jump to navigation

ఒక్క సారి భగ్గుమన్న ప్రత్యేక ర్రాష్ట్ర నినాదాలేమిటి? డిసెంబర్ 22, 2009

Posted by Telangana Utsav in 1969, agitation, Andhra, Congress, Culture, GHMC, Hyderabad, Identity, KCR, Kurnool, Mulki, politics, Rayalaseema, Settler, Sonia, TDP, Telugu, Telugu (తెలుగు), TRS, Uttara Andhra.
trackback

ఒక్క సారి భగ్గుమన్న ప్రత్యేక ర్రాష్ట్ర నినాదాలేమిటి?

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభం కాగానే, ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమం, ప్రత్యేక రాయలసీమ ఉద్యమం మళ్ళా ఒకసారి తెరపైకి వచ్చినాయి. ఏ కారణాల వల్లనైతేనేమి మొదటిసారి ప్రత్యేక తెలంగాణాకు అనుకూలమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వం ముందున్న రెండు జటిల సమస్యలు పరిష్కారమైనాయి. ఒకటి కే సీ ఆర్ దీక్ష విరమించడం, రెండు తెలంగాణా ఉద్యమంలోకి ప్రవేశించిన రోశయ్య గారు చెప్పిన అసాంఘిక శక్తుల ఆట కట్టించడం. అయితే ప్రతిసారీ ఎలక్షన్స్ లో చక్కగా ఉపయోగపడే బంగారు గుడ్డు పెట్టే బాతులాంటి తెలంగాణా సమస్యను పరిష్కరించాల్సిన అవసరమొచ్చింది. అంతే, అన్ని పార్టీల నేతలూ ఒక్కసారి ఉకిక్కి పడ్డారు.

2004 నుంచీ దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర విషయాన్ని ప్రస్తావించినవే. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ 2004లొ, మరి 2009లో టిడిపి, పీఆర్పీలూ ప్రత్యేక తెలంగాణా వాదంతో ప్రజల ముందుకు వెళ్ళినవే. ఆ నినాదంతో ఓట్లు వేయించుకున్నవాళ్ళే. అంతేకాదు మొన్నటికి మొన్న అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణా తీర్మానం పెడితే మేము మద్దతిస్తాము అని చిలుక పలుకులు పలికినవారే. ఇవన్నీ మరిచిపోయి కొన్ని గంటల్లోనే, కేంద్రప్రభుత్వం నిర్ణయం చిదంబరం నోట వినంగానే, అదేదో ఇప్పుడే అకస్మాత్తుగా, ఏదో ఊహించనిదీ, జరగకూడనిది జరిగినట్టుగా వింతగా అన్ని పార్టీల నేతలూ ప్రవర్తించడం మొదలయ్యింది. ఆంధ్ర, రాయలసీమ నేతల రాజీనామా పర్వాలు మొదలైనాయి. అలాగే సమైక్యాంధ్రా వాదమూ పైకి లేచింది. ఈ సమైకాంధ్రా వాదము కేవలం ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం కోసమా? లేక ఆంధ్ర ప్రాంతం వారందరూ సమైక్యాంధ్రగా ఏర్పడడం కోసమా? అందుకోసమే అయితే దానితో తెలంగాణా వారికెలాంటి అభ్యంతరమూ లేదు.

మిన్ను విరిగి మీద పడ్డట్టూగా ఒక్కసారి అందరు అన్యాయం అన్యాయమంటూ అరుపులూ మొదలుపెట్టారు. అంతవరకు బాగానే ఉంది. సమైక్యాంధ్ర అంటూ పెనుకేకలూ ఉద్యమాలూ మొదలైనాయి. ఆంధ్రా వాళ్ళని కలిసుండొద్దని ఏ తెలంగాణ వారు అడ్డుకున్నట్టూ? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే ఇతరులను విడిపొమ్మని ఎవరు అనలేదు కదా? తెలంగాణ విడిపోతే కోస్తా వారితో కలిసి ఉండడము మావల్ల కాదనీ వాళ్ళతో కలిసి ఉండడము కల్ల అంటూ రోడ్డుపైకెక్కారు. అంతవరకూ సరే. కోస్తా ఆంధ్రవారు అంటరానివాళ్ళన్నట్టు వాళ్ళతో కలిసుండాలంటే తెలంగాణ విడిపోడానికి వీల్లేదనీ కొత్త పాటపాడటమే ప్రస్తుత రాజకీయాల్లోని విడ్డూరము! తమకు నచ్చింది తాము చేసుకోవడమే కాదు ఇతర్లు ఏమి చేయాలో కూడా శాసించొచ్చు అనే విపరీతబుద్దే మరోమారు కొత్త రీతిలో ప్రత్యక్షమవడము దీని సారాంశం. ఈ దృష్టికోణాన్ని కొంత పరిశీలించాలి.

తెలంగాణ సమస్యపై శాస్త్రీయ పరిశీలన చేయాలని చెప్పిన చిరంజీవి ఆ తర్వాత సామాజిక తెలంగాణకు సై అని సమర్ధించినవాడు, కాంగ్రేస్ టీడీపీలు ఏకంగా ప్రత్యేక రాష్ట్ర నినాదమొక్కటె తమ చిరునామాగా పెట్టుకొన్న టీఆరెస్ తో పొత్తులుపెట్టుకొని ఎన్నికొల్లోకెల్లినవారు ఒక్కసారి ఇది సిలబస్సులోలేని ప్రశ్న, ఇది పరీక్షలో ఎలా వొచ్చిందని అడిగే స్కూలుపిల్లల్లా గందరగోళాన్ని నటించ ప్రయత్నించడం ఏమిటి? ఈ రాగం తగదు, ఇది నిలవదు.

అయితే ఆంధ్రా “సమైకాంధ్రా” అనే పదంలో ‘ఆంద్రాప్రాంత ప్రజలందరూ ఒక్కటీ’ అనే అర్ధమే స్ఫురిస్తుంది.అందులో తెలంగాణా వాసులు కాని, రాయలసీమ వాసులు కానీ కలిసి ఉండాలనే ప్రస్తావనే లేదు. అందుకని ఆంధ్రప్రాంత ప్రజలందరూ కలిసి ఉండాలనుకుంటే తెలంగాణా వాసులెవ్వరికీ ఎలాంటి అభ్యంతరమూ లేదు, పైగా వారందరూ దీన్ని స్వాగతిస్తారు. కాకపోతే సమైక్యాంధ్రా అనుకుంటూనే తెలంగాణా రాయలసీమలనూ అందులో భాగం చేయడమే అసంజసం. సిలబస్సులో లేని ప్రస్తావనంటే ఇదే.

ఇంక హైదరాబాదునేం చేస్తారు అనడం మరీ హాస్యాస్పదం. యాభై మూడేళ్ళు ఈ బలవంతపు కలయిక వల్ల మోసపోయింది చాలు. హైదరాబాదు నగరం చారిత్రకంగా, భౌగొళికంగా తెలంగాణాలో భాగమే. సమైక్యాంధ్ర వాదాన్ని సమైక్య తెలుగు రాష్ట్రవాదంగా అన్వయించుకున్నా తెలంగాణా ప్రజలెవ్వరూ ఆంధ్రరాష్ట్రంతో కలిసి ఉండాలని కోరుకోవడం లేదు. ఈ సమైక్యాంధ్ర వాదం ఆంధ్ర, రాయలసీమల్లో తప్ప తెలంగాణాలో వినిపించకపోవడమే దీనికి నిదర్శనం. అయినా కలిసి ఉండాని ఒక ప్రాంతం వారు మాత్రమే కోరుకుంటే చెల్లదు. ‘మేము మీతో కలవమూ అని తెలంగాణా వాసులు నెత్తీ నోరూ ఎప్పుడో మొత్తుకున్నా, సరైన రాజధాని లేదనే కారణంతో బలవంతపు సమైక్యాన్ని రుద్దినారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకపోతే అది వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి కానీ అమాయకులైన తెలంగాణా మీద పడడం దోపిడీ తత్వానికి నిదర్శనం.

ఎన్నో అవమానాలనూ, ఇంత దోపిడీనీ తట్టుకోలేక తెలంగాణా ప్రజలు ఇన్ని సార్లు ఉద్యమించినా, ఆ ఉద్యమాలను దౌర్జన్యంతో నేలరాసి మళ్ళా మళ్ళా బలవంతపు సమైక్యం ఎంతవరకు సమంజసమో, ఆంధ్రా ప్రాంత నాయకులూ, ప్రజలూ కూడా ఆలోచించాలి. అలాగే కేంద్రప్రభుత్వమూ ఆలోచించాలి.

ఇకపోతే కొంతమంది టీఆర్ ఎస్ కు మెజారిటీ రాకపోవడాన్ని తెలంగాణావాదం ప్రజల్లో లేదు అని చెప్పడానికి నిదర్శనంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఎన్నికల ఆటలో ఉండే ఎత్తుల పొత్తుల రాజకీయ ప్రభావాలు కారణం కావొచ్చు. అంతేకాని ప్రత్యేక తెలంగాణా వాదం ప్రజల్లో లేకపోవడం ఎంతమాత్రం కాదు. అయితే తెలంగాణను టీ ఆర్ ఎస్ గా చూడడం మానేస్తే అది అర్ధమవుతుంది. ఇంకొక విషయం, టీ ఆర్ ఎస్ ఆవిర్భావానికి ముందే తెలంగాణాలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రతేక రాష్ట్ర ఉద్యమాలు నడిచిన చరిత్ర ఉన్నది.

తెలంగాణాలో ప్రత్యేక తెలంగాణా వాదానిక సంపూర్ణ బలం ఉన్నది. కానీ టీ ఆర్ ఎస్ కు కాదు. ఇది అన్ని పార్టీల రాజకీయ నాయకులకూ తెలుసు. అట్లాగే టీ ఆర్ ఎస్ కూ తెలుసు. సొంతంగా పోటీ చేయకుండా ఒకసారి కాంగ్రెస్ తో మరోసారి టీ డి పి తో పొత్తు పెట్టుకోవడమే దానికి నిదర్శనం. అందుకే తెలంగాణా వాదంతో 2004 లొ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళింది. అలాగే 2009 టిడిపి తన సమైక్యాంధ్ర వాదాన్ని వదిలేసి ప్రత్యేక తెలంగాణా వాదంతో ప్రజల్లోకి వెళ్ళింది.

తెలంగాణా అంటే కేసీఆర్ కానీ టీ ఆర్ ఎస్ కాని ఎంతమాత్రం కాదు. అందుకే ఈసారి ఎలెక్షన్స్ లో ఏ మాత్రం మెజారిటీ రాని కేసీఆర్ నిరాహార దీక్షకు కూర్చుంటే ప్రజలు ఏం జరుగుతుందో అని కుతూహలం ప్రదర్శించినారు. ఎప్పుడైతే పళ్ళరసంతో కేసీఆర్ దీక్షను విరమించినట్లు తెలిసిందో వెంటనే కేసీఆర్ డౌన్ డౌన్ లూ శవయాత్రలూ మొదలైనాయి. ఇక లాభం లేదని తెలుసుకొని కేసీఆర్ దీక్షను కొనసాగించాల్సి వచ్చింది. అప్పట్నుంచీ కేసీఆర్ తో సంబంధం లేదంటూ తెలంగాణా కోసం ఉద్యమించాలంటూ విద్యార్థులు, సామాన్య ప్రజలు, ఉద్యమకారులూ, తెలంగాణా ప్రజా సంఘాలు, మొదలైనవారు నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభమయ్యింది.

పెరుగుతున్న తెలంగాణా వాదాన్ని ప్రతిపార్టీ తమకు అందినంతగా సొమ్ముచేసుకోవాల్నుకొన్నాయి. తెలంగాణావాదాన్ని ప్రతి పార్టీ గుర్తించటము దాన్నుంచి లాభం పొదడమూ అన్న రాజకీయ చాతుర్యంలోంచే ఇప్పుడు కొందరికి మింగుడుపడని ‘ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియకూ బీజం వేసారు. దానికి ఈ పార్టీలన్నీ మూల్యం చెల్లించాల్సిందే. చరిత్ర వెనక్కి తిరిగిరానంత వరకు సాగిపోయింది.

ఈ విషయాలన్నీ మన్మొహన్ గారికి సోనియాకు ఇతర కాంగ్రెస్ నాయకులకు గాని తెలియక కాదు. ఇదంతా కావాలని కళ్ళుమూసుకున్నట్టు నటిస్తూ ప్రజలను మభ్యపెట్టడం కోసం చేసే రాజకీయపు ఎత్తుగడే కాని మరొకటి కాదు.

కనుక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ రాజకీయ జిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలి. ఎన్నిసార్లు అణచివేసినా ఉవ్వెత్తున ఎగుస్తున్న ఉద్యమాన్ని నేలరాయడం కూడా మానుకోవాలి. సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణా వాదాల మధ్య స్పష్టమైన తేడాని కళ్ళు తెరుచుకొని చూడాలి. తెలంగాణది దొపిడీ వ్యతిరేక న్యాయపోరాటమైతే, కోస్తా ఆంధ్రది దోపిడి కొనసాగింపు కొరకు దభాయింపు. ఒకటి న్యామైనది, మరొకటి స్వార్ధపూరిత మైనదన్న విషయాన్ని గమనించాలి.

అసమానతలకు దోపిడీకి నిలయమైన ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలు వారికి న్యాయమైనదానికొరకు ఉద్యమించడము సమంజసం. కాని వారికి కోస్తా ఆంధ్ర నుంచి జరగబోయే అన్యాయం అదుపుచేయడం కొరకు తెలంగాణను బలవంతంగా ఇంకా దోపిడికి గురికావల్సిందే అనడము సరైనది కాదు. ఇంకా తెలంగాణా రాష్ట్రాన్ని ఆపడం, తెలంగాణా ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరికాదు. చరిత్ర వెనక్కి తిరిగిరానంత వరకు సాగిపోయింది.

– అనిత

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: