jump to navigation

ప్రజల కూటమి కావాలి People’s Alliance for Telangana జనవరి 25, 2009

Posted by M Bharath Bhushan in elections, Identity, NTPP, politics, Telangana, Telugu (తెలుగు), TRS.
2 వ్యాఖ్యలు

ప్రజల కూటమి కావాలి

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకం కావాలి. తెలంగాణ ఓడ విజయ ఢంకాతో దరి చేరాలి. అందుకే తెలంగాణ నాయకులు ప్రజల కూటమిలోకి రావాలి.

ఎన్నికల దృష్ట్యా రాజకీయాలు వేడెక్కాయి. గత ఐదు సంవత్సరాలలో రాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్థికరంగాలలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త రాజకీయ శక్తులు ప్రజారాజ్యం పార్టీ, నవ తెలంగాణ పార్టీ ఆవిర్భవించా యి. కోస్తా, రాయలసీమలకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు కొందరు ప్రజారాజ్యంలోకి వలస వెళ్ళారు. టిడిపి, సిపిఐ, సిపిఎంలు ఎన్నికల అవగాహనతో కూటమి కట్టారు. ఈ కూటమిలోకి టిఆర్‌ఎస్‌ను కూడా ఆహ్వానించడం తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపు.

సామాజిక రంగంలో బడుగు బలహీన వర్గాల చైతన్యం పెరిగింది. రాజ్యాధికారంలో తగిన వాటాకోసం గొంతు విప్పుతున్నారు. ముఖ్యంగా 93 కులాల బిసిలు ‘రాష్ట్ర జనాభాలో 55 శాతం ఉన్నా తమకు 10-15 శాతం వాటా రావడం లేద ని’ అధికార పార్టీలను నిలదీస్తున్నారు. బిసి కులాలకు చెందిన వివిధ సంఘాల వారు , ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు చైతన్యవంతమైన పౌరులుగా సంఘటితమవుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. ఇది ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లే’నని బిసి మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ వర్గాలనుంచి ఎదిగివచ్చిన దేవేందర్‌ గౌడ్‌ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఈ ఆధిపత్య పార్టీల అధినాయకత్వాలకు ఏ మాత్రం రుచించడం లేదు. గత ఆరుదశాబ్దాలుగా అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న రాష్ట్ర రాజకీయాధికారాలను కింది వర్గాలకు పంచడం పాలక పార్టీలకు అసలే మింగుడు పడటంలేదు.

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని కూడా ఈ పార్టీలు, ఆధిపత్యకులాలు అదే దృష్టితో చూస్తున్నాయి.  కాంగ్రెస్‌ పార్టీ మన రాష్ట్రంలో మొదటినుంచి ఒక సామాజికవర్గానికి పెద్ద పీట వేసింది. బిసిలకు మరీ మొండిచెయ్యి ఇచ్చిన ఘనకీర్తి కాంగ్రెస్‌ పార్టీకే దక్కింది. తెలుగుదేశం పార్టీ మరో సామాజిక వర్గానికి అవకాశాలు మెండుగా కల్పించింది. ఇక బిసిలకు కొసరేసినట్టు చిన్న చితక పదవులు ఇచ్చిన పేరు దక్కించుకుంది. గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఘరానా నేరాలు మితిమీరి పోయాయి. లంచగొండితనం సునామిలాగ సమాజాన్ని ముంచెత్తింది. పరిటాల రవి హత్యతో మొదలైన హింస రకరకాల రూపాల్లో విలయ తాండ వం చేస్తోంది. కప్పట్రాల హత్య, జైల్లోనే మొద్దు శీను హత్య, అనేక మంది ప్రతిపక్ష నేతలు, కార్యకర్తల హత్యలు రాష్ట్రంలో నిత్యకృత్యాలు అయిపోయినాయి. మన ‘రైతురాజ్యం’లో ఎరువుల కొరకై క్యూలో నిలబడ్డ రైతులు చంపబడ్డారు. (మరింత…)

తెలంగాణ పోరు- సాంస్కృతిక వారసత్వం source of Telangana movement జనవరి 24, 2009

Posted by Telangana Utsav in Culture, Identity, Poetry & Songs, Telangana, Telugu (తెలుగు).
8 వ్యాఖ్యలు

పాటే ప్రాణం!
అల్లం నారాయణ

నిద్రలున్న విత్తుకు ప్రాణం మొలకెత్తినట్టు, మట్టిపెళ్లలవాసన మల్లెల గంధమైనట్టు, శిశిరమై రాలిన జీవం చిగురించిన వసంతమైనట్టు, అడవి నిండుగా సింహగర్జన ప్రతిధ్వనించినట్టు, సమ్మక్క, సారక్కల అమ్ముల పొది నుంచి దూసిన కరవాలం అంచు మెరుపు తీగెయై మెరిసినట్టు, బక్క కుల వీరుని పొలికేక సర్వాయిపాపన్న సింహనాదమైనట్టు, మొగులు చిల్లుబడి దారైనట్టు, నేల పొంగి వరదయ్యినట్టు, అడవిలో కోయిలగానమై, పట్నంల తీన్‌మారై, సింగరేణిల సైరన్‌ మోగించి, పోరుపొత్తిళ్ల తెలంగాణ గానం వినిపిస్తున్నారు తెలంగాణ కళాకారులు.

మోట కొట్టిన రాత్రి మోగిన పాట/ తాడు పేనిన తండ్రి తలపులున్నప్పు/కల్లమూడ్చిన అవ్వ కలలోని గింజ/ ఆరుగాలము చెమట నా తెలంగాణ/ ఆక లి దప్పుల మంట నా తెలంగాణ… ఇదొక పాట. ఈ పాట రచయిత నిజానికి సుప్రసిద్ధ వచనకవి, నందిని సిద్ధారెడ్డి. తెలంగాణ కోసం ఆయనిప్పుడుమందిలో మోగే నినాదం లాంటి పాట పాడటం ఇప్పటి సందర్భం. రాజీవ్‌ రహదారివెంట వెళ్తుంటే సిద్దిపేట. అక్కడి దాబాల్లోంచి ఏ పవన్‌కళ్యాణ్‌ ‘తాగినట్టుందే’ అని పాట మోగదు. తెలంగాణ జమిడికె మోతల నాదాలు మోగుతాయి. సుప్రసిద్ధ పాటగాళ్ల, గొంతులు ఆకాశాన్నావరిస్తుంటాయి. ఒక తెలంగాణ వాతావరణం, ఇక తెలంగా ణ తప్పదన్నంత భ్రాంతీ కలుగుతుంది. సిద్దిపేట దాటిన ప్రతివాహనంలో ఒక తెలంగాణ పాటల క్యాసెట్‌ (సీడీ లు) అదనపు ఆకర్షణ. పేర్లెందుకు? ఒక పేరేమిటి? మలి తెలంగాణ ఉద్యమం ప్రధానంగా సంస్కృతీ వికసనం.

ఈ మాటంటే తెలంగాణ ఉద్యమానికి పేటెంట్‌ హక్కు మాదే అంటున్న కేసీఆర్‌ లాంటి రాజకీయ నేతలకు కోపం వస్తే రావొచ్చుగాక గానీ.. తెలంగాణకు ఒక సంప్రదాయం ఉంది. అది సంస్కృతికి సంబంధించింది. కళారూపాలకు సంబంధించింది. నవ్వొచ్చినా, ఏడ్పొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, కోపమెచ్చినా, దిగులుపడినా, గుబులు పడినా, నాటేసి నా, కోసినా, దున్నినా, దోకినా.. ఉద్యమం జెండా ఎగరేసినా అలనాటి సాయుధ రైతాంగపోరాటమైనా, డెబ్భై, ఎనభైయవ దశకాలను వెలిగించిన నక్సల్బరీ అయినా పాట ఒక ఆయుధం. ప్రజాకళలు ఒక ఆయుధం. శ్రీశ్రీ కవిత్వం చదివి అరవైలలో నక్సలైట్లు, కమ్యూనిస్టులయి తే, అనంతర తరం గద్దర్‌ పాటలు విని విప్లవాల్లోకి నడిచారు. గోరటి ఎంకన్నల ‘పల్లెకన్నీరు’ గోసలు కని తెలంగాణ వాదులయ్యారు. ఇదే వాస్తవం.

నిజానికి మలి తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు నడిపించిందెంతో కానీ, పది జిల్లాల్లో ఇప్పటి దాకా జరిగిన వందలాది సభలు, సమావేశాలు, ధూమ్‌ధామ్‌లు జరిపిన భావజాల వ్యాప్తి ఇప్పటి ఉద్యమానికి అందివచ్చిన ఒక ఆయుధం. జగిత్యాల జైత్రయాత్రకు సరిగ్గా ముప్పదేండ్ల వయసు. అలనాటి ఆ సమూహాలను జగిత్యాల నిండిన అప్పటి జనవాహినిని ఇప్పటికీ ఒక మలుపుగా చెబుతా రు. అలనాటి ఆ జనవాహినిలో చిందేసింది కూడా పాటే. ఆ తర్వాత నక్సల్బరీ తరాలకు, రాజకీయ భావజాల ప్రచారానికి పాటే ఒక వేడుక. ఇప్పుడిక తెలంగాణకు ఇదే సంప్రదాయం. అలనాటి నూనుగుమీసాల యువకులు, పాతికేళ్ల పడుచులు ఇప్పుడు తలపండిన నడీడు మనుషులు. ఆ స్వప్నం సాకారం కాలేదు. (మరింత…)

ప్రళయ దినం ముందున్నది.. once again mortgaged Telangana జనవరి 18, 2009

Posted by M Bharath Bhushan in Congress, elections, Identity, NTPP, politics, PRP, TDP, Telangana, Telugu (తెలుగు), TRS.
3 వ్యాఖ్యలు

ప్రళయ దినం ముందున్నది…
-అల్లం నారాయణ

ఊరూరికి పాటపాడి తెలంగాణన్నరు. నమ్మినోళ్లు చాలా మంది ఊరేగింపులన్నరు. వీధులన్ని మళ్లీ పెనుకేకలయినయి. తెలంగాణల మల్లా లడాయి జోరుగైనది. ఉద్యమాల మాల గుచ్చి అమర వీరుల కేస్తరు. ఆ త్యాగఫలం ఆశజూపి కొందరు నేతలయితరు. కలిసొచ్చి వారు తెలంగాణ దూతలవుతరు. సిద్ధాంతకర్తలు కొందరు తోడుగుంటరు. సై అంటే సై అని మోసాలకు మలాము పూస్తరు.

కొందరు తమ వాగ్దానాలను, దేవుని విషయంలో చేసిన ప్రమాణాలను అతి స్వల్ప మూల్యానికి అమ్ముకుంటారు. ప్రళయదినాన దేవుడు వారివైపు కన్నెత్తి కూడా చూడడు. -ఖురాన్‌

 బహుశా కొందరు చాలా విషయాలు మరచిపోతుంటారు. దేన్ని దేనికోసం ప్రారంభించారో? ఏది ఎందుకు తనకు గౌరవం సమకూర్చి పీఠాలెక్కించిం దో? ఏ కారణం చేత తామొక విభాత సంధ్యలో కాలం మీద వీరులమై కవాతు చేస్తున్నామో మరచిపోతారు. అల్ప విషయాల కోసం అనల్పాన్ని బలిపెడతారు. ఏ ఉద్యమాలు నిన్ను వీరున్ని చేశాయో ఆ ఉద్యమాలను తాకట్టుపెడితే జరిగేదేమిటి? పోనీ ఒరిగేదేమిటి. తెలంగాణ ఒక శతకోటి గాయాల వీణ. వేల మోసాల మాయల గాయాలపాలైన నేల. అసెంబ్లీలో బుద్ధిగా కూచొని ఉన్న గాంధీ విగ్రహం ఎదురుగా ఒక స్థూపం ఉన్నది. అధికారికంగా ఇప్పటికీ అది ఆవిష్క­ృతం కాకుండా అనధికార ధిక్కార స్వరంలా ఉన్నది.

ఆ స్థూపంలో ఎన్నం ఉపేందర్‌ మరి మున్నూటా డెబ్భై మందికి పైబడిన తెలంగాణ అమరవీరుల ‘యాది’ ఉన్నది. ‘మనాది’ ఉన్నది. త్యాగమున్నది. నిండైన తెలంగాణ కల ఒకటున్నది. అది కాలిపోయి కూలిపోయిన వాస్తవంగా మారి హృదయఘోష వినిపిస్తున్నది. నలభై ఏండ్ల క్రితం కొడుకులను పోగొట్టుకున్న తల్లుల దుఃఖపు వెక్కిళ్లు ఉన్నవి. అవి కాల చక్రంలో ప్రతి సందర్భంలోనూ వినిపిస్తున్నవి. గుండె గొంతుకలో కొట్లాడిన ఒక తెలంగాణ ఆత్మ ఉన్నది. గత మొక వారసత్వపు కవాతు కోసం ఎదురు చూస్తూనే ఉన్నది. త్యాగాల చాళ్లు చివరికి రాజకీయపు దుర్గంధంలో మసి బారుతున్నవి. కాంగ్రెస్‌ పార్టీ యాభై ఏళ్ల మోసంతో కలె బారుతున్నది. తెలంగాణ ఆత్మనది బేరసారాల, గెలుపు ఎత్తుగడల సారంగా మార్చి ఉన్నది. మొయిలీ చివరకు అబద్ధాల కోరు అయిండు. తెలంగాణకు ఇక తెడ్డేగతి అని తేల్చి చెప్పిండు. కీలెరిగి ఎవరో ఒక వాత పెట్టిం డు.

అట్లానేనన లేదని నోరెళ్లబెట్టిండు. మొత్తానికి తెలంగాణకు ప్రాణ సంకటం కాంగ్రెస్‌ కది చెలగా టం. తెలుసు తెలుసు ఈ నాటకం. కడప వాసి రాజశేఖర రెడ్డి మాట మొయిలీ నోట చిలక పలుకులయ్యిం ది. మరోసారి మరోసారి, మరోసారి తెలంగాణ అరిగోస పడింది. పీఠం ఎక్కేదాక తెలంగాణ ముద్దుగున్నది. దోచుకోను తెలంగాణ బొద్దుగున్నది. హైదరాబాద్‌ బిర్యానీ భలె రంజుగున్నది. రింగురోడ్డు పంట భూములన్ని కమ్ముకున్నవి. సగం హైదరాబాద్‌లో వై.ఎస్‌ బాటలున్నవి. హైదరాబాదోని బతుకుల బీటలున్నవి. మొదటి మోసం నాలుగున్నరేండ్లది. దాని వయస్సు అంతకంటే పెద్దగున్నది. విశాలాంధ్ర నుంచీ అది సాగుతున్నది. రెండో మోసానికిపుడు రెక్కలున్నవి. కూటములు కట్టినప్పుడే అవి తేటగున్నవి. తెలంగాణ ద్రోహుల పార్టీ ఇప్పుడు మిత్రుడైనది. తెలంగాణ వద్దన్న సమైక్య పార్టీ ముద్దైనది. నారాయణ, రాఘవులు నవ్వుతున్నరు. ఏడ్వలేక కేసీ ఆరూ పగలబడి నవ్వుతున్నడు. (మరింత…)

Muslims stress a people’s movement for separate Telangana జనవరి 1, 2009

Posted by Telangana Utsav in Culture, Identity, politics, Telangana.
1 comment so far

‘Telangana is in the interest of Muslims’

 

29 December 20083:16pm.

By TwoCircles.net news desk

 

New Delhi: People from different walks of life and organizations came together for discussions on ‘Muslims demand for separate Telangana state: need to make it people’s movement’, on 28th December 2008 at Urdu Ghar, Moghulpura in Hyderabad. Muslims and non-Muslim intellectuals participated in the meeting, discussed, expressed their opinions and also gave their valuable suggestions.

 

Men and Women who participated in the meeting were teachers, of schools, colleges and universities, advocates, employees and trade union leaders, students, activists belonging to different mass organizations, Muslim youths, and also senior citizens who had participated in 1969 Telangana movement.

 

Speakers opined that Muslims of old city are mostly unaware of Telangana issue. The people of Telangana districts are however aware of the issue There is a need to conduct small meetings and make people aware and involve them in the movement. There is false propaganda by the anti Telangana elements, saying them that if the Telangana state is formed problems of Muslims will become worse. But the fact is that separate state of Telangana is in the interest of Muslims.

During the 1969 movement, all the activities for separate Telangana were carried out in and around Charminar. One of the biggest rallies was taken out from Charminar to Raj Bhavan. But today there is no movement in that area and the people are totally ignored by political parties and activists and they are misguided by some vested interests.

 
 

 

Another important point that came out was that there is a need to make political movement a people’s movement. If the separate Telangana state is not formed this time, it can never be achieved and the sufferings of people of Telangana will become worse.

 

Majlis-e-Ittehadul Muslimeen (MiM), political force in Hyderabad strongly oppose formation of Telengana state, since BJP will be a strong force in this region and threaten the security of about 48 lakhs Muslims living in this area. Others term MiM opposition as politically motivated.

 

Speakers in this meet expressed their opinion that the Telangana Movement should not be used as political tool but take it as an opportunity towards the development of the Telangana people by forming a Telangana state. All the political parties should involve themselves in the movement whole-heartedly, but not for the sake of gaining political power. It was viewed that there is lot of difference in expressing and practicing on the issue of Telangana by the political parties. The speakers also expressed great concern over the conspiracies made by the anti-Telangana elements. Therefore there is a need to overcome those conspiracies and come forward united for achieving the goal of Separate Telangana Statehood.

 

The meet was presided by Lateef Mohd Khan and Prof. Rama Melkote. Others who spoke on this occasion were Justice Sardar Ali Khan, K.M.Arifuddin (Madina Education Society), Narsing Rao, Prof Anwar Mozam, Dr. Rafat Seema (NISA), Anwar Khan (Principal of Anwaruloom College), M.A.Basith Khan (TSTU), Mohd Masood Ahmad (DTF) and Dr.M.A.Qayoom (MANU).