jump to navigation

ప్రజల కూటమి కావాలి People’s Alliance for Telangana జనవరి 25, 2009

Posted by M Bharath Bhushan in elections, Identity, NTPP, politics, Telangana, Telugu (తెలుగు), TRS.
trackback

ప్రజల కూటమి కావాలి

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకం కావాలి. తెలంగాణ ఓడ విజయ ఢంకాతో దరి చేరాలి. అందుకే తెలంగాణ నాయకులు ప్రజల కూటమిలోకి రావాలి.

ఎన్నికల దృష్ట్యా రాజకీయాలు వేడెక్కాయి. గత ఐదు సంవత్సరాలలో రాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్థికరంగాలలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త రాజకీయ శక్తులు ప్రజారాజ్యం పార్టీ, నవ తెలంగాణ పార్టీ ఆవిర్భవించా యి. కోస్తా, రాయలసీమలకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు కొందరు ప్రజారాజ్యంలోకి వలస వెళ్ళారు. టిడిపి, సిపిఐ, సిపిఎంలు ఎన్నికల అవగాహనతో కూటమి కట్టారు. ఈ కూటమిలోకి టిఆర్‌ఎస్‌ను కూడా ఆహ్వానించడం తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపు.

సామాజిక రంగంలో బడుగు బలహీన వర్గాల చైతన్యం పెరిగింది. రాజ్యాధికారంలో తగిన వాటాకోసం గొంతు విప్పుతున్నారు. ముఖ్యంగా 93 కులాల బిసిలు ‘రాష్ట్ర జనాభాలో 55 శాతం ఉన్నా తమకు 10-15 శాతం వాటా రావడం లేద ని’ అధికార పార్టీలను నిలదీస్తున్నారు. బిసి కులాలకు చెందిన వివిధ సంఘాల వారు , ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు చైతన్యవంతమైన పౌరులుగా సంఘటితమవుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. ఇది ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లే’నని బిసి మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ వర్గాలనుంచి ఎదిగివచ్చిన దేవేందర్‌ గౌడ్‌ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఈ ఆధిపత్య పార్టీల అధినాయకత్వాలకు ఏ మాత్రం రుచించడం లేదు. గత ఆరుదశాబ్దాలుగా అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న రాష్ట్ర రాజకీయాధికారాలను కింది వర్గాలకు పంచడం పాలక పార్టీలకు అసలే మింగుడు పడటంలేదు.

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని కూడా ఈ పార్టీలు, ఆధిపత్యకులాలు అదే దృష్టితో చూస్తున్నాయి.  కాంగ్రెస్‌ పార్టీ మన రాష్ట్రంలో మొదటినుంచి ఒక సామాజికవర్గానికి పెద్ద పీట వేసింది. బిసిలకు మరీ మొండిచెయ్యి ఇచ్చిన ఘనకీర్తి కాంగ్రెస్‌ పార్టీకే దక్కింది. తెలుగుదేశం పార్టీ మరో సామాజిక వర్గానికి అవకాశాలు మెండుగా కల్పించింది. ఇక బిసిలకు కొసరేసినట్టు చిన్న చితక పదవులు ఇచ్చిన పేరు దక్కించుకుంది. గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఘరానా నేరాలు మితిమీరి పోయాయి. లంచగొండితనం సునామిలాగ సమాజాన్ని ముంచెత్తింది. పరిటాల రవి హత్యతో మొదలైన హింస రకరకాల రూపాల్లో విలయ తాండ వం చేస్తోంది. కప్పట్రాల హత్య, జైల్లోనే మొద్దు శీను హత్య, అనేక మంది ప్రతిపక్ష నేతలు, కార్యకర్తల హత్యలు రాష్ట్రంలో నిత్యకృత్యాలు అయిపోయినాయి. మన ‘రైతురాజ్యం’లో ఎరువుల కొరకై క్యూలో నిలబడ్డ రైతులు చంపబడ్డారు.

ఇండ్ల స్థలాలకై ధర్నా చేస్తున్న వ్యవసాయ కార్మికులు సర్కారు తుపాకి గుండ్లకు బలయ్యారు. హైదరాబాద్‌లో మతోన్మాద టెర్రరిస్టుల బాంబులకు అమాయక ప్రజలుప్రాణాలు కోల్పోయారు. విశా ఖ జిల్లాలో పాడేరు వద్ద ఆదివాసి స్త్రీలు అధికారులచే చిత్రహింసలకు గురయ్యారు. లంచగొండితనం చిన్న స్థాయి క్రింది నుంచి అధినాయకత్వం వరకు హైటెక్‌ స్థాయిలో విజృంభించింది. వృద్ధుల పించన్ల లో, ఇందిరమ్మ ఇండ్లలో, రుణాల మాఫీలో కూడా అక్రమ వసూళ్ళు చోటుచేసుకొంటున్నాయి.

వోక్స్‌ వ్యాగన్‌ కుంభకోణం, దేవాలయాల భూముల కుంభకోణం, సరసాదేవి భూభాగోతం ఎలుగుబంటి బండారం ప్రభుత్వ యంత్రాంగం లో జరుగుతున్న అక్రమాలకు మచ్చుతునకలు. జలయజ్ఞంలో జరుగుతున్న ధనయజ్ఞం ప్రజలకు తెలిసిందే. ప్రజాధనాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లు, విచ్చలవిడిగా పంచుకొంటున్నారు. ప్రాజెక్టు వ్యయాల ఎస్టిమేషన్లు రాత్రికిరాత్రే అనేక రెట్లు పెంచి నిధులు దండుకున్నట్లు కాగ్‌ నివేదిక లు తెలియజేస్తున్నాయి. హైదరాబాద్‌ మొదలైన నగరాల పరిసర ప్రాంతాలలోని ప్రభుత్వ భూముల, చిన్న, సన్నకారు రైతు ల భూములను అక్రమంగా లాక్కున్న ఉదంతాలు ఎన్నెన్నో వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల వెలుగులోకి వచ్చిన సత్యం, మైటాస్‌ అవినీతి వ్యవహారాలు అధికార పార్టీ నాయకుల సంబంధం లేకుండా జరిగే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. పేద ప్రజల సంక్షేమానికంటూ అమలు పరుస్తున్న వివిధ పథకాలు నిజానికి ఎన్నికల తాయిలాలే. ఈ స్కీంల అమలులో ఎంత శాతం అవినీతి జరుగుతున్నదో తెలిస్తే సామాన్యులు ముక్కున వేలేసుకుంటారు. సంక్షేమం పేర ప్రజా«ధనాన్ని కొల్లగొట్టే ప్రక్రియ జరుగుతుంది. పావలా, బేడ, పించన్ల రూపంలో ధర్మం చేయడం కోటానుకోట్లు దండుకోవడం రెండూ జరుగుతున్నవి.

‘పంట ప్రభువులకు, పరిగెలు రైతులకు’ అన్నట్లు సాగుతుంది పాలన. నిత్యం అభివృద్ధి మం త్రం వల్లిస్తేనే అభివృద్ధి జరగదు. ప్రభుత్వ స్కీంలన్నీ పేదలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి కాని శాశ్వత ప్రాతిపదికన ఉపా ధి ఉద్యోగ ఆదాయాలను సమకూర్చడం లేదు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది ప్రజాధన దోపిడీ వృద్ధి. నేరాల వృద్ధి. భూ ఆక్రమణల వృద్ధి. అణచివేత వృద్ధి. ఎన్‌కౌంటర్ల వృద్ధి, నిరుద్యోగ వృద్ధి అని భావించాల్సిందే.

తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రజా జీవన విధ్వంసపు పాలన పోవాలని కోరుకుంటున్నారు. కాని ఈ ప్రాంత ప్రజలకు అంతకంటే ప్రధానమైంది తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని ఉంది. తెలంగాణలో సామాజికన్యాయం పరిమళా లు విరజిమ్మాలని పేద ప్రజలు కోరుకుంటున్నారు. గత 52 సంవత్సరాల నుంచి ఈ కోణంలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నవి. ముఖ్యంగా 2009 ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ప్రజల ఆకాంక్ష. వచ్చే ఏప్రిల్‌లో జరుగబోయే సాధారణ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీలు కూటములుగా ఏర్పడుతున్నాయి. 2004 ఎన్నికల కూటముల కంటే నమ్మదగిన పార్టీలు ఏవైనా కొత్తవి ఇందులో ఉన్నావా అని ప్రశ్నించుకుంటున్నారు. ఆనాటి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, కూటమికి ప్రస్తుత మహా కూటమికి మధ్య తేడా ఏమిటి? కాంగ్రెస్‌ స్థానంలో టిడిపి చేరింది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ 1956 నుంచి మోసం చేస్తూనే వచ్చింది.

తెలుగుదేశం కూడా కాంగ్రెస్‌లాగానే ఆధికారం చేజిక్కించుకోవడానికి ఎత్తుగడ వేసిందని అని ఎందుకు అనుకోకూడదు? టిడిపి జాతీయస్థాయిలో జతకట్టిన మూడవ కూటమి తెలంగాణ ఇస్తమని ఏదైనా విధాన ప్రకటన చేసిందా? ఈ కూటమి ద్వారా తెలంగాణ వస్తదని ప్రజలు ఎలా నమ్మాలి? తెలంగాణ వాదులకు ఇంటివాళ్ళ ద్రోహాలు, బయటివాళ్ళ మోసాలు గుదిబండలైనాయి. డబ్బు ఖర్చుపెట్టి తెలంగాణ సెంటిమెంటు వాడుకుని కోటాను కోట్ల ప్రజాధనా న్ని కమీషన్లు, కాంట్రాక్టుల సంపాదనకే ఉపయోగపడతాయిని 2004లో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు నిరూపించారు.

ప్రజల ఆకాంక్ష నెరవేరే తెలంగాణ కూటమి కావాలని తెలంగాణ ఉద్యోగుల, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు కోరుకుంటున్నారు. ఈ దశలో చంద్రశేఖరరావు, దేవేందర్‌గౌడ్‌, నరేంద్ర, విజయశాంతి కూట మి కడితే 3 కోట్ల 80 లక్షల మంది తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారు. యాభై రెండు సంవత్సరాల నుంచి తెలంగా ణ ఊపిరిగా, తెలంగాణే జీవితంగా, తెలంగాణే బాటగా ఎంచుకొని సుధీర్ఘ ప్రయాణం చేస్తున్న తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ ఈ దిశలో చొరవతీసుకోవాలి. ప్రజా గాయకుడు గద్దర్‌ కూడా భాగస్వామి కావాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇది చివరి అంకం కావాలి తెలంగాణ ఓడ విజయ ఢంకాతో దరిచేరాలి. అందుకే తెలంగాణ నాయకులు ప్రజల కూటమిలో రావాలి.

-కూరపాటి వెంకటనారాయణ
(వ్యాసకర్త కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు)

source : andhra jyothy 25 january 2009

ప్రకటనలు

వ్యాఖ్యలు»

1. prasadsharma - ఫిబ్రవరి 5, 2009

dear kvenkatnarayana garu

namskaramulu

chela bhaga rachinchinaru
ani rajkiya party lu telangana prajalanu MOSAM CHESTHUNAYE
me lanti medhavulu mana telangana nu kapadandi
meru am chesina memu vuntam……..

avadhanul prasad sharma
manthani
prasadsharma72@yahoo.com

2. warangalvasu - ఫిబ్రవరి 20, 2009

Telangana rastram votlathoti seetlathoti radu kevalam vudyamala thote vasthundi.kabatti kavulu,kalakarulu mariyu medavulu ee bhadhyathanu thesukovalani manavi chesthunna.endukante gathamulo chennareddy okkani meeda nammakamu unchithe emichesindo okasari manamu gurthuku chesukovali.eppudunna rajakeeyakulu atuvantivaru kadanukuntunnanu-vasu.9492436539


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: