jump to navigation

పంపకాల్లో న్యాయం: ఒక తలకిందుల ప్రశ్న – కె.శ్రీనివాస్ ఆగస్ట్ 10, 2013

Posted by M Bharath Bhushan in Andhra, Economy, Fazal Ali Commission, Hyderabad, Telangana, Telugu (తెలుగు).
Tags: ,
add a comment

పంపకాల్లో న్యాయం: ఒక తలకిందుల ప్రశ్న (సంధర్భం) – కె.శ్రీనివాస్

దేశంలో జరిగిన ఏ రాష్ట్రవిభజనను చూసినా, రాష్ట్రాల మధ్య పంపకాల గురించిన ఆందోళనలు అనవసరమని, ముందే ఏర్పడిన, సంప్రదాయాలు, విధివిధానాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఎవరికీ అన్యాయం జరగదనీ అర్థమవుతుంది. పంపకాల్లో న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నపై ఇప్పుడు చర్చ జరుగుతోంది కానీ, ఇంతకాలం పంచుకోవడం న్యాయంగా జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అవగాహన లోపిస్తోంది. పెద్దమనుషుల ఒప్పందమే అమలుజరిగి ఉంటే, నేటి పెద్ద సంక్షోభం వచ్చేది కాదు కదా?

“విశాలాంధ్రలో విలీనానికి సంబంధించి అనుకూల ప్రతికూల అంశాలను నేనిక్కడ రేఖామాత్రంగా సూచించాను. నా సొంత అభిప్రాయమంటూ ఒకటి చెప్పడం భావ్యం కాదని అనుకుంటున్నాను. ఈ అంశంపై నా మనసును తెరచే ఉంచాను. నిష్పాక్షికంగా, రాగద్వేషాలకు అతీతంగా నేను పరిస్థితిని వివరించాను. బొంబాయి నుంచి పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తరువాత మరింత వివరంగా రాస్తాను. …” 1955లో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు కాంగ్రెస్ అధ్యక్షులు యు.ఎన్. ధేబర్‌కు రాసిన లేఖలో రాసిన ముగింపు వాక్యాలు అవి. విశాలాంధ్రలో కలవాలనే అభిప్రాయం కూడా తెలంగాణలో బలంగానే ఉన్నదని, అయితే మెజారిటీ మాత్రం ప్రత్యేక రాష్ట్రంగా ఉండడానికే మొగ్గుచూపుతారని కూడా బూర్గుల ఆ లేఖలో సూచించారు.

ఫజల్ అలీ కమిషన్ నివేదిక వెలువడి, విశాలాంధ్ర ప్రయత్నాలు ముమ్మరం అవుతున్న సందర్భంలో బూర్గుల రాసిన లేఖ అది. ఒక రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్య కాదది, రాజకీయంగా ప్రాంతాలుగా విడిపోయిన సందర్భమూ కాదది. ఒక బహుభాషారాష్ట్రం మూడుముక్కలుగా విచ్ఛిన్నమై నామ రూపాలు లేకుండా పోయే సన్నివేశం. ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా, బహిరంగంగా చెప్పడానికి ఏ అభ్యంతరం ఉండనక్కరలేదు. అయినా, ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ, తన మనోగతాన్ని బాహాటంగా ప్రకటించి రాజకీయపరిస్థితులను ప్రభావితం చేయకూడదనే విలువను ఆయన పాటించి, పార్టీ అధ్యక్షుడికి రహస్యలేఖను మాత్రమే పంపించారు. (మరింత…)

Why Telangana needs Hyderabad – G Naga Sridhar & Amit Mitra ఆగస్ట్ 10, 2013

Posted by M Bharath Bhushan in ecology, Economy, Hyderabad, Telangana.
Tags: , ,
add a comment

Why Telangana needs Hyderabad
G Naga Sridhar and Amit Mitra, Business Line, 9 August 2013

Now that the Congress and the United Progressive Alliance (UPA) have announced their backing for Telangana’s Statehood, the economic prospects and growth potential of India’s proposed 29th State have once more come to the fore.

The Telangana region, comprising 10 of the 23 districts in Andhra Pradesh, has a larger area than the other two regions, Rayalaseema and coastal Andhra. Excluding Hyderabad, Telangana sprawls over 1.14 lakh sq km, while the four districts of Rayalaseema cover 67,000 sq km and the nine coastal districts encompass 92,800 sq km.

Fundamentally, the Telangana economy is vibrant, thanks to the contributions from Hyderabad and Rangareddy districts.

BL10_Tel_New_perca_1546458f

Telangana’s broad economic parameters, such as the Gross State Domestic Product (GSDP), which is the total value of goods and services produced in a given year, and standard of living as indicated by per capita income, appear to be sound vis-à-vis the Andhra and Rayalaseema regions. The aggregate gross district domestic product of the proposed state’s 10 districts in 2009-10, stood at approximately Rs 2,16,281 crore.

That was a little less than half of Andhra Pradesh’s Rs 4,90,411 crore GSDP in the same period. Indeed, if the Andhra and Rayalaseema regions were to be taken individually, Telangana’s contribution to the State Domestic Product was the highest. This was obviously driven by a strong contribution from Hyderabad as can be seen in the table. (మరింత…)