jump to navigation

Telangana State- So Near Yet So Far నవంబర్ 26, 2008

Posted by M Bharath Bhushan in Congress, elections, NTPP, politics, TDP, Telangana, Telugu (తెలుగు), TRS.
add a comment

తెలంగాణ ఇంకెంత దూరం?
-ఎ.కృష్ణారావు


ఇప్పుడిక తెలంగాణ కేవలం టిఆర్ఎస్కు సంబంధించిన అంశం కాదు. మిగతా పార్టీలు కూడా ఎజెండాను చేపట్టాయి. ఇక కాంగ్రెస్మాత్రమే ఒక నిర్దిష్టమైన ప్రకటనతో ముందుకు రావలసి ఉంది. కాంగ్రెస్అధిష్ఠానం తీసుకునే నిర్ణయం గురించి వైఎస్కు ఎక్కువ తెలుసా, కెసిఆర్కు ఎక్కువ తెలుసా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గత నాలుగున్నరేళ్లుగా చెబుతున్న మాటలు వింటుంటే తెలంగాణ రాష్ట్రం ఈ పాటికి లెక్కలేనన్ని సార్లు ఏర్పడే ఉండాలి. ఆయన మాట్లాడుతున్న కొద్దీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మరింత దూరం కావడమే కాని సమీపం అయ్యే అవకాశాలు కనపడడం లేదు.

2004 ఎన్నికల్లో విజయం సాధించిన నాటినుంచీ టిఆర్‌ఎస్‌ అధినేత తెలంగాణ రేపో మాపో వస్తున్నట్లు మాట్లాడుతున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని పేర్కొనడం, రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడంతో కెసిఆర్‌ ఎంతో ఉప్పొంగిపోయారు. ఆరునెలల్లో తెలంగాణ వస్తుందని చెప్పారు. ఒక ఏడాది తన జన్మదినం రోజు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ టెలిఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలుపగానే ఆయన సంతోషానికి పట్టపగ్గాలు లేవు.

తెలంగాణ ఆమె ఇచ్చేసినట్లేనని ఊరందర్నీ పిలిచి మరీ చెప్పారు. కానీ ఎక్కడా ఉలుకూ పలుకూ వినపడకపోవడంతో యుపిఏలో భాగస్వామ్య పార్టీలన్నీ ఒక ఒత్తిడి గ్రూప్‌గా మారి తమ సమస్యలపై డిమాండ్‌ చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయని ప్రకటించారు. కాని ఆ వెంటనే యుపిఏ మిత్రపక్షాలు ఈ విషయం ఖండించాయి. చివరకు తెలంగాణకోసం రోజంతా నిరాహార దీక్ష జరిపి యుపిఏ నుంచి వైదొలగవలసి వచ్చింది. అప్పటినుంచీ ఇప్పటివరకూ యుపిఏతో కానీ కాంగ్రెస్‌తో కానీ ఆయనకు సంబంధాలు లేవు. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సహా రాష్ట్ర నేతలవరకూ ఆయన విమర్శించని కాంగ్రెస్‌ నాయకుడంటూ లేరు. చివరకు రెండవ సారి జరిగిన రాజీనామాల ప్రహసనం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ పార్టీతో ఎన్నికల్లోనే నేరుగా ఢీకొన్నారు. 2004 ఎన్నికలతో పోలిస్తే ఆయన రెండు లోక్‌సభ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు కోల్పోయారు.

కాంగ్రెస్‌ మూలంగా ఎంతో నష్టం చెందినప్పటికీ ఆయనకు ఆ పార్టీపై ప్రేమ ఇంకా పోయినట్లు లేదు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే ఆత్మ విశ్వాసం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో కంటే కెసిఆర్‌కే ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. ‘అయిపోయింది బ్రదర్‌, సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణ యం తీసుకున్నారు. అసెంబ్లీలో తీర్మానం, పార్లమెంట్‌లో బిల్లు పెట్టడం ఖాయం. అంతా డిసెంబర్‌ చివరికల్లా పూర్తవుతుంది. ఎన్నికల తర్వాత ఆంధ్రా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి వేర్వేరుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.’ అని కెసిఆర్‌ ప్రకటించిన తీరు చూసి కాంగ్రెస్‌ నేతలు, పత్రికా ప్రతినిధులు సైతం నివ్వెరపోయారు. ఢిల్లీకి అడపా దడపా వచ్చే పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ సైతం ఇంత ధీమా ఏనాడూ వ్యక్తం చేయలేదు. కాని కెసిఆర్‌ ప్రకటన విన్న తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సైతం ఆత్మ విశ్వాసం వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. (మరింత…)

Polavaram Dam- devastation in the making నవంబర్ 18, 2008

Posted by M Bharath Bhushan in Koya, livelihoods, Polavaram, Telangana.
add a comment

The last crop

 

 

R Uma Maheshwari

 

Compensation fails to rehabilitate Polavaram’s displaced

 

Rama Rao’s field won’t grow food anymore - R Uma Maheshwari

Rama Rao’s field won’t grow food anymore - R Uma Maheshwari

The day Boragam Rama Rao saw the fresh stocks of his corn crop crushed by large excavators and crane tractors, he knew he had made that transition—from tribal farmer to tribal ‘beneficiary’. At least until he starts reconstructing his life all over again: with Rs 1.2 lakh and a piece of land as yet uncultivable. Rama Rao is the sarpanch of the Mamidigundi panchayat in Andhra Pradesh’s West Godavari district. He has lost nearly a hectare (ha) of land to Indira Sagar Polavaram dam project across the river Godavari.

 

According to Andhra Pradesh government’s figures, the project will displace 276 villages in Khammam and East and West Godavari districts of the state.

And if the 2001 census is any indicator, 2,37,000 people face displacement—more than 50 per cent of them adivasis.

“Officials told us last year that it would take us eight to 10 years for the barrage dam to come up and we would not be evacuated until waters came in. They assured us that we could continue to farm our lands in Mamidigundi and also enjoy the relief and rehabilitation package,” Rama Rao said. This year, his village was among the first villages to accept the relief and rehabilitation package. (మరింత…)

‘సామాజిక తెలంగాణ’ Social vs Geographic Telangana నవంబర్ 16, 2008

Posted by M Bharath Bhushan in elections, Identity, politics, Telangana, Telugu (తెలుగు).
Tags:
1 comment so far

సామాజిక బాణం ‘కొత్త’ కోణం


తెలంగాణ మదిలో చేరిన చిరంజీవి
ఆకట్టుకున్న సినీ నేపథ్యం
అండగా నిలుస్తున్న కొత్త దనం
అస్పష్ట సందేశం ఒక లోపం
అన్ని పార్టీల ఓట్లకూ గండి?
టీఆర్‌ఎస్‌కే అధిక నష్టం
కరీంనగర్‌, వరంగల్‌ టూరుపై విశ్లేషణ

మోతడక సుధాకర్‌ – ఆన్‌లైన్‌, హైదరాబాద్‌ అది… వీర విప్లవ సీమ. ఆయన.. సినీ హీరో. అది ఉద్యమాల పురిటి గడ్డ. ఆయన… ‘నవజాత శిశువు’. అది ఎన్నో పార్టీలు పాతుకుపోయిన ప్రాంతం. ఆయనది… కొత్తగా బలం సాధించే ప్రయత్నం. అది… తెలంగాణ. ఆయన… కోస్తాలో పుట్టి పెరిగిన చిరంజీవి. చుట్టుముట్టిన ‘సెంటిమెంట్‌’ నడుమ సుడిగాలిలా ఆయన పర్యటన సాగింది.

చిరంజీవి తెలంగాణ పర్యటనకు జనం ఎలా స్పందించారు? రాజకీయాల్లో సినీ ప్రభావం అంతగా కనిపించని ప్రాంతంలో ఈ కథానాయకుడు ప్రజల్ని ఏ మేరకు ఆకట్టుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు ‘ఆన్‌లైన్‌’ ప్రయత్నించింది. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలలో చిరంజీవి పర్యటించిన మార్గంలో పలువురిని ప్రత్యక్షంగా పలకరించి.. వారి అంతరంగాన్ని తెలుసుకొని… అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం

(హైదరాబాద్‌-ఆన్‌లైన్‌) సామాజిక తెలంగాణ నా ధ్యేయం. ప్రత్యేక తెలంగాణకు మేం అనుకూలం’ అని నినదించిన చిరంజీవి ఈ ప్రాంత ప్రజలపై తనదైన ముద్ర వేయగలిగారు. ‘ఒక ఆలోచన’ను రేకెత్తించడంలో సఫలమయ్యారు. అదే సమయంలో… తన సందేశాన్ని బలంగా వినిపించడంలో, విస్తృతంగా వ్యాపింపచేయడంలో ఆయన విఫలమయ్యారు.

‘సామాజిక తెలంగాణ’ నినాదం అందరిలో ఆసక్తి రేకెత్తించింది. కానీ… ఆయన పదే పదే పఠించిన ‘మార్పు’ మంత్రంపై స్పష్టత లోపించింది. మార్పు ఎలా ఉంటుంది, ఎలా సాధిస్తారనే విషయం అర్థంకాలేదనే అభిప్రాయం వినిపించింది. గజ్జెకట్టి ఆడే ఆట, తూటాల్లాంటి మాటలతో ఉత్తేజితభరిత కార్యక్రమాలు జరిగే ఈ ప్రాంతంలో… చిరంజీవి ప్రసంగాలు ప్రజల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయనే భావన వ్యక్తమైంది.

నినాదం… ఫలితం…
కరీంనగర్‌లోని సిరిసిల్ల నుంచి వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌దాకా… చిరంజీవి పర్యటించిన ప్రాంతమంతా ఒకప్పుడు నక్సల్స్‌ ప్రాబల్యమున్నదే. ఈ జిల్లాలు… రాజకీయ చైతన్యంలో ముందున్నవి. టీఆర్‌ఎస్‌ బలం, బలగం అధికంగా ఉన్నవి. టీడీపీ, కాంగ్రెస్‌లకూ బలమున్నవి. వామపక్షాలు, బీజేపీ వంటి పార్టీలకూ తమదైన ఓటుబ్యాంకు ఉన్నవి. అన్నింటికీ మించి… గట్టి తెలంగాణ సెంటిమెంట్‌కు కేంద్రాలివి. (మరింత…)