jump to navigation

ఇక కొత్త రెవెన్యూ చట్టాలు సెప్టెంబర్ 8, 2015

Posted by M Bharath Bhushan in Economy, landuse, Nizam, Settler, Telangana, Telugu (తెలుగు), TRS.
Tags:
trackback

ఇక కొత్త రెవెన్యూ చట్టాలు

Namaste Telangana 9/8/2015

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడినరాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడే చట్టాలు మాత్రమే అమలుచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను దోచుకోవడానికి రూపొందించిన, ఆంధ్రాకు మాత్రమే పనికివచ్చే చట్టాలను సమూలంగా పాతర వేయాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టాల రూపకల్పనపై కసరత్తులు మొదలుపెట్టింది. న్యాయశాఖ విభాగం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా కొత్త చట్టాల ఏర్పాటుకు సంబంధించి అధ్యయనం, రూపకల్పన బాధ్యతను నల్సార్ యూనివర్సిటీకి అప్పగించింది. రెండు నెలల్లో కొత్త చట్టాలకు ముసాయిదాలు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి.

భూ వినియోగం ఆధారంగా నూతన చట్టాలు

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కొత్త చట్టాలు చేసుకోవడానికి రెండేండ్లు వెసులుబాటు కల్పించింది. ఈ రెండేండ్ల వరకు ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలను అమలు చేసుకోవచ్చు. ఈలోగా కొత్త చట్టాలు ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే ఏపీ చట్టాలే.. తెలంగాణ చట్టాలుగా అమలులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర భూ వినియోగం, ఇక్కడి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కొత్త చట్టాలను తీసుకువచ్చేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్రంలో ఏ శాఖలో లేనివిధంగా రెవెన్యూ శాఖలో దాదాపు 150కిపైగా చట్టాలున్నాయి. ఇందులో కొన్ని పూర్తిగా సీమాంధ్రకు మాత్రమే పనికి వచ్చే చట్టాలున్నాయని అధికారవర్గాలు అంటున్నాయి. 100కు పైగా చట్టాలు సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.

తెలంగాణకు.. ఆంధ్రాకు ఎంతో తేడా
తెలంగాణలో 1948 వరకు రాచరిక పాలన కొనసాగింది. 1947 ఆగస్టు 15వ తేదీన దేశమంతటా స్వాతంత్య్రం వస్తే.. తెలంగాణ సమాజం రాచరికపు పాలనలోనే ఉంది. తెలంగాణలో అంతా జాగీర్ వ్యవస్థ ఉంటే.. ఆంధ్రాలో బ్రిటిష్ నిబంధనలు అమలయ్యాయి. మన భూములకు పక్కా రికార్డు 1917 ఫస్లీ ఉండగా.. దీనిని సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అడ్రస్ లేకుండా చేశారు. 1957 రికార్డుల పేరుతో గందరగోళం చేశారు. రెవెన్యూ రికార్డులు.. చట్టాల్లో తెలంగాణకు ఆంధ్రాకు ఎంతో తేడా ఉంటుంది. తెలంగాణలో భూమి సర్వే నంబర్లన్నీ సంక్లిష్టంగా ఉంటాయి.

అదే ఆంధ్రాలో సరళంగా ఉంటాయి. తెలంగాణలో జాగీర్ భూములు, ఇనామ్ భూములు, కాందీశీకుల భూములు, కంచె భూములు ఉంటాయి. నిజాం నవాబుల చట్టాల ప్రకారం.. భూమి అంతా దేవుడి ఆస్తి. ఈ భూములను ఎవరికీ అమ్మడానికి, కొనడానికి అవకాశం లేదని నాటి పాలకుల విశ్వాసం. మొత్తం భూములపై నిజాం ప్రభువులదే అంతిమ నిర్ణయం. అందరూ భూముల్లో వ్యవసాయం చేసుకోవాలి. నిజాం సర్కారుకు పన్నులు చెల్లించాలి ఇదీ నాటి వ్యవస్థ. తెలంగాణ ఇలాకాలో నోటి మాటలే హక్కు పత్రాలుగా చలామణీ అయ్యాయి. నాటి వ్యవస్థలోని లోపాలను సమైక్య పాలనలో అవకాశంగా తీసుకున్న సీమాంధ్ర పెద్దలు.. అనేక అక్రమాలకు తెగబడ్డారు. ఇందుకు వీలుగా చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన రెవెన్యూ చట్టాలను మార్చాలని ప్రభుత్వం సమాయత్తమవుతున్నది.

source: http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/the-new-revenue-laws-1-2-488365.html

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: