jump to navigation

హేవళంబి ఉగాది – పల్ల నరేంద్ర మార్చి 28, 2017

Posted by M Bharath Bhushan in Culture, ecology, Telangana, Telangana Festivals, Telugu (తెలుగు).
Tags:
trackback

హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
హేవళంబికి (రైతు) స్వాగతం..
వాన రానీ వాన రానీరా
మా మంచి కాలం తాను దేనీ తాను దేనీరా
రేయి పగలు కాసుకోని కండ్లలొత్తు లేసు కోని
యేసి చూసి జీవులన్నీ ఆసతొ దోసిళ్ళు బట్టగ
వాన రానీ వాన రానీరా
మా మంచి కాలం తాను దేనీ తాను దేనీరా
సురుకులేపే రోహినమ్మ మ్రిగసిరమ్మకు పిలువనంప
యేడి యిడిసి సల్లబడ పన్నీరు బుడ్డి సిలకరించ
ఆగమాగమునొచ్చి ఆర్ద్ర తడిపి తానాలాడించ
సిన్నబోక మందలించ చిన్న పెద్ద పుష్యాల
ఆకసమ్మే జల్లెడవను అస్లేరు ఎదురుజూడ
కార్తెలన్ని కర్షకులను కడుపులోన దాచుకొనగ
వాన రానీ వాన రానీరా
మా మంచి కాలం తాను దేనీ తాను దేనీరా

ముఖముమరి చాటేయకుండ మక్కార్తి మసలుకోను
దయతొ పుబ్బ నిలిచి దెబ్బ కొట్టకుండా వుండ చేను
ఉత్తర చూసి బిత్తర బోయి వలసబోక వుండగాను
అస్తవ్యస్తం గాక హస్త సేయిబట్టి నడప గాను
చిత్తు చేయక రైతు శ్రమను చిత్త సరి కాపాడ గాను
గొడ్లు గోదల పేద కడుపుల కాయకష్టం పండగాను
వాన రానీ వాన రానీరా
మా మంచి కాలం తాను దేనీ తాను దేనీరా
సెమటసుక్క కన్నగూడ ఉప్పదనమది యాడనో
ఎదుగుచుండే చేనుపైన కడుపుతీపది యెంతనో
యవసమంటే గారడీ యను చేదు నిజమును మింగెనో
గొడ్డుకారము తాను దినియే పరమాన్నము పంచెనో
బతుకునిత్యం వగరుపులుపుల సూటిబోటి మాటల
రైతు బతుకనుగాది పచ్చడి హేవలంబి అందుకొనగా
వాన రానీ వాన రానీరా
మా మంచి కాలం తాను దేనీ తాను దేనీరా
వాన రానీ వాన రానీరా
మా మంచి కాలం తాను దేనీ తాను దేనీరా
రేయి పగలు కాసుకోని కండ్లలొత్తు లేసు కోని
యేచి చూసి జీవులన్నీ ఆసతొ దోసిళ్ళు బట్టగ

పల్ల నరేంద్ర

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: