jump to navigation

బాధ్యత రోశయ్య డీఎస్‌లదే! Solution to Telangana deadlock డిసెంబర్ 6, 2009

Posted by Telangana Utsav in agitation, bandh, conflict resolution, Congress, G.O 610, Hyderabad, In News, KCR, Media, politics, Sonia, Telangana, Telugu (తెలుగు), TRS.
trackback

బాధ్యత రోశయ్య డీఎస్‌లదే!

* మొయిలీ ప్రకటనతో తేలింది ఇదే
* వారే సోనియా దృష్టికి తీసుకెళ్లాలి
* ఆమె ఓకే అంటే తమకు అభ్యంతరం లేదని స్పష్టంగా ప్రకటించాలి
* కేసీఆర్‌ స్పష్టీకరణ
* పరామర్శించిన ఆంధ్రజ్యోతి ఎమ్‌.డి., ఎడిటర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (ఆన్‌లైన్‌): తెలంగాణపై రోశయ్య, డీఎస్‌లకే బాధ్యత అప్పగించామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ వీరప్ప మొయిలీ చేసిన ప్రకటన నేపథ్యంలో ఇక సంక్షోభ నివారణ సులువేనని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనలను కూడా రోశయ్య, డీఎస్‌లే సోనియా దృష్టికి తీసుకువెళ్లాలని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను ఆంధ్రజ్యోతి ఎమ్‌డీ వి.రాధాకృష్ణ, ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌లు శనివారం రాత్రి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమరణ దీక్ష కొనసాగుతున్న తరుణంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.

ఈ సంక్షోభ నివారణకు మార్గం ఏమిటన్న ప్రశ్నకు కేసీఆర్‌ స్పందిస్తూ.. పాలకులు తలుచుకుంటే అవకాశాలు అనేకం ఉంటాయని అన్నారు. మొయిలీ ప్రకటన నేపథ్యంలో ఇక చొరవ చూపాల్సింది రోశయ్య, డీఎస్‌లేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం విలేఖరులతో మాట్లాడిన మొయిలీ.. తెలంగాణపై ఢిల్లీలో తేల్చాల్సింది ఏమీలేదని, అక్కడి పరిస్థితిని రోశయ్య, డీఎస్‌లే చూసుకుంటారని చెప్పారు.

తగిన చర్యలు కూడా వారే తీసుకొనగలరని కూడా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేసీఆర్‌ ప్రస్తావిస్తూ.. సమస్యను హైకమాండ్‌ అంటూ రాష్ట్రం.. రాష్ట్రం అంటూ హైకమాండ్‌ ఒకరిపై ఒకరు నెట్టి వేసుకోవడంలో ఎలాంటి ఔచిత్యమూ లేదని అన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు సోనియా ఓకే చెబితే తమకు అభ్యంతరం లేదని రోశయ్య, డీఎస్‌లు స్పష్టంగా ప్రకటించాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌లు అంగీకరిస్తే.. దీక్ష విరమించే అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం కేసీఆర్‌ కుమారుడు తారకరామారావు, కుమార్తె కవితలను కలిసిన రాధాకృష్ణ.. కేసీఆర్‌ ఆరోగ్యం కుదుటపడుతుందని వారికి ధైర్యం చెప్పారు.

source: andhra jyothy 6th dec 2009

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: