jump to navigation

మానవతను హరిస్తున్న అభివృద్ధి డిసెంబర్ 27, 2008

Posted by Telangana Utsav in Essays, livelihoods, Polavaram, SEZ, Telangana, Telugu (తెలుగు).
1 comment so far

మానవతను హరిస్తున్న అభివృద్ధి

అభివృద్ధిపేరిట ప్రభుత్వాలు తమను దగా చేస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తించిన పేద ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. వారికి బాసటగా నిలబడటం విద్యావంతుల నైతిక కర్తవ్యం . సంపద సృష్టించే శ్రమ జీవుల పక్షాన నిలబడకపోతే అనతికాలంలోనే తమనూ అనేక సమస్యలు చుట్టుముడతాయన్న నిజాన్ని విద్యావంతులందరూ గుర్తించాలి.

అనామకులుగా మిగిలిపోయిన, అసమాన త్యాగాలు చేసి చరిత్రకెక్కని సామాన్యుల ధైర్యంతో పోల్చదగింది మరేదీ లేదు. గుర్తింపును కోరుకోకుండా, మీడియా రక్షణ భరోసా లేకుండా న్యాయం కోసం  పోరాడిన వారి ధైర్యమే ధైర్యం. అది మనల్ని వినమ్రులను చేస్తుంది. ఉత్తేజ పరుస్తుంది. మానవతలో మన విశ్వాసాన్ని ప్రగాఢం చేస్తుంది. – ఆంగ్‌ సాన్‌ సూకీ

అభివృద్ధి! ఎక్కడ చూచినా అభివృద్ధే. అయితే ఇది ప్రజల జీవితాలను సుఖమయం చేసేది కాదు కదా, వారి బతుకులను విధ్వంసం చేసేది. ఈ అభివృద్ధి ఇప్పుడు మన అనుభవంలోకి వస్తున్నది. ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్‌లు), కోస్టల్‌ కారిడార్‌, గనుల తవ్వకాల ప్రాజెక్టులు, మౌలిక సదుపాయల మెరుగుదలకు ఉద్దేశించిన భారీ ప్రాజెక్టులు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. అయితే ఇవి సామాన్య ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చేవేనా? కావని వాస్తవాలు చెబుతున్నాయి. అయితే పాలకులు, వారికి మద్దతు నిస్తున్న మేధావి వర్గాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ అవి మేలు చేస్తాయని అంటున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట ఆదివాసీలు, దళితులు, ఇతర పేదలకు ఉన్న కొద్దిపాటి భూమిని కూడా ప్రభుత్వం కైవసం చేసుకొని అపర కుబేరులకు కారుచౌకగా కట్ట బెడుతుంది.

ఇదెలాంటి అభివృద్ధి? పేదల ఉపాధికి ఉన్న చిన్నపాటి అధరువును లేకుండా చేయడం ఎలాంటి అభివృద్ధి? నీటిపారుదల సదుపాయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టునే తీసుకొంటే దానిమూలంగా వేలాది ఆదివాసి కుటుంబాలు, అంతకు మించి సన్నకారు రైతు కుటుంబాల వారు నిర్వాసితులయ్యారు. వారి పునరావాసానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టడం లేదు. ఇక ఆ డ్యామ్‌ మూలంగా ముంపునకు గురయ్యే అటవీ విస్తీర్ణం తక్కువేమీకాదు. ఎంతో విలువైన వృక్ష సంపద, జంతుజాలంకు తీరని నష్టం జరుగుతుంది. వీటికి తోడు పోలవరంతో ఏ ప్రాంతానికి ఎక్కువ లబ్ధి జరుగుతుందనే వివాదం. సకల ప్రాంతాల ప్రజల సంక్షేమాన్ని పాలకులు చిత్తశుద్ధితో అభిలషించకపోవడం వల్లే ఇటువంటి వివాదాలు చోటుచేసుకుంటున్నాయనేది ఒక కఠోర సత్యం.

ఆ ప్రాజెక్టు మూలంగా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సాల లో దాదాపు 400 గ్రామాలు ముంపునకు గురవనున్నాయి. ఈ గ్రామాలలో 3 లక్షల మంది ఆదివాసీలు నివసిస్తున్నారు. ఆధునిక ప్రపంచపు పోకడలు తెలియని ఈ అమాయక జనాన్ని ప్రభుత్వాధికారులే మోసం చేయడం గర్హనీయం. (మరింత…)

Free Telangana from Andhra colonisers డిసెంబర్ 24, 2008

Posted by Telangana Utsav in Culture, Economy, politics, Telangana.
1 comment so far

Demand for Telangana justified

D Rama Krishna Reddy

In the last week of October the core group of the UPA government met in New Delhi to find a solution to the demand for a separate state of Telangana and to consider its implications for the general elections in 2009. The issue has assumed importance once again.

The demand for a separate Telangana state has a long history. Though the rest of India got independence from the British at midnight of 15 August 1947, the people of Telangana continued to be under the Nizam’s rule till the princely state of Hyderabad was liberated on 17 September 1948. Thereafter, Hyderabad was put under the administrative control of the central government for about three and a half years. In the first general elections, the Congress came to power in Hyderabad and Boorgula Ramakrishna Rao became chief minister. Even though the States Reorganisation Commission recommended a separate state, Telangana was merged with Andhra Pradesh in November 1956.

In the past 52 years, only three persons from the Telangana region ~ PV Narasimha Rao, M Chenna Reddy and T Anjaiah ~ have become chief minister of Andhra Pradesh. Their combined tenure was only around six years. Although Chenna Reddy brought the Congress to power in the state twice ~ in 1978 and 1982 ~ he was not allowed to complete his tenure on either occasion at the instance of Andhra leaders. This gave credence to the feeling that people from Telangana could not become chief minister of the state because of a conflict of interests and the brute majority of Andhra MLAs.

When Telangana was merged with Andhra Pradesh, the leaders of both the provinces entered into an agreement, popularly known as “the Gentlemen’s Agreement of 1956”, which provided for certain safeguards and guarantees to the people of Telangana in the matters of employment, education and development. But this was subsequently given up. In its place, an eight-point formula was adopted in 1969, which was replaced by a six-point formula in 1972. Through the six-point formula, Article 371D was inserted into the Constitution by the 32nd constitutional amendment of 1973 providing some safeguards to the people of Telangana in the matter of employment and education, which was also violated with impunity.

This apart, there is no emotional integration between the people of Telangana and Andhra Pradesh even after five decades of the formation of the new state. While the people of Telangana still consider Andhra people exploiters, the former consider the people of Telangana to be ignorant and gullible. (మరింత…)

PRP Takeover of NTP? డిసెంబర్ 22, 2008

Posted by M Bharath Bhushan in elections, Telangana.
add a comment

NTP forges poll alliance with PRP
22 December 2008, Times of India

HYDERABAD: The Nav Telangana Party (NTP) on Sunday announced that it had decided to have a poll alliance with the Prajarajyam party led by Chiranjeevi

NTP president T Devender Goud met Chiranjeevi at PRP office on Sunday and held talks on the possible alliance between the two sides. Later, NTP leader E Peddi Reddy said that both the parties decided to contest the polls together and also hold joint agitations in the days to come. NTP sources also indicate that they had proposed to PRP that 28 assembly seats and four Lok Sabha seats should be given to them. A decision from PRP is still awaited.

The NTP leader, who also participated in the discussion, said that Chiranjeevi accepted the NTP’s proposal to forge an election alliance with PRP. Chiranjeevi, he said, underscored the need to unite all forces struggling for the cause of social justice in the coming election. The actor- turned- politician had also extended solidarity to NTP for launching a movement for separate Telangana. The coming together of these two parties would help in strengthening the base of both the parties, he said. (మరింత…)

Derailed legislature in diseased Telugu politics ‘పురా’ణ కాలక్షేపం డిసెంబర్ 7, 2008

Posted by M Bharath Bhushan in Congress, elections, NTPP, politics, TDP, Telangana, Telugu (తెలుగు), TRS.
add a comment

‘పురా’ణ కాలక్షేపం
-అల్లం నారాయణ

ఏదో తెలంగాణ బిల్లు పెడ్తారని కానీ, అధిక ధరల మీద, బాబ్లీ మీద, రైతుల రుణాల మీదా, బాంబులు పేలడం మీదా చర్చిస్తారని కానీ ఇంకా నమ్మకం ఉంచుకున్న వాళ్లకు ‘చట్ట సభలు బాతాఖానీ…’ అన్న ఒక వ్యాఖ్యను మరోసారి గుర్తు చేస్తూ…

ఏతావాతా..చివరికి అంతా ఒక ‘ ఆవువ్యాసం’ కథ. ఆవుకు నాలుగు కాళ్లుండును. రెండు చెవులు, రెండు కళ్లు ఉండును. ఆవు పాలిచ్చును. అంతేకదా! అసెంబ్లీలో ఒక ఇద్దరు మహాత్ములు ఉందురు. ఇల్లూరు ఈటపోయినా, కొల్లూరు కోటపోయినా.. ఈ భూ ప్రపంచం మునిగిపోయినా, ముంబయ్‌లో టెర్రరిస్టులు పొరుకపోడు చేసినా, బాంబులుపేలినా, బ్రహ్మాండం బద్దలైనా ఈ ఇద్దరికి మాత్రం తమదైన ప్రపంచం మాత్రమే ఉండును. ఆ ఇద్దరి బాధ ప్రపంచం బాధగా మారును. ఒకాయన ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి వై. ఎస్‌.రాజశేఖరరెడ్డి, ఇంకొకాయన తొమ్మిదేళ్లు ఏలిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు. ఈ ఇద్దరి చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. ఎటుతిరిగినా చివరికి ఈ ఇద్దరున్న అసెంబ్లీలో వారి వారి చరిత్రల పాఠాలను, వారి వారి ఉత్కృష్టతలను, వారి కుటుంబ వివరాలను, అన్నింటినీ అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు, పూసగుచ్చినట్టు వివరించందే ఎప్పుడు మాత్రం సభ ముగిసిందని. అది టెర్రరిజం అయినా, బాబ్లీ అయినా, బాబ్రీ మసీదయినా.. చివరికి ఆవు పాలిచ్చును. వై.ఎస్‌. రాజశేఖరెడ్డికి అందరు మానవుల్లాగే ఒక తండ్రి ఉండెను. ఆయనను ఎవరో చంపేశారు.

ఆ చంపేసిన వాళ్లను దయతో దైవసమానుడైన, కరుణామయుడైన పూర్తి పరివర్తన చెందిన వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి గారు క్షమించేశారు. వాళ్లను మళ్లీ చంపే ప్రయత్నమూ చెయ్యలేదు. బహుశా పూర్వం పిల్లలకు భారత, రామాయణాలు చెప్పినట్టు, ఆధునిక ఆంధ్రప్రదేశ్‌లో టీవీలు గలవాళ్ల ఇంట్లో ముఖ్యమంత్రి గారి దయార్ద్ర హృదయం గురించి పదహారోసారి విని, చూసి, తరించని వారు కానీ, కొండొకచో ఆయన త్యాగనిరతికి కళ్లు చెమర్చకుండా ఉన్న వాళ్లు కానీ ఉన్నారని అనుకోను. మధ్యలో తమ కుటుంబ గాథా చిత్రాన్ని వై.ఎస్‌. గారు వినిపిస్తున్నప్పుడు సారీ కనిపిస్తున్నప్పుడు కళ్లకు కడ్తున్నప్పుడు ఎవరైనా ఏ ధరలు పెరిగాయనో అవినీతి జరిగిందనో, బాబ్లీతో బతుకు నాశనం అవుతుందనో, తెలంగాణ కావలనో అంటే చిరాకు పడరా…’కూచోవయ్యా కూచో’ అనరా. ఆయన ఎంత తన్మయత్వంతో, మమేకంతో ఎంతో ఆర్ద్రంగా, హృద్యంగా, ‘నా తండ్రిని చంపేసిన వాళ్లను నేను క్షమించాను’ అని, పనిలో పనిగా, ‘చంద్రబాబూ, నా తండ్రిని చంపినవాళ్లను నువ్వు చేరదీశావని’ కొంచెం భావోద్రేకంతో మాట్లాడ్తున్నప్పుడు లేనివీపోనివీ, రానివీ కానివీ, ప్రపంచం పుట్టినప్పటి నుంచీ ఉన్న సమస్యలను ప్రస్తావిస్తే ఇక కోపం రాక ఏమి వస్తుంది. (మరింత…)