jump to navigation

‘ఆంధ్రావాలే బాగో’ నినాదం ఈ రోజుది కాదు డిసెంబర్ 1, 2009

Posted by Telangana Utsav in 1969, Congress, Culture, Identity, livelihoods, Mulki, politics, Telangana, Telugu (తెలుగు), TRS.
trackback

‘బాగో’ నినాదం కొత్తది కాదు

– అనిత

తెలంగాణా డిమాండ్ అనేది ఈ రోజో లేకపోతే 2001లో కేసీఆర్ కొత్తగా తీసుకొచ్చింది కాదు. ఆంధ్రరాష్ట్రంలో విలీనం నాటి నుంచే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉన్నది. ఉద్యం రూపంలో 1969లో తెరమీదికొచ్చింది. ఇక్కడ ఒక చిన్నవిషయం. ఎక్కడ సామాన్యులు, బాధితులు తిరగబడినా వారికి అండగా ఉంటామంటూ నమ్మించి ప్రయోజనం పొందాలని చూసే రాజకీయ నాయకులూ, దొరలూ, జమీందార్లు, భూస్వాములూ అందరూ గోతికాడ నక్కల్లా కాచుకొని ఉంటారు. పోనీ వాళ్ళ ప్రయోజనం వాళ్ళు పొందుతూనే పోరాటంలో అయినా నిజాయితీగా నిలబడినా ప్రజలందరూ వారి వెన్నంటే ఉంటారు. కానీ కేవలం స్వప్రయోజనం చూసుకొని అసలు విషయాన్ని తుంగలో తొక్కితేనే సమస్య.

ఒక సమస్య వస్తే, దాని వల్ల వాళ్ళ జీవనగతికి ఆటంకమేర్పడితే దానికి వ్యతిరేకంగా స్పందించడం తెలిసేది సామాన్యులకే. అయినా ఆ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడటానికి కూడా తీరిక లేని జీవితం వారిది. అయితే ఈ సమస్యలు వ్యక్తి పోరాటంతో పరిష్కరింపబడేవి కావు. దానికి సమిష్ఠి పోరాటం అవసరం. దానికి సమర్ధవంతమైన నాయకత్వం అవసరం. ఆ కారణంగానే ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతవరకు అస్తిత్వంలో ఉన్న నాయకత్వం మీద జనం ఆధారపడతారు. దాన్ని సొమ్ము చేసుకోవడం నాయకుల పని. కాని ఈ నాయకులు అసలు సమస్య గురించే పట్టించుకోకపోతే? ఎక్కడో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక చేనేత కార్మికుడు ఉరి పోసుకుంటాడు. ఒక పోలెపల్లి తిరగబడుతుంది. ఒక రైతు పంట కాలబెట్టుకుంటాడు. తెలంగాణాలో ఉన్నది దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. దొరల పెత్తనానికి వ్యతిరేకంగా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఇప్పుడు ఆంధ్ర వలస పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా. దోపిడీ చేస్తున్న వాళ్ళు మారారు. దానికి తగినట్లుగా డిమాండ్ల పేర్లూ మారుతున్నాయి. తప్పితే దోపిడీ ఆగలేదు. కానీ చేతులు మారుతున్నాయి. ఈ తెలంగాణా రాష్ట్ర డిమాండ్ అనేది తెలంగాణాలో జరుగుతున్న దోపిడీవ్యతిరేక పోరాటానికి కొత్త పేరు.

తెలంగాణా డిమాండ్ పుట్టడానికి స్థూలంగా దోపిడీ కారణమైనా ఆ దోపిడీ చాలా రకాలుగా ఉన్నది. నీళ్ళు, నిధులు, భాష, సంస్కృతి, తిండి, బట్ట ఆఖరికి ఉనికే ప్రశ్నార్ధకమైన స్థితిలో తెలంగాణా డిమాండ్ పుట్టింది. ఎప్పుడెప్పుడు తెలంగాణా డిమాండ్ తెరపైకి వచ్చిందో అప్పుడు ఈ ‘ఆంధ్రావాలే బాగో’ , ‘ఇడ్లీ సాంబార్ బాగో’ నినాదమూ వినిపిస్తూనే ఉన్నవి. ఈ నినాదం పుట్టడానికి కారణం ఉన్నది. ఆంధ్రావాళ్ళ దోపిడీ కేవలం నీళ్ళూ, నిధుల వరకే పరిమితమైతే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేము. కానీ అది అక్కడితో ఆగలేదు. భూముల్ని ఆక్రమించుకున్నరు. అలాగే తెలంగాణ భాష యాసను అవమానించారు.

ఇంత జరుగుతున్నా తెలంగాణా జనమంతా ఎదురుతిరుగుతున్నా వారిని ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా, భాషాపరంగా అణచివేసి వారి గొంతు నొక్కుతున్నారు. ప్రత్యేక తెలంగాణా అనగానే గుండెలు బాదుకొని ఎదో నేరం చేసింట్టు కలిసి ఉంటే కలదు సుఖము అని నీతులు వల్లిస్తున్నారు.
ఇదంతా గమనిస్తే ఆంధ్రావాళ్ళు దాడిచేసింది నీళ్ళు నిధుల పైననే కాదు తెలంగాణ అస్థిత్వం పైననే అనే విషయం అర్ధమవుతుంది.

ఇక్కడ మనకు పదేపదే వినిపించే ఒక మాట గురుంచి మాట్లాడుకోవాలి. ‘ఆంధ్రావాలే బాగో’ అనగానే
భారతీయులందరికీ దేశంలోని ఏ ప్రాంతంలోనైనా బత్కే హక్కు ఉంది కాబట్టి మమ్మల్ని పొమ్మనడానికి మీరెవరు అనేమాట. అయితే తెలంగాణా ప్రాంతంలో ఆంధ్రావాళ్ళే కాదు, ఇంకా ఇతర ప్రాంతాలవాళ్ళు చాలా మందే ఉన్నారు. అందుకే కాళోజీ మన హైదరబదును భారత్ కు సంక్షిప్త రూపంగా అభివర్ణించారు. అయితే మరి అదే హైదరాబాదీలు ఆంధ్రావాళ్ళను మాత్రమే పొమ్మని ఎందుకంటున్నారు? వారు మిగతా ప్రాంతాల వారి మాదిరిగా ఇక్కడి ప్రజలతో కలిసిపోవడం లేదు. కాబట్టి ‘ఆంధ్రావాలే బాగో’ అనే నినాదానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే నాయకులు తెలుసుకోవలసింది ఒకటి ఉంది. వారు కేసీఆర్ ను మాత్రమే వ్యతిరేకించడం లేదు. తెలంగాణా ప్రజల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను కించపరుస్తున్నరు. అయితే ఈ వ్యాఖ్యలు చేసేది కూడా తెలంగాణా నాయకులే కావడం శోచనీయం. దీనివల్ల వాళ్ళకు సెటిలర్ల మద్దతు వాళ్ళకు లభిస్తుందో తెలియదు కానీ స్థానికుల మద్దతును మాత్రం కోల్పోతారు. ఇది ఒకరకంగా తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కోవడం

source: andhra jyoti 24/11/09

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: