jump to navigation

లక్ష్మి ఆసు యంత్రం Aasu weaving machine inventor Mallesham from Aleru జూన్ 8, 2012

Posted by M Bharath Bhushan in Art, Culture, Economy, heritage, Identity, livelihoods, Nalgonda, Telangana, Telugu, Telugu (తెలుగు).
Tags: , , , , , , ,
trackback

…అమ్మకో నూలుపోగు

అతనొక శాస్త్రవేత్త కాదు. ఇంజనీరు అంతకన్నా కాదు. వచ్చీ రాని చదువు చదివిన ఓ పల్లెటూరి బిడ్డ మాత్రమే. కానీ, తల్లి కష్టాన్ని చూసి చలించి, ఆ పనిని సులువు చేసే యంత్రాన్ని కనిపెట్టిండు. తాను రూపొందించిన యంత్రం విజయవంతం కావడంతో దానికి తల్లి పేరే పెట్టుకుని రుణం తీర్చుకున్నడు ఆ గ్రామీణ శాస్త్రవేత్త, తెలంగాణ ముద్దుబిడ్డ మల్లేష్, అతడికి స్ఫూర్తినిచ్చిన తల్లి లక్ష్మిపై ‘బతుకమ్మ’ ప్రత్యేక కథనం.
~ రచ్చ శ్రీనివాస్, టీన్యూస్, ఆలేరు టౌన్

నల్లగొండ జిల్లా ఆలేరు మండలం శారాజిపేట గ్రామానికి చెందిన చింతకింది మల్లేష్ రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిండు. ఏడేళ్ల నిరంతర శ్రమ ఫలితంగా ‘ఆసు పోసే యంత్రానికి’ రూపకల్పన చేసిండు. మొదట్లో పడరాని పాట్లు పడ్డడు. వినరాని మాటలు విన్నడు. కానీ, ఇవ్వాళ ఆ యంత్రం పనితీరు విజయవంతం కావడంతో అందరితో ‘శెభాష్’ అనిపించుకుంటున్నడు. తాను ఆవిష్కరించిన ఆ యంత్రానికి పేటెంట్ హక్కును కూడా సంపాదించుకున్నడు. అన్నిటికీ మించి, అమ్మ పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయి దాన్ని సులువు చేసే యంత్రాన్ని కనిపెట్టిన ఈ బిడ్డ ఆ యంత్రానికి ‘లక్ష్మి అసు యంత్రం’ అని తన తల్లి పేరే పెట్టుకున్నడు. అట్ల తల్లి రుణం తీర్చుకున్న ఈ బిడ్డ రాష్ట్రంలోనే కాదు, దేశంలోని నేతకారులందరికీ ముద్దుబిడ్డ అయ్యిండు. అయితే, ఆయన తన ఆవిష్కరణకు మూలం ‘కులవృత్తే’ అన్నడు. తామందరూ వదిలి పెట్టకుండా కొనసాగుతున్న కుల వృత్తే నన్ను ‘శాస్త్రవేత్త’ను చేసిందని అన్నడు. అష్టకష్టాలు పడైనా సరే, తమ వృత్తిని కొనసాగించుకోవాలన్న స్పృహే తనను ఇవ్వాళ నలుగురిలో గుర్తింపుకు కారణమైందని ఆయన సవినయంగా మనవి చేసిండు. అదీ ఈ నల్లగొండ బిడ్డ వినవూమత. ఇంతకీ మల్లేష్ కనిపెట్టిన ఆ యంత్రం ఏమిటి? అసలు ‘అసు’ పోయడం అంటే ఏంది? మొత్తంగా, ఎట్లా ఆయన ఆ సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించిండో చూద్దాం….


కులవృత్తిని వదల లేక…
రాష్ట్రంలో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 40 వేల కుటుంబాల దాకా చేనేత వృత్తిపై ఆధారపడి బతుకుతున్నయి. ఎంత కష్టపడినా వాళ్ల పేదరికం పోతలేదు. ఎన్ని రకాల బట్టలు నేసినా వారి కష్టాలు తీరడం లేదు. చింతకింది మల్లేష్ కుటుంబం కూడా అటువంటిదే. తనది ఆలేరు మండలం శారాజిపేట అనే చిన్న గ్రామం. 7వ తరగతి దాకా చదువుకున్నడు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో మల్లేష్ తండ్రి తన ఇద్దరు కొడుకుల్ని చదువు మాన్పించి మగ్గం నేయమన్నడు. మగ్గం నేయడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. మొదట చీర నేయాలంటే ముందు ‘ఆసు’ పోయాలి. ‘ఆసు పోయడం’ అంటే పట్టుదారాన్ని కొయ్యకు చుట్డడం. ఒక కొయ్య నుంచి 40 కొయ్యలకు 9 వేల సార్లు అలా చెయ్యి తిప్పాలి.

ఇంత చేస్తే, రెండు చీరలకు సరిపడా చిటికిను మాత్రామే పోసేది మల్లేష్ తల్లి. ఒక్క చీరకు ‘ఆసు’ పోయాలంటే చాలా సమయం పడుతది. అయితే దశాబ్దాలుగా పని చేసీ చేసీ ఆ తల్లి బలహీనపడింది. సాధారణంగా ఈ ఆసు పోసే పని మహిళలే చేస్తరు. అట్లా వేలాది తల్లుల మాదిరిగా మల్లేష్ తల్లి కూడా ఒకానొక రోజు ‘నావల్ల కాదు బిడ్డా…’ అంది. అయితే, ఆసు పోసే పని ఆగిపోతే మగ్గం ఆగిపోయినట్టే. అందుకే, చేసేదేం లేక ఆ తల్లి, తానెలాగూ ఈ పని చేయలేక పోతున్నందువల్ల కొడుకులను బయట ఏదో ఒక పని చూసుకోమని చెప్పింది. కానీ, మల్లేష్ తల్లి మాట వినలేదు. కులవృత్తిని ఒదులుకోవడం ఇష్టం లేక ఆయన తన మెదడుకు పదును పెట్టడం ప్రారంభించిండు. ఇదంతా ఏడేళ్ల కిందటి ముచ్చట.

చెక్క ముక్కలతో మొదలు
ఒక చీరకు చేతితో ఆసు పోయాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది. దీనివల్ల కంటిచూపు దెబ్బతింటది. చేతులు లాగుతయి. మెడలు పట్టేస్తయి. ఇటువంటి సమస్యలతో ఆడవాళ్లు చాలా ఇబ్బందులు పడుతుంటరు. ‘అన్నింటికీ మిషన్లు వచ్చాయి. దీనికి కూడా ఏదైనా మిషన్ వస్తే బాగుండు’ అని చాలామంది మహిళలు అంటనే ఉంటరు. ఆ తల్లి కూడా అట్లనే అనేది. ఈ మాటలే మల్లేష్‌కు స్ఫూర్తినిచ్చాయి. ఇట్లే కాదు, ఈ పని చేయడం రోజు రోజుకూ కష్టంగా మారడంతో, ‘ఈ గొడ్డు చాకిరి మీకెందుకు తండ్రీ… ఏదైనా సుఖంగా ఉండే పని చూసుకోండి’ అని కూడా మల్లేష్ తల్లి పదేపదే అనేది. ఈ మాటల ప్రభావమూ మల్లేష్‌పై పడింది. ‘ఆసు పోయడంలోని కష్టాన్ని ఎట్లయినా పరిష్కరించాలి’ అన్న బలీయమైన ఆలోచనకు తోడ్పడింది. ఇక మల్లేష్ అదే పనిగా ఆలోచించేటోడు. మెల్లగా ప్రయత్నాల్లోకీ దిగిండు. నాలుగు చెక్కముక్కలు తీసుకొని ప్రయత్నం మొదలు పెట్టాడు. ఒక రోజు తన మనసులో మెదిలిన ఒక రూపానికి యంత్ర రూపం ఇవ్వడం ప్రారంభించిండు. అయితే, ఇది నెలా, రెన్నెళ్లలో జరగలేదు. ఆ యంత్రం ఏ సైజులో ఉండాలి, ఏ విధంగా ఉంటే పని చేస్తుంది…వంటి విషయాల్లో అవగాహన రావడానికే అతడికి మూడేళ్లు పట్టింది. అయితే తను పట్టుదలగా ఈ ప్రయత్నాల్లో ఉన్నడన్నమాటే గానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు. అసలే అంతంత మాత్రం సంపాదన… ఆపై కొడుకు యంత్రం తయారు చేస్తానంటూ తిరగడం ఇంట్లో వాళ్లకు అస్సలు నచ్చలేదు. అయినా మల్లేష్ ఊరుకోలేదు. తన పనిలో తానున్నడు. ఏ కొంచెం డబ్బు వచ్చినా ఆ యంత్రం విడిభాగాలు కొనుక్కోవడానికే ఖర్చు పె మెల్లగా మల్లేష్ అప్పులు చేయడం కూడా మొదలు

నవ్విండ్రు… తిట్టిండ్రు…
అప్పులు చేసి యంత్రం తయారు చేయడం మొదలు పెట్టినంక మల్లేష్‌ను అందరూ తిట్టేటోళ్లే. అవును. దగ్గరివాళ్లూ, దూరం వాళ్లూ అన్న తేడా లేదు. అందరూ తిట్టడం మొదలు వెట్టిండ్రు. ‘మగ్గం నేయడానికి బద్దకం…అందుకే ఆసుయంత్రం అంటున్నడని’ హేళన చేశారు. అయితే ఈ విమర్శలను మల్లేష్ ఎన్నడూ పట్టించుకోలేదు. కాకపోతే, యంత్రం తయారీ డెబ్బయ్ శాతం పూర్తైంది, ఇంకా ముప్పయ్ శాతం ఎలా పూర్తి చేయాలో ఆర్థంకాక చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇదంతా గమనిస్తున్న తల్లిదంవూడులు ‘‘నువ్వు శాస్త్రవేత్తవూ కావు, ఇంజనీరువూ కావు. చదువు, సంధ్యాలేని పల్లెటూరి వాడివి. ఇవన్నీ నీకెందుకు రా…’’ అని వాళ్లు అన్నరు. ‘‘అయినా పెద్ద సదువులు చదువంది అ కిటుకులు నీకెట్ల తెలుస్తయి రా…’’ అని తల్లిదంవూడులు మందలించిండ్రు. ‘బుద్ధిగా ఏదైనా ఉద్యోగం చేసుకో…’ అంటూ హైద్రాబాదుకు పంపించిండ్రు.

అదే ఆలోచనలో ఉండగ…
హైద్రాబాద్‌కు వచ్చినంక మల్లేష్ బాలానగర్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో కుదిరిండు. పనిచేస్తూనే ఆసు యంత్రం తయారీలో మిగిలిన భాగాల గురించి శోధించడం మొదలు స్నేహితుల సలహాలతో మరో ఇరవై శాతం పనిని పూర్తి చేసిండు. అయితే, ఈ క్రమంలో తనకు చిన్నా, చితకా టెక్నికులు తెలియక ఇంకో పది శాతం పని పూర్తి చేయలేక పోయిండు. అయితే, అనుకోకుండా ఒక రోజు తాను పనిచేస్తున్న కంపెనీల నడుస్తున్న ఓ యంత్రంపై మల్లేష్ దృష్టి పెడింది. యంత్రానికి ఉన్న ఒక విడిభాగం లాంటిదే ఆసుయంవూతానికి కావాలని గ్రహించిండు. వెంటనే ఒక వెల్డింగ్ షాపుకు పోయి అసొంటి భాగం ఒకటి తయారు చేయించుకొని ఆసు యంత్రానికి అమర్చి చూసిండు. పట్టుదారాన్ని పెట్టి ఆసు పోసి చూసిండు. ఆశ్చర్యం. అనుకున్నట్టే ఆ యంత్రం సూపర్‌గా పని చేసింది. తాను కలగన్న యంత్రం తయారీ పూర్తయింది. ‘అమ్మా…నీ కష్టం తీరిందే…’ అని చాలా సంతోషించిండు మల్లేష్. అవును మరి. ఏడేండ్ల శ్రమకు తగ్గ ఫలితం అది. ఇక మల్లేష్ ఆనందానికి అవధులు లేవు. ఊరికి బయలు దేరిండు.
ఇల్లంతా జాతర…మల్లేష్ తయారు చేసిన ఆసు యంత్రం పని చేస్తుంటె ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోయిండ్రు. యంత్రం తయారు చేసినప్పుడు తిట్టినవాళ్లంతా మల్లేష్‌ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తిండ్రు. విషయం చుట్టుపక్కల వాళ్లకు సుత తెలిసింది. గంతే. ఇక నెల రోజులదాకా… నల్లగొండ జిల్లా నేతకారులు మల్లేష్ ఇంటి సుట్టే తిరిగిండ్రు. ఆసు యంత్రం పడుగును పోస్తున్న తీరు చూసి మహిళలందరు మురిసిపోయిండ్రు. ఇగ తమ కష్టం తీరిపోయిందని వాళ్లు ఆనందంతో మల్లేష్‌కు తల నిమిరిండ్రు. ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుకున్నరు.

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు…
మల్లేష్ చేసిన ఆసు యంత్రం నేషనల్ ఇన్ఫోసెస్ ఫౌండేషన్ దృష్టికి వెళ్లింది. ఆ ఫౌండేషన్‌కు సంబంధించిన అధికారులు స్వయంగా ఈ యంత్రాన్ని పరిశీలించిండ్రు. ‘ఇసొంటి యంత్రం భారతదేశంలో ఎక్కడా లేదంటూ’ వారు మల్లేష్‌ను అభినందించిండ్రు. ఆయన కృషికి గుర్తింపుగా రాష్ట్రపతి చేతులమీదుగా ‘గ్రామీణ సాంకేతిక ఆవిష్కరణ, సాంప్రదాయ పరిజ్ఞాన శోధన’ పేరిట ఒక అవార్డును కూడా ఇచ్చిండ్రు.

అమ్మ పేరుతో అసు యంత్రం…
అన్నట్టు, ఈ ఆసు యంత్రానికి మల్లేష్ తన తల్లి పేరే పెట్టిండ్రు. అవును. ‘లక్ష్మి ఆసు యంత్రం’గా నామకరణం చేసిండు. ఎస్‌ఐఎఫ్ వాళ్లు 15 సంవత్సరాలకు ఈ లక్ష్మి ఆసు యంత్రానికి పేటేంట్ కూడా చేయించిండ్రు. మల్లేష్‌ను అభినందిస్తూ నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ‘‘…నీలాంటి గ్రామీణ యువకులు తమ ప్రతిభను వెలికి తీస్తే మన దేశం ప్రపంచానికి ఎన్నో అద్భుతాలను పరిచయం చేస్తుంది’’ అని అభినందించిండ్రు.

లక్షల వ్యాపారం…
కూటికోసం పాట్లు పడ్డ మల్లేష్ ఆసు యంత్రం వల్ల లక్షల వ్యాపారం చేశాడంటే నిజంగా మనందరం సంతోషించాలె. ఇప్పటి దాకా తాను నల్లగొండ జిల్లాలోనే 800 నుంచి వెయ్యి ఆసు యంత్రాలను అమ్మిండు. ఒక్కో అసు మిషన్ ధర రూ॥ 8 వేల నుంచి 15 వేలుంటుంది. వీటిని వ్యక్తిగత స్థాయిలో నేత కార్మికులు కొనుగోలు చేసిండ్రు. ఇటీవలి కాలంలో ఒరిస్సాలోని కటక్ జిల్లా వాసులు కూడా కొన్ని ఆసు యంత్రాలను కొనుగోలు చేసింవూడట. వాటి పనితీరును చూసి అక్కడి మహిళలు ఎంతో సంతోషించింవూడని మల్లేష్ చెప్పిండు. ‘‘ మీ అమ్మ కష్టాన్నే కాదు, ఎందరో అమ్మల కష్టాల్ని తీర్చినవ్ బిడ్డా…’’ అంటూ ఆ యంత్రాలను కొనుగోలు చేసిన తల్లులు మల్లేష్‌ను అభినందించి, ఆశీర్వదించింవూడట.

ఆలేరులోని కొన్ని చేనేత కుటుంబాలు…

ఈ యంత్రం గురించి మల్లేష్ స్వగ్రామం అయిన ఆలేరులోని కొన్ని చేనేత కుటుంబాలను పలకరిస్తే వాళ్లంతా ఈ యువకుడిని అభినందించిండ్రు. ‘‘మా చేనేత కార్మికుల కష్టాలు అందరికీ తెలుసినయే. ఇలాంటి సమయంలో మల్లేష్ కనిపెట్టిన యంత్రం మాకెంతో ఉపకారం చేసింది’’ అన్నరు. అయితే, ఆ యంత్రం కొనుక్కునే స్థోమత లేని వందలాది నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ తమ రెక్కల కష్టంతోనే ఆసుపోసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నరు. ప్రభుత్వం ఇటువంటి నిరుపేద కుటుంబాలకు బ్యాంకుల ద్వారా రుణాలిచ్చి ఆసు యంవూతాన్ని కొనుగోలు చెయ్యాలని వారంతా ముక్త కంఠంతో కోరుతున్నరు.

ఇంక చాలా చేసి చూపిస్త…

‘‘నాకు గుర్తింపు వచ్చిందే తప్పా ప్రభుత్వం నుంచి ఎసొంటి సహకారం అందలేదు’’ అని మల్లేష్ అన్నడు. ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం అందజేస్తే చేనేత అభివృద్ధికి తోడ్పడే ఎన్నో నవీన యంత్రాలను తయారు చేస్తననీ ఆయన అన్నడు. ‘‘లక్ష్మీ అసు యంత్రం ఒక్కటే కాదు, ఇంకా చాలా చేసి చూపిస్తాను’’ అన్నడాయన. ఆసు మిషన్‌తోనే ఆధునిక డిజైన్లు తయారు చేసేందుకు కొత్త యంత్రాన్ని కూడా తయారు చేసినట్లు ఆయన వివరించిండు. ప్రస్తుతం ఉన్న డిజైన్లను మైమరిపించే విధంగా, చేతితో చేయలేని డిజైన్లను ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ ద్వారా ఆవిష్కరించనున్నట్టు ఆయన చెప్పిండు. ఇలాంటి ఆధునిక డిజైన్ల కోసం కొయ్యకు ఎన్ని పోగులు పొయ్యాలో అన్ని పోగులు పోసే ఒక యంత్రాన్ని రూపొందించినట్టు, అది కూడా త్వరలో అందుబాటులోకి తెస్తనని ఆయన వివరించిండు.

మల్లేష్ మొబైల్: 92472 82778

source:http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=9&ContentId=112946

వ్యాఖ్యలు»

1. m.v.mahender reddy - డిసెంబర్ 9, 2014

Bharatha desham lo enno chenetha kutumbaalu unnaai. aneka mandi mahilalu indulo pani chestunnaru vaariki laxmi aasu yanthramu supply cheste entho shrama thagguthundi.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: