jump to navigation

వైవిధ్యం కరువైన ఉస్మానియా- కడెంపల్లి సుధాకర్ గౌడ్ ఏప్రిల్ 25, 2017

Posted by M Bharath Bhushan in agitation, Culture, Deccan, Hyderabad, Identity, movement, Mulki, Osmania, politics, regionalism, struggle, students, Telugu (తెలుగు), universities, Urdu, youth.
Tags: , , , , ,
add a comment

vaividyam karuvaina osmania -sudhakar goud

పునర్నిర్మాణం.. మన చేతుల్లోనే – గౌతమ్ పింగ్లే ఏప్రిల్ 13, 2017

Posted by M Bharath Bhushan in 29th State, Culture, Economy, Essays, Identity, politics, regionalism, Telangana, Telangana People, Telugu (తెలుగు).
add a comment

నమస్తే తెలంగాణ, 12 April, 2017

-నమస్తే తెలంగాణతో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ డైరెక్టర్ గౌతమ్ పింగ్లే

gowtham pingle

నమస్తే తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ వచ్చింది. ఇక మన చేతుల్లో పని. పునర్నిర్మాణం మన చేతుల్లోనే ఉంది. ఆ సంగతి అధికారులకు అర్థం చేయించడమే నా ముఖ్యమైన బాధ్యత అని సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ డైరెక్టర్ గౌతమ్ పింగ్లే చెప్పారు. ఇప్పుడు మనుషుల సమస్య చాలా ఉందని, మనసు పెట్టి పనిచేసే వాళ్లు కావాలని, అలాంటి వారిని గుర్తించడం, వారితో కలిసి పనులు చేపట్టడం ఒక సవాల్ ఆయన చెప్పారు. ఈ సందర్భంగా గౌతమ్ పింగ్లే నమస్తే తెలంగాణతో మాట్లాడారు. మన రాష్ట్రం మనది అయ్యిందని, జయాపజయాలు మన చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. ఈ తరుణంలో అధికారులకు శిక్షణ ఇస్తూ వారిలో అవగాహన పెంచుతూ ప్రజల వద్దకు పరిపాలనను తీసుకెళ్లడం, మన తెలంగాణ గురించి ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ముందుకు సాగుతుందని పింగ్లే తెలిపారు. ఇప్పటికే మూడు శిక్షణా శిబిరాలు నిర్వహించామని ఆయన చెప్పారు. అధ్యయనానికి ఉపయోగపడే కేంద్రంగా సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్‌ను రూపొందించేందుకు తెలంగాణకు సంబంధించి అనేక అంశాలను ఒకచోటికి చేర్చడం, తెలంగాణకు సంబంధించిన దైనందిన సమాచారాన్ని పంచుకోవడానికి వెబ్‌సైట్ ఏర్పాటు చేయడం మా ముందున్న లక్ష్యాలని పింగ్లే పేర్కొన్నారు. (మరింత…)

హేవళంబి ఉగాది – పల్ల నరేంద్ర మార్చి 28, 2017

Posted by M Bharath Bhushan in Culture, ecology, Telangana, Telangana Festivals, Telugu (తెలుగు).
Tags:
add a comment

హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
హేవళంబికి (రైతు) స్వాగతం..
వాన రానీ వాన రానీరా
మా మంచి కాలం తాను దేనీ తాను దేనీరా
రేయి పగలు కాసుకోని కండ్లలొత్తు లేసు కోని
యేసి చూసి జీవులన్నీ ఆసతొ దోసిళ్ళు బట్టగ
వాన రానీ వాన రానీరా
మా మంచి కాలం తాను దేనీ తాను దేనీరా
సురుకులేపే రోహినమ్మ మ్రిగసిరమ్మకు పిలువనంప
యేడి యిడిసి సల్లబడ పన్నీరు బుడ్డి సిలకరించ
ఆగమాగమునొచ్చి ఆర్ద్ర తడిపి తానాలాడించ
సిన్నబోక మందలించ చిన్న పెద్ద పుష్యాల
ఆకసమ్మే జల్లెడవను అస్లేరు ఎదురుజూడ
కార్తెలన్ని కర్షకులను కడుపులోన దాచుకొనగ
వాన రానీ వాన రానీరా
మా మంచి కాలం తాను దేనీ తాను దేనీరా (మరింత…)

తెలంగాణ అస్తిత్వం నా వ్యక్తిత్వం – పద్మశ్రీ లక్ష్మా గౌడ్‌ జనవరి 27, 2016

Posted by M Bharath Bhushan in Art, Culture, Identity, Interview, Personalities, Telangana, Telugu, Telugu (తెలుగు).
Tags:
add a comment

తెలంగాణ అస్తిత్వం నా వ్యక్తిత్వం

Interview with Padma Shri Laxma Goud by Kandukuri Ramesh Babu, Namasthe Telangana, January 27, 2016

ఆధునిక చిత్రకళలో సంచలనాత్మకమైన సృష్టికి ప్రతీకగా పేరొందిన లక్ష్మా గౌడ్‌తో ముఖాముఖి అంటే ఒక సాహసితో కరచాలనం. ఆయన జానపదుడు. మోటు మనిషి. కానీ అతడి చిత్రాల్లోని రేఖా లావణ్యం, రంగుల మేళవింపు చూడముచ్చటైంది. లలిత లలితంగా సాగే ఆయన చిత్రాలు మానవుడి చిత్తప్రవృత్తులను నిఖార్సంగా ఆవిష్కరిస్తూ చూపరులను ఒక్కపరి భీతిల్ల చేస్తాయి. కలవరపాటుకు గురిచేస్తాయి. ఎందుకంటే ఆయనది గ్రామ సంప్రదాయం. అందులో చెట్లు, చేమలు, గేదెలు, మేకలు – మనుషులూ ఉంటారు. ఆ మనుషుల్లోని ఆప్యాయతలు, అనురాగాలు – మరీ ముఖ్యంగా పశుపక్ష్యాదులతో వారికున్న అనుబంధాలు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. నాగరికులకు అనాగరికంగా అనిపించే అలవాట్లు, ప్రవర్తనలు, కోపతాపాలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు, సరససల్లాపాలు, మోహావేశాలు – ముఖ్యంగా సెక్సు సంబంధాలన్నిటినీ మరే ఆధునిక చిత్రకారుడూ సృశించ సాహసించనంతటి విశిష్టంగా ఆయన చిత్రిస్తారు. అదే లక్ష్మాగౌడ్‌ ప్రత్యేకత. ఒక్కమాటలో ఆయన నిర్భీతికి మారుపేరు. అటువంటి కళాకారుడితో మామూలు సమయంలో ముఖాముఖి అంటే అది సాహసమే. కానీ, పద్మశ్రీ వరించిన సందర్భంలో ఆయన ఎంత హాయిగా ముచ్చటించారంటే తెలంగాణ మురిపాల ముద్దుబిడ్డగా ప్రాంతీయ అభివ్యక్తి గురించి కూడా నిర్మొహమాటంగా వ్యక్తమయ్యారు. టీవీ చానళ్ల హడావిడి మధ్యన తనదైన యాస భాషలతో లక్ష్మాగౌడ్‌ తన చిత్రకళా ప్రస్థానాన్ని కాసేపు ‘నమస్తే తెలంగాణ’తో ఇలా పంచుకున్నారు. ..

*తొలి ప్రశ్న. ఈ శుభ సందర్భంలో మొట్టమొదట మీరు ఎవర్ని యాది చేసుకున్నారు?

– ముఖ్యంగా మా నాయినని. నేనంటే ఆయనకు చాలా ప్రేమ. ఆయనే ఇంతటి స్థితికి కారణం అంటాను నేను. తండ్రిగా ఆయన నన్ను ఇది చేయి అది చేయి అని ఎప్పుడూ దేంట్లోనూ కల్పించుకోలేదు. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. నాయిన్నే నన్ను ఆర్ట్ స్కూల్లో జాయిన్ చేశారు. అందుకు తొలి యాది నాయన. తర్వాత నా టీచర్‌ను యాది చేసుకున్నాను. బరోడాలో నా గురువర్యులు కె.జి.సుబ్రమణ్యన్ గారిని తలుచుకున్నాను. ఆయన సాన్నిహిత్యంలో, మాట ముచ్చట్లలో నా తెలివిని పెంచుకోవాల్సిన అవకాశం ఏదైతే దొరికిందో దానికి నేను జన్మాంతరం రుణపడి వుంటాను. ఔర్ ఆయన వల్లనే నేనీ దశకు వచ్చానని అంటాను.

*ఒక్క మాటల మీ టీచర్ చెప్పింది ఏమిటి?

– నా టీచర్ చెప్పిన ముచ్చట ఏమిటంటే – నీలో గనుక కళాకారుడిని కావాలన్న అభిలాష ఉంటే నీదైన- వ్యక్తిగత రూపకల్పన (ఇండివిజులిస్టిక్ ఐడియా) చేసుకోమని చెప్పిండు. అందరు కళాకారులే. కానీ, వ్యక్తిగత రూపకల్పన చేయగలిగితే నీ బొమ్మ తయారవుతుందని చెప్పిండు. అదే శైలి. నీదైన శైలిని గుర్తించగలగే స్థితికి వస్తే, అది నీ మనసుకు అతికినట్లుగా ఉంటే అక్కడ కళాకారుడు పుడతాడు. అలా కనపడాలన్న సూచన ఆయన ఇచ్చిందే. కళను జీవితాన్ని సెపరేట్ చేయకుండా, దాన్ని చూసి గుర్తించగలిగి, అందులో నీదైన గుణం వ్యక్తం అయ్యేలా కృషి చేయాలని చెప్పిండు.

*మీరు జన్మించిన కులం (కలాల్ పని- గీత అక్కడే ఉంది) మీ ప్రాంతం (సహజ సిద్దమైన తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక నైసర్గికత) – ఈ రెంటితో కూడిన వ్యక్తిత్వం వల్లే మీరు బలమైన కళాకారుడిగా ఎదిగారని అనవచ్చా?

– జీన్స్ అంటమే. నిజమే. అదిట్లా వుండి ఈ విత్తనం ఇట్లా తయారైంది. కానీ మా ఇంట్లో కళాకారులు లేరు. ఎవరన్న ఉంటే నాకు ప్రేరణ వచ్చిందనుకోవచ్చు. కానీ, లేదు. నాయన మాలీ పటేల్‌గా వుండె. ఇప్పుడు విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అంటున్నారు. ఆయన పొట్టిగా నా లెక్క… గల్ల రుమాలు, కమీజ్, హాఫారం, దోతి, చెప్పులు వేసుకునేవాడు. కాని ఆయన అభిరుచి, క్రమశిక్షణ నాకొచ్చింది. దాంతో నాదైన కృషితో ఆర్టిస్టు నయ్యాను.

laxma goud f

*మీది సాహసోపేతమైన వస్తువు, శైలి. ‘ఎవడైతే నిర్భయంగా నిత్యజీవితంలో ఉన్న భాషను, ఆకృతులను ఉపయోగించి సత్యాన్ని కథగా అల్లుతాడో, వాడి ఆయుధం ఏదైతే ఉన్నదో అది వాడిష్టం. ఆ మేరకు నేను సెక్స్‌ని ఆయుధం చేసుకున్నాను’ అని గతలో మీరు స్పష్టంగా చెప్పారు. లైంగికతను నిర్భీతితో ఆవిష్కరించారు. కానీ, ఈ యాభై ఏళ్ల ప్రస్థానంలో ఎన్ని విమర్శలు? వాటన్నటినీ దాటి సగర్వంగా పద్మశ్రీ అందుకుంటున్నారు. ఈ సందర్భంగా మీరు పట్టించుకున్నదేమిటి? పట్టించుకోనిదీ ఏమిటి?

– సమాజంలో ప్రతి ఒక్కరూ ఉంటరు. కళను అందరూ అప్రిషియేట్ చేస్తరా? చేయరు. నా కంటెంట్ మ్యాటర్ చూసి నన్ను రిజెక్ట్ చేసిన మ్యాటర్ మాట్లాడుతున్నవు నువ్వు. కానీ, అది ముఖ్యం కాదు. సమాజంలో అంతరాలున్నయి. పైది -మధ్యది- కిందది. ఇప్పటిదాకా ఈ మూడింట్లో పైనున్న సమాజమే కీలకం అయింది. వాళ్లకు అర్థమైనా కాకపోయినా వాళ్లు నిన్ను గుర్తిస్తెనే లెక్క అన్నట్లుగా మారింది. కానీ, కాదు. వాళ్లు తమ సోషల్ ప్రిస్టేజ్ కోసం మనల్ని రికగ్నైజ్ చేస్తరు గని కళ కోసం కాదు. సమాజం అంటూ ఏమీ లేదు. అందులో కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కొద్దిమంది కోసం నేను కళాకారుడని కావాలని ఆలోచిస్తే నేను కళాకారుడిని కాను, వెధవను అవుతాను. అంతేకాదు, ఆ కొద్దిమందిని నేను తలవొంచేలా చేస్తాను అనే విధానం కూడా కరక్టు కాదు. వాళ్ల కొరకు నేను చేయడం లేదు. వాళ్లు గుర్తిస్తే ఏంది? గుర్తించకపోతే ఏంది? ఈ సంగతి అర్థం చేసుకుని పెరగడం లేదంటే తనంతట తాను పెరుక్కుంటూ అర్థం చేసుకోవడం…ఇది ముఖ్యం అంటాను నేను. అప్పుడు నువ్వు ఎటువంటి ఆర్ట్ చేసినా, ఏ సమాజం కోసం చేసినా దేనికీ భయపడనక్కర్లేదు. అట్లా నేను నిర్భయంగా నా స్వీయ కళా దృక్పథాన్నే నమ్మాను. దాన్నే సాధన చేశాను. దైవం నాకు అది ఇచ్చింది. ఇచ్చిందాని మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా? నువ్వు బుద్దితక్కువోడవు అయితవు. నీ దగ్గర ఉన్నదే నువ్వు వాడుకోకపోతే దానికి మందేం చేస్తరు? మంది కాదు కదా కారణం. సో, అందుకే నన్ను నేను నమ్మాను. దిసీజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్ అంటాను నేను. ఆర్ట్ ఈజ్ నాట్ కేటర్డ్ టు వన్ మిలియన్ పీపుల్ ఇన్ ది వరల్డ్. యు డు ఆర్ట్ ఇన్ యువర్ స్టుడియో ఫర్ యువర్ సెల్స్. నాకు దానిమీద నమ్మకం ఉంది. పిల్లలకు కూడా అదే చెబుత.

laxama goud d
(మరింత…)

యాగాల తెలంగాణనా? పోరాటాల, త్యాగాల తెలంగాణనా? – ఎన్.వేణు గోపాల్ జనవరి 16, 2016

Posted by M Bharath Bhushan in 29th State, agitation, Culture, Essays, Identity, KCR, Personalities, politics, struggle, Telangana, Telugu (తెలుగు), TRS.
add a comment

యాగాల తెలంగాణనా? పోరాటాల, త్యాగాల తెలంగాణనా? – ఎన్.వేణు గోపాల్
నడుస్తున్న తెలంగాణ మాసపత్రిక, జనవరి 2016 సంచిక

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అయుత మహా చండీ యాగం జరపడం, ఆ యాగం ప్రభుత్వ కార్యక్రమం లాగ, తెలంగాణ కార్యక్రమం లాగ జరగడం చాల ప్రశ్నలకు చర్చకు ఆస్కారం ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అయుత మహా చండీ యాగం చేస్తానని తాను మొక్కుకున్నానని, ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది గనుక ఆ యాగం చేస్తున్నానని ఒకసారి, విశ్వశాంతి, లోక కళ్యాణం, తెలంగాణ సౌభాగ్యం, ప్రజాశ్రేయస్సు కొరకు ఈ యాగం చేస్తున్నానని ఒకసారి ఆయన ప్రకటించారు. కాని ఈ రెండు వివరణలు కూడ చర్చకు నిలిచేవి కావు.
తెలంగాణ రాష్ట్రం అశేష ప్రజానీకం సాగించిన పోరాటాల వల్ల, త్యాగాల వల్ల, రాజకీయ ఎత్తుగడల వల్ల వచ్చిందా లేక ఒకానొక వ్యక్తి మొక్కు వల్ల వచ్చిందా అనే సందేహానికి మొదటి వివరణ దారితీస్తుంది. స్వయంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించానని చెప్పుకుంటున్న పార్టీ అధ్యక్షుడే తన మొక్కు వల్లనే తెలంగాణ సాధించిందని అనడం తన పద్నాలుగు సంవత్సరాల కృషిని తానే అపహాస్యం చేసుకున్నట్టవుతుంది. ఉద్యమక్రమంలో తెలంగాణ సమాజం యావత్తూ పాల్గొన్న అనుభవం ఉంది. చేపట్టిన ఎన్నో పోరాట రూపాలున్నాయి. చేసిన ఎన్నో కార్యక్రమాలున్నాయి. చివరికి తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత చంద్రశేఖర రావే సకుటుంబ సమేతంగా వెళ్లి తెలంగాణ ఇచ్చినందుకు మరొక మాతకు కృతజ్ఞతలు చెప్పివచ్చారు. ఇప్పుడు ఆ కారణాలూ పరిణామాలూ అన్నీ పక్కకు పోయి, కేవలం చండీమాత మొక్కు వల్లనే తెలంగాణ వచ్చిందనడం ఆయనకు స్వవచోవ్యాఘాతమని అనిపించకపోవచ్చు గాని తెలంగాణ సమాజానికీ ఉద్యమకారులకూ అవమానం.తెలంగాణ కోసం ప్రాణాలు బలిపెట్టిన వందలాది మంది విద్యార్థి యువజనులకు అవమానం. (మరింత…)

Telangana movement & State formation – V Prakash జనవరి 10, 2016

Posted by M Bharath Bhushan in 1969, 29th State, agitation, AP Reorganisation Bill, politics, Telangana, Telugu (తెలుగు), TRS, TSPSC.
add a comment

Book on Telangana movement and State formation released
Special correspondent, The Hindu, 4 January, 2016

Telangana Chief Minister K. Chandrasekhar Rao released a book titled “Telangana Udyamala Charitra – Rashtra Avirbhavam” (history of Telangana movements and State formation) written by V. Prakash, founder of Acharya Jayashankar Study Centre and political analyst.

Advisor to Government K.V. Ramanachary, Minister G. Jagadish Reddy, State Planning Board Vice Chairman S. Niranjan Reddy, legislators K. Prabhakar Reddy and Palla Rajeshwar Reddy and family members of Mr. Prakash were present on the occasion. Complimenting Mr. Prakash for penning the book, the Chief Minister said it was a great attempt to compile the history of Telangana movement. (మరింత…)

Stop Land Sales in Hyderabad- ఎవరివీ హైదరాబాద్‌ భూములు? ఎన్‌ వేణుగోపాల్‌ నవంబర్ 28, 2015

Posted by M Bharath Bhushan in Economy, Hyderabad, KCR, KTR, Nizam, Settler, TDP, Telangana, Telugu (తెలుగు), TRS, YSR.
add a comment

ఎవరివీ హైదరాబాద్‌ భూములు?
ఎన్‌ వేణుగోపాల్‌
నవ తెలంగాణ 11 నవంబర్ 2015

“ఒరులేయవి యొనరించిన నర వర యప్రియము తన మనంబునకగు దానవి యొరులకు సేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్‌” అని పాటించవలసిన రాజధర్మం ఏమిటో మహాభారతంలో తిక్కన విదురుడి నోట చెప్పించాడు. అది రాజధర్మం మాత్రమే కాదు. మనుషులందరూ పాటించవలసిన సహజ నైతిక సూత్రం. ఇతరులు ఏ పని చేస్తే మనకు అసంతృప్తి కలిగిందో, ఇతరులు ఏ పని చేయడాన్ని మనం అభ్యంతర పెట్టామో అదే పని మనంతట మనం చేయకపోవడమే అన్ని ధర్మాల్లోకీ అనుసరించవలసిన ధర్మం అనేదే ఆ నీతి.

ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక ఆర్థిక నిర్ణయం ఈ గత కాలపు వివేకాన్ని గుర్తుకు తెస్తున్నది. అప్పుడు ప్రతిపక్షంగా, ఉద్యమపక్షంగా ఉండిన ఇవాళ్టి అధికారపక్షం సమీప గతంలో తీసుకున్న రాజకీయ వైఖరినీ ఇవాళ ప్రకటిస్తున్న విధానాలనూ పోల్చి చూసినప్పుడు ఈ వివేకం గుర్తుకు వస్తున్నది. తిక్కన అక్షరీకరించిన మానవ ధర్మం, రాజధర్మం ఇవాళ్టికి కూడ ఎంత ప్రాసంగికంగా ఉన్నదో తెలుస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ భూమిని వేలం వేయడానికి నిర్ణయించిందని, అందుకోసం 12,500 ఎకరాల భూమిని గుర్తించిందని, ఆ వేలంద్వారా రు. 13,500 కోట్ల సంపాదించాలని ఆలోచిస్తున్నదని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు పూర్తిగా ఊహాగానాలు కాకపోవచ్చు. అంకెలలో ఏమైనా చిన్న తేడాలు ఉండవచ్చు గాని ఉద్దేశాలూ నిర్ణయాలూ నిజాలే కావచ్చు. భూముల అమ్మకాన్ని నిధుల సేకరణకు ఒక మార్గంగా చూస్తామని ప్రభుత్వాధినేతలు చాలసార్లే ప్రకటించారు. కాని ఇవాళ అధికారంలో ఉన్నవారు రెండు సంవత్సరాల కింది వరకూ ఇటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మాట్లాడారని, నిరసన ప్రదర్శనలు కూడ జరిపారని గుర్తు తెచ్చుకోవలసి ఉంది. (మరింత…)

ఇక కొత్త రెవెన్యూ చట్టాలు సెప్టెంబర్ 8, 2015

Posted by M Bharath Bhushan in Economy, landuse, Nizam, Settler, Telangana, Telugu (తెలుగు), TRS.
Tags:
add a comment

ఇక కొత్త రెవెన్యూ చట్టాలు

Namaste Telangana 9/8/2015

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడినరాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడే చట్టాలు మాత్రమే అమలుచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను దోచుకోవడానికి రూపొందించిన, ఆంధ్రాకు మాత్రమే పనికివచ్చే చట్టాలను సమూలంగా పాతర వేయాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టాల రూపకల్పనపై కసరత్తులు మొదలుపెట్టింది. న్యాయశాఖ విభాగం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా కొత్త చట్టాల ఏర్పాటుకు సంబంధించి అధ్యయనం, రూపకల్పన బాధ్యతను నల్సార్ యూనివర్సిటీకి అప్పగించింది. రెండు నెలల్లో కొత్త చట్టాలకు ముసాయిదాలు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి.

భూ వినియోగం ఆధారంగా నూతన చట్టాలు

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కొత్త చట్టాలు చేసుకోవడానికి రెండేండ్లు వెసులుబాటు కల్పించింది. ఈ రెండేండ్ల వరకు ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలను అమలు చేసుకోవచ్చు. ఈలోగా కొత్త చట్టాలు ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే ఏపీ చట్టాలే.. తెలంగాణ చట్టాలుగా అమలులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర భూ వినియోగం, ఇక్కడి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కొత్త చట్టాలను తీసుకువచ్చేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్రంలో ఏ శాఖలో లేనివిధంగా రెవెన్యూ శాఖలో దాదాపు 150కిపైగా చట్టాలున్నాయి. ఇందులో కొన్ని పూర్తిగా సీమాంధ్రకు మాత్రమే పనికి వచ్చే చట్టాలున్నాయని అధికారవర్గాలు అంటున్నాయి. 100కు పైగా చట్టాలు సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. (మరింత…)

Telangana History 1947 to 2014: G Vijay Kumar డిసెంబర్ 29, 2014

Posted by M Bharath Bhushan in 1969, Andhra, heritage, Hyderabad, Identity, movement, Mulki, regionalism, Settler, Telangana, Telugu (తెలుగు).
add a comment

అతిథిలా వచ్చిపోలేదు!
-గటిక విజయ్‌ కుమార్, నమస్తే తెలంగాణ December 30, 2014

రైలులో ప్రయాణం చేస్తుంటే.. చెట్లు, గుట్టలు, స్టేషన్లు వెనక్కి ఉరుకుతుంటయ్. మనకన్నా ముందున్న ఆకారాలు క్షణాల్లోనే వెనకబడుతుంటయ్. మనం దిగాల్సిన స్టేషన్ ఒక్కటే మనతో పాటు కొద్ది సేపు ఉంటది, అది మన గమ్యస్థానం కాబట్టి. కాలం కూడా అంతే.. క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు.. వెనకబడిపోతున్నయ్. వాటిని నెట్టేసుకుంటూ, మనమే ముందుకు ఉరుకుతున్నమ్. ఇప్పుడు 2014 వంతు. మరొక్క రోజులో దీని ఆయుష్షు కూడా తీరుతున్నది. ఈ ఏడాది చరిత్రలో భాగమైపోతున్నది. కానీ ఈ ఏడాది.. మన స్టేషన్ లాగానే మనతోనే ఉండిపోతది.

కాలాన్ని క్రీస్తు జనానికి ముందు, క్రీస్తు జననానికి తర్వాత అని లెక్కవేసినట్లే, తెలంగాణ చరిత్ర గమనాన్ని 2014కు ముందు, ఆ తర్వాత అని లెక్కిస్తారు. భవిష్యత్ చరిత్రలో ఇప్పటి వర్తమానానికి చాలా ప్రాముఖ్యం ఉంటది. ఈ ఏడాది తెలంగాణ ప్రజలకు సంబంధించి ఓ సాదాసీదా కాలం కాదు. ఈ ఏడాదికున్న ప్రత్యేకత.. గత ఏడాదిలతో పోల్చి చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ చరిత్ర పేజీలు తిరగేస్తే.. కనిపించేదంతా చీకటే. దాదాపు వందేళ్ళ చరిత్ర అంతా బాధలు, కన్నీళ్లు, పోరాటాలు,బలిదానాలు, అవమానాలు. ఏ ఒక్క ఏడాది కూడా మొత్తంగా తెలంగాణ ప్రజలకు సంతృప్తిని, సంతోషాన్ని కలిగింగలేదు.

1947.. దేశ స్వాతంత్యసాధన సంవత్సరం. భారతదేశ ప్రజలందరూ సంబుర పడ్డారు. కానీ తెలంగాణ ఆ సంబురంలో భాగంగా లేదు. తన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా ఎగిరినా ఇక్కడ అనిశ్చితి ఉంది. రేపటి గురించి స్పష్టత లేదు.

1948.. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో కలిపిన ఏడాది. విముక్తా? విద్రోహమా? ఇప్పటికీ క్లారిటీ లేదు. నిజాం నిర్బంధం నుంచి విముక్తి కలిగిందని కొందరు సంతోషపడ్డారు. స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయామని కొందరు బాధపడ్డారు. అసలు ఏం జరుగుతున్నదో తెలియక ముందే, భవిష్యత్ పరిణామాల పై అంచనా కుదరకముందే అంతా జరిగిపోయింది. భారతదేశం తెలంగాణను కలుపుకున్నది. ఇది జరిగి 66ఏండ్లు గడిచినా.. జరిగింది విద్రోహమో, విలీన మో, విముక్తో స్పష్టతలేదు. మొట్టమొదలే సైనిక పాలన అమలయింది. భారత్ లో విలీనమైతే ప్రజలు స్వాతత్య్రం పొందుతారని ప్రచారం జరిగినా, చివరికి నిర్బంధ సైనిక పాలనే దిక్కయింది. (మరింత…)

Telugu literature will flourish in separate states డిసెంబర్ 23, 2013

Posted by M Bharath Bhushan in Andhra, Culture, heritage, Hyderabad, Identity, Kakatiya, Rayalaseema, Telangana, Telugu, Telugu (తెలుగు), Warangal.
Tags: , ,
add a comment

Separate states good for Telugu
Deccan Chronicle, Amar Tejaswi, 22 December 2013

Hyderabad: Literature is an important tool to craft the identity of a populace. Each state in India and regions within have their own distinct identity. The same holds true for Andhra Pradesh. With three definitive regions and 23 districts, the undivided state is a garden of literary flowers.

But once imaginary borders divide the current state into Telangana and Andhra Pradesh, what does fate hold for Telugu literature? Writers reckon the separation will herald better times for Telugu literature and put focus on the unique literature and unsung writers of Telangana.

It has been said that the literature and history of Telangana has been suppressed under the cloak of a united Telugu state for long and has often been dismissed as slang.

Freedom struggles of farmers and common men from the region often don’t find a mention in the regular curriculum. From the Telangana writers’ perspective, their literature was never treated at par with the mainstream Telugu literature. “Telangana has recorded several struggles that are recognised, but they never found their place in the chapters of history. Andhra’s history became the whole undivided state’s history,” award winning writer Prof. Nandini Sidda Reddy explains.

He adds that the genesis of the Telangana struggle for statehood partly lies in literary waters. He says, “Important literary works from Telangana were forgotten. The problem was suppression; there was a lack of equality. Language and literature were cited as reasons to unite Telangana and Andhra when the state was formed, but the equality never existed.” (మరింత…)