీసుకువచ్చారు. తెలంగాణవాదం, నినాదం కేసీఆర్‌ ఒక్కరిదేమీ కాకపోయినా, తెలంగాణకు ఆయనే పర్యాయపదంగా నిలిచారు. ఇందు కు కేసీఆర్‌ కృషికన్నా, కలసివచ్చిన ఇతరత్రా పరిణామాలే ఎక్కువ కారణమంటే అతిశయోక్తి కాదు. (మరింత…)

Polepally – Anti- SEZ Struggle మార్చి 20, 2009

Posted by M Bharath Bhushan in Congress, Economy, elections, livelihoods, Mahabubnagar, SEZ, Telangana, TRS.
2 వ్యాఖ్యలు

India Yatra

A small Victory in a losing battle

Kuchi Venkat Lakshmana

They knew they would never win.

 

But 13 farmers from a group of small villages in Jadacherla, Mehboobnagar, about 96 kilometres south-west of the sparkling cyber capital of Hyderabad, decided they had to be heard.

 

So they sold precious cattle and scraped together funds to raise Rs 5,000 per head so they could register as Independents for an Assembly by-poll in May 2008.

 

There was only one thing on their agenda: They wanted to make a statement against a system that had handed over their farmland to a special economic zone and given them no land in exchange, leaving hundreds homeless and out of work.

 

As they toured village fairs and marketplaces across the district with their message, a strange thing happened.

 

Scraggly farmers began coming forward with crumpled notes in their fists.

 “It wasn’t much… just a few rupees at a time. But it told us we were on the right track,” says Mala Jangilamma (50), a farmer and Independent candidate.

And they perhaps ruined the Telugu Desam Party’s chances too. The TDP candidate lost to Ravi Mallu of the Congress by just 2,000 votes.

“The people are sick of the same parties and the same failed promises. They wanted to make a statement too.” (మరింత…)

Telangana- Forty year old battle మార్చి 20, 2009

Posted by M Bharath Bhushan in Congress, Economy, Identity, Karimnagar, livelihoods, politics, PRP, TDP, Telangana, TRS.
8 వ్యాఖ్యలు

In Telangana, the 40-year battle for a place called home

Kuchi Venkat Lakshmana

Ask the cyber geek. Ask the grandmother. Ask the jobless weaver. Ask the government school teacher.

They all want the same thing, and they have told themselves it is finally round the corner. Carved out of Andhra Pradesh, the separate state they have dreamed of for generations, Telangana.

In one village, a quiet SMS campaign is gaining strength. “Every day, I send out thousands of messages, asking people to vote for a party that will support a separate state for our people,” says Taniparti Tirupati Rao, a 30-year-old school teacher at a government primary school in Tahinikondapur. (మరింత…)

Telangana – elections once again మార్చి 16, 2009

Posted by M Bharath Bhushan in Congress, elections, Identity, politics, TDP, Telangana, TRS.
add a comment

Elections give Telangana a brief day in the sun

G S Vasu

We used to be obscure villagers in a backward region, but of late, my fellow voters and I have become the much sought-after. And one need hardly fathom the reason. Elections are due in a month and all parties are out to convey the impression that they empathise with Telegana’s aspirations to statehood. But I can see through the hypocrisy.

 

Over the past week, I have tried talking to politicians and ordinary people to figure out where I stand in the overall scheme of things, post-elections, and I am convinced that I will be treated like a disposable napkin. This despite the fact that Telangana accounts for 119 of the total 294 constituencies in the state and the region is almost as big as Kerala or Orissa. (మరింత…)

మేల్కోవాల్సిన కాలం – politics without people? మార్చి 16, 2009

Posted by M Bharath Bhushan in Congress, elections, Identity, PRP, SEZ, TDP, Telangana, Telugu (తెలుగు), TRS.
add a comment

మేల్కోవాల్సిన కాలం
– అల్లం నారాయణ

తెలంగాణ, మాదిగ దండోరా ఉద్యమాల విషయంలో ఆయా ఉద్యమాల లొసుగులు, లోపాలు, అవగాహనల్లో కూడా ఏర్పడుతున్న సర్దుబాటు, వెసులుబాటు ధోరణులు ప్రమాదకరం కాదా? ఈ హెచ్చరిక ఇప్పటి అవసరం కాదా? అందుకే మిత్రులారా! బహు పరాక్‌… పరాజితులవుతున్న వారిప్పుడు మేల్కొనవలసి ఉన్నది. పారా హుషార్‌.

అప్పటి దాకా ప్రజాస్వామ్య ముఖందాల్చిన ఏలిక, అప్పటి దాకా సాధుజీవిగా కనపడిన ఏలిక, అప్పటిదాకా సకల జనావళి ఆశలు, ఆకాంక్షల ప్రతినిధిగా కనపడిన ఏలిక ఆ తర్వాత ఎందుకు? అసలు రూపంలోకి మారతాడు. ఓట్లు కొల్లగొట్టడానికి, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అలవికాని అనేక వాగ్దానాలు చేసే ఏలిక, స్వయం అంగీకారం కాని, స్వభావ విరుద్ధ హామీలను ఇచ్చే ఏలిక, సాధుజంతువులా తలపించే ఏలిక అనంతరం నియంత రూపంలోకి మారడానికి ప్రత్యేక కారణాలుండవా? చంద్రబాబు అయినా, వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి అయినా ఎన్నికల ముందు స్వభావాలకు, అనంతరం స్వభావాలకు ప్రతిరూపాలు.

ఒకేలాగా అచ్చుగుద్దినట్టుగా ఎన్నికల ముందు ఒక విధంగా, ఎన్నికల అనంతరం మరో విధంగా వ్యవహరించడానికి, ప్రతి అయిదేళ్లకోసారి ఈ తంతు జరగడానికి, ఒక పాత్ర తర్వాత, మరొకరు పాత్ర పోషించడానికి గల కారణాలు బహుశా కమ్యూనిస్టు మేధావులకు అర్థం కావడం లేదేమోకానీ, ‘ఓటు దాటినంక బోడిమల్లన్న’ అనేది ఇప్పుడు సామాన్య జగమెరిగిన సత్యమే. అధికారం ప్రారంభాన, అధికారాంతాన చంద్రబాబు, వై.ఎస్‌లకు అనేక సాపత్యాలు చూపవచ్చు. కనుక ఏలికలు ఇట్లాగే ఉంటారన్న దగ్గర ప్రారంభమవుతే ముందుగా భ్రమలు తొలిగే అవకాశం ఉంది. అవి ప్రజాస్వామ్య ఆకాంక్షలు, ఉద్యమాలు, డిమాండ్లు కావొచ్చు, రోజువారీగా జనం ఎదుర్కునే జీవన్మరణ సమస్యలు కావొచ్చు. సంక్షేమ రాజ్యాల్లో అందని సంక్షే మం కావొచ్చు. కడుపు మండే ప్రతి సమస్యకూ జనబాహుళ్యం ప్రతిస్పందన కావొచ్చు.

ఏలికలు ఎన్నికలు దాటేదాకా అనుసరించే ధోరణి, ఆ తర్వాతి ఆధిపత్యానికి మూలాలు మరెక్కడో ఉంటాయన్న స్పృహ లోపించడమే ఇప్పటి సమస్య. ఒకవైపు జాతులు, జెండర్లు, ప్రాంతా లు, అస్తిత్వాల మధ్య పెరుగుతున్న అసమానతలు, అవి ముందుకు తెస్తున్న ఆకాంక్షలు, మరోవంక ధనవంతులకు ఆర్థిక మాంద్యం దినాల్లో బెయిల్‌అవుట్లు, సెజ్‌ల పేరిట కేంద్రీకృత అధికారాన్ని కట్టబెట్టేందుకు భూములు అప్పగించడం, పన్నురాయితీలు కల్పించడం, ప్రభుత్వాలు స్వయంగా దళారీ పాత్ర పోషించడం అనే రెండు విరుద్ధాంశాల ప్రతిఫలనమే ఇప్పటి సమాజం. సహజంగానే ఏలిక ప్రజల న్యాయబద్ధమైన ప్రజాస్వామిక ఆకాంక్షల పట్ల ఉదారంగా వ్యవహరించినట్టు కనబడడం ఒక అనివార్యత. (మరింత…)