jump to navigation

పునర్నిర్మాణం.. మన చేతుల్లోనే – గౌతమ్ పింగ్లే ఏప్రిల్ 13, 2017

Posted by M Bharath Bhushan in 29th State, Culture, Economy, Essays, Identity, politics, regionalism, Telangana, Telangana People, Telugu (తెలుగు).
trackback

నమస్తే తెలంగాణ, 12 April, 2017

-నమస్తే తెలంగాణతో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ డైరెక్టర్ గౌతమ్ పింగ్లే

gowtham pingle

నమస్తే తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ వచ్చింది. ఇక మన చేతుల్లో పని. పునర్నిర్మాణం మన చేతుల్లోనే ఉంది. ఆ సంగతి అధికారులకు అర్థం చేయించడమే నా ముఖ్యమైన బాధ్యత అని సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ డైరెక్టర్ గౌతమ్ పింగ్లే చెప్పారు. ఇప్పుడు మనుషుల సమస్య చాలా ఉందని, మనసు పెట్టి పనిచేసే వాళ్లు కావాలని, అలాంటి వారిని గుర్తించడం, వారితో కలిసి పనులు చేపట్టడం ఒక సవాల్ ఆయన చెప్పారు. ఈ సందర్భంగా గౌతమ్ పింగ్లే నమస్తే తెలంగాణతో మాట్లాడారు. మన రాష్ట్రం మనది అయ్యిందని, జయాపజయాలు మన చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. ఈ తరుణంలో అధికారులకు శిక్షణ ఇస్తూ వారిలో అవగాహన పెంచుతూ ప్రజల వద్దకు పరిపాలనను తీసుకెళ్లడం, మన తెలంగాణ గురించి ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ముందుకు సాగుతుందని పింగ్లే తెలిపారు. ఇప్పటికే మూడు శిక్షణా శిబిరాలు నిర్వహించామని ఆయన చెప్పారు. అధ్యయనానికి ఉపయోగపడే కేంద్రంగా సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్‌ను రూపొందించేందుకు తెలంగాణకు సంబంధించి అనేక అంశాలను ఒకచోటికి చేర్చడం, తెలంగాణకు సంబంధించిన దైనందిన సమాచారాన్ని పంచుకోవడానికి వెబ్‌సైట్ ఏర్పాటు చేయడం మా ముందున్న లక్ష్యాలని పింగ్లే పేర్కొన్నారు.
మన దగ్గర చాలా గొప్ప పుస్తకాలున్నాయని, వాటిని ప్రచురించడం, వివిధ అంశాల వారీగా మన తెలంగాణ ఎట్లున్నదో ప్రపంచానికి చూపేందుకు ముచ్చటైన కాఫీ టేబుల్ బుక్స్ ప్రచురించి, అవసరమైన అంశాలపై సదస్సులు నిర్వహిస్తామని ఆయన వివరించారు. అధికారులకు శిక్షణ, జిల్లా కేంద్రాల్లో ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటును తొలి ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని తెలిపారు. 31 జిల్లాలున్నాయని సంతోషపడటం మంచిదే అయినా అక్కడి సమస్యలేమిటో అర్థం చేసుకుని పరిష్కారానికి నడుం కట్టాలని, అందుకోసం ట్రైనింగ్-రీట్రైనింగ్. రెండూ కావాలని చెప్పారు.

గౌతమ్ పింగ్లే గురించి..

గౌతమ్‌పింగ్లే లండన్‌లోని గ్లాస్‌గో విశ్వవిద్యాలయంలో చదివారు. తెలంగాణలోని వివిధ నీటిపారుదల విధానాలపై పీహెచ్‌డీ చేశారు. అనేక దేశాల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, వ్యవసాయ విధానాలపై సలహాలు సూచనలను అందజేశారు. ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో పనిచేశారు. ఈయన స్వయంగా రచయిత కూడా. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ తెలంగాణ గ్రంథాన్ని వెలువరించారు. ఆయన తండ్రి పింగళి జగన్మోహన్ రెడ్డి ఆర్స్ కాలేజీ వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు.

source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/gautam-pingle-director-of-the-center-for-studies-telangana-restructuring-1-2-541205.html

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: