jump to navigation

తెలంగాణ పోరు- సాంస్కృతిక వారసత్వం source of Telangana movement జనవరి 24, 2009

Posted by Telangana Utsav in Culture, Identity, Poetry & Songs, Telangana, Telugu (తెలుగు).
trackback

పాటే ప్రాణం!
అల్లం నారాయణ

నిద్రలున్న విత్తుకు ప్రాణం మొలకెత్తినట్టు, మట్టిపెళ్లలవాసన మల్లెల గంధమైనట్టు, శిశిరమై రాలిన జీవం చిగురించిన వసంతమైనట్టు, అడవి నిండుగా సింహగర్జన ప్రతిధ్వనించినట్టు, సమ్మక్క, సారక్కల అమ్ముల పొది నుంచి దూసిన కరవాలం అంచు మెరుపు తీగెయై మెరిసినట్టు, బక్క కుల వీరుని పొలికేక సర్వాయిపాపన్న సింహనాదమైనట్టు, మొగులు చిల్లుబడి దారైనట్టు, నేల పొంగి వరదయ్యినట్టు, అడవిలో కోయిలగానమై, పట్నంల తీన్‌మారై, సింగరేణిల సైరన్‌ మోగించి, పోరుపొత్తిళ్ల తెలంగాణ గానం వినిపిస్తున్నారు తెలంగాణ కళాకారులు.

మోట కొట్టిన రాత్రి మోగిన పాట/ తాడు పేనిన తండ్రి తలపులున్నప్పు/కల్లమూడ్చిన అవ్వ కలలోని గింజ/ ఆరుగాలము చెమట నా తెలంగాణ/ ఆక లి దప్పుల మంట నా తెలంగాణ… ఇదొక పాట. ఈ పాట రచయిత నిజానికి సుప్రసిద్ధ వచనకవి, నందిని సిద్ధారెడ్డి. తెలంగాణ కోసం ఆయనిప్పుడుమందిలో మోగే నినాదం లాంటి పాట పాడటం ఇప్పటి సందర్భం. రాజీవ్‌ రహదారివెంట వెళ్తుంటే సిద్దిపేట. అక్కడి దాబాల్లోంచి ఏ పవన్‌కళ్యాణ్‌ ‘తాగినట్టుందే’ అని పాట మోగదు. తెలంగాణ జమిడికె మోతల నాదాలు మోగుతాయి. సుప్రసిద్ధ పాటగాళ్ల, గొంతులు ఆకాశాన్నావరిస్తుంటాయి. ఒక తెలంగాణ వాతావరణం, ఇక తెలంగా ణ తప్పదన్నంత భ్రాంతీ కలుగుతుంది. సిద్దిపేట దాటిన ప్రతివాహనంలో ఒక తెలంగాణ పాటల క్యాసెట్‌ (సీడీ లు) అదనపు ఆకర్షణ. పేర్లెందుకు? ఒక పేరేమిటి? మలి తెలంగాణ ఉద్యమం ప్రధానంగా సంస్కృతీ వికసనం.

ఈ మాటంటే తెలంగాణ ఉద్యమానికి పేటెంట్‌ హక్కు మాదే అంటున్న కేసీఆర్‌ లాంటి రాజకీయ నేతలకు కోపం వస్తే రావొచ్చుగాక గానీ.. తెలంగాణకు ఒక సంప్రదాయం ఉంది. అది సంస్కృతికి సంబంధించింది. కళారూపాలకు సంబంధించింది. నవ్వొచ్చినా, ఏడ్పొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, కోపమెచ్చినా, దిగులుపడినా, గుబులు పడినా, నాటేసి నా, కోసినా, దున్నినా, దోకినా.. ఉద్యమం జెండా ఎగరేసినా అలనాటి సాయుధ రైతాంగపోరాటమైనా, డెబ్భై, ఎనభైయవ దశకాలను వెలిగించిన నక్సల్బరీ అయినా పాట ఒక ఆయుధం. ప్రజాకళలు ఒక ఆయుధం. శ్రీశ్రీ కవిత్వం చదివి అరవైలలో నక్సలైట్లు, కమ్యూనిస్టులయి తే, అనంతర తరం గద్దర్‌ పాటలు విని విప్లవాల్లోకి నడిచారు. గోరటి ఎంకన్నల ‘పల్లెకన్నీరు’ గోసలు కని తెలంగాణ వాదులయ్యారు. ఇదే వాస్తవం.

నిజానికి మలి తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు నడిపించిందెంతో కానీ, పది జిల్లాల్లో ఇప్పటి దాకా జరిగిన వందలాది సభలు, సమావేశాలు, ధూమ్‌ధామ్‌లు జరిపిన భావజాల వ్యాప్తి ఇప్పటి ఉద్యమానికి అందివచ్చిన ఒక ఆయుధం. జగిత్యాల జైత్రయాత్రకు సరిగ్గా ముప్పదేండ్ల వయసు. అలనాటి ఆ సమూహాలను జగిత్యాల నిండిన అప్పటి జనవాహినిని ఇప్పటికీ ఒక మలుపుగా చెబుతా రు. అలనాటి ఆ జనవాహినిలో చిందేసింది కూడా పాటే. ఆ తర్వాత నక్సల్బరీ తరాలకు, రాజకీయ భావజాల ప్రచారానికి పాటే ఒక వేడుక. ఇప్పుడిక తెలంగాణకు ఇదే సంప్రదాయం. అలనాటి నూనుగుమీసాల యువకులు, పాతికేళ్ల పడుచులు ఇప్పుడు తలపండిన నడీడు మనుషులు. ఆ స్వప్నం సాకారం కాలేదు.

ఆ కల తాత్కాలికం గా భగ్నమయింది. కవులు, కళాకారులు, రచయితలు జగిత్యాల జైత్రయాత్రకు జెండెత్తి, జైకొట్టి, కటకటాలు లెక్కపెట్టిన అలనాటి వీరయోధులిప్పుడు తెలంగాణలో తమ శిథిల స్వప్నాల జాడలను చూసుకుంటున్నారు. 370మంది తెలంగాణ విద్యార్థి వీరుల కలలను ఆవాహ న చేస్తున్నారు. కవిత్వం రాస్తున్నారు. తెలంగాణ అన్ని ఉద్యమాల్లోనూ తెట్టులా తేలింది. కరీంనగర్‌ జిల్లా కళాకారులు, రచయితలే, ఇక్కడ ప్రతి అడుగు ఒక ‘నుడుగు’ నేర్పుతుంది. ప్రతి వీధీ ఒక పాట నేర్పుతుంది. ఈ పదేళ్ల తెలంగాణ లేచి నిలబడింది ఎవరి వలన? అంటే ఎవరి లెక్కలు వారికున్నాయి. అలనాటి వీరుల వారసులెవరంటే ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. రాజకీయ నేతలకు వారి పొత్తులు, కత్తులు, సీట్ల లెక్కలు అనేకం ఉన్నాయి.

అవి తరచుగా వారి ఎదుగుదల ప్రణాళికలాగా ఉన్నాయి. కానీ, తెలంగాణ కోసం స్వచ్ఛందం గా, పరిమితంగానైనా నిలబడ్తున్నది ఈ కళాకారులే.. నిజానికి అలనాటి మోసం రాజకీయాలదే.. ఇప్పుడూ అదే కథ.. అదే వ్యథ. అస్తిత్వ ఉద్యమాల్లో సంస్కృతీ మూలాలు కీలక పాత్ర వహిస్తాయి. ఆ సాంస్కృతిక ఉద్యమాలకు ప్రేరణ అలనాటి త్యాగాలవుతాయి. నిద్రలున్న విత్తుకు ప్రాణం మొలకెత్తినట్టు, మట్టిపెళ్లలవాసన మల్లెల గంధమైనట్టు, శిశిరమై రాలిన జీవం చిగురించిన వసంతమైనట్టు, అడవి నిండుగా సింహగర్జన ప్రతిధ్వనించినట్టు, సమ్మక్క, సారక్కల అమ్ముల పొది నుంచి దూసిన కరవాలం అంచు మెరుపు తీగెయై మెరిసినట్టు, బక్క కుల వీరుని పొలికేక సర్వాయిపాపన్న సింహనాదమైనట్టు, తెగిపోయిన నేతన్నల దారపు నరాలు మీటుతూ, మొగులు చిల్లుబడి దారైనట్టు, నేల పొంగి వరదయ్యినట్టు, అడవిలో కోయిలగానమై, పట్నంల తీన్‌మారై, సింగరేణిల సైరన్‌ మోగించి, పోరుపొత్తిళ్ల తెలంగాణ గానం వినిపిస్తున్నారు తెలంగాణ కళాకారులు. వారి పాట నేల పొంగి వానవరదైనట్టు తెలంగాణను కమ్ముకుంటున్నది.

దగాపడ్డ తెలంగాణను అలుముకుంటున్నది. అల్లుకుంటున్నది. అది తెలంగాణ నిండా, తెలంగాణ కోసం, సామాజిక, సాధికార, స్వయం పాలి త, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పాటల నగారై మోగుతున్నది. పొలంపల్లి సెజ్‌లో దొరల పెట్టుబడి దోపిడై, వలస పాలైన పాలమూరు తీరని దుఃఖం తెలంగాణ, ల్యాంకోల్ల దోపిడిలో రాలిన తుర్కోళ్ల కన్నీటివాన, సిబ్బిపూల నడుమ గౌరమ్మ, ఆడ బిడ్డల జాడ బతుకమ్మ తెలంగాణ. దోసిట్ల సెరువులు, కన్నీటి వరదలు… కృష్ణా గోదావరిల మధ్య స్తన్యం దక్కని శిశువై తల్లడిల్లుతున్న తెలంగాణకు లెక్కలు తీస్తున్నది. పంబాల జముకులు, సొన్నాయి పలుకులు, సార్తకాండ్ల వీణ, తోలు డప్పు డోలు దెబ్బలై, తుడుం మోతలై తెలంగాణ కోసం తెగువ తో లేస్తే తప్ప మరి గతిలేదని డప్పు చప్పుళ్లతో చెప్తున్నది తెలంగాణ పాట. ఇది బహుజన గానం, సమస్త వృత్తుల సహస్ర చిహ్నాల బృంద గానం.

సామాజిక శక్తుల నరాల తీవెలు మీటిన ఒక సామూహిక గాత్రం. యాపదిన్న నోరు తీపయిన నల్లనల్లని తల్లికోయిల గొంతున చెమట కారి, చెరువులు కాంగ, దంచంగ, ఇసురంగ ధాన్యరాసులు కాంగ సూపులోన ఉరుము, నెత్తిమీద పొద్దున్న తెలంగాణ సబ్బండ వర్ణాల గానమది. ఎవరి రక్తం తెలంగాణలో ఏరులై పారిందో? ఎవరి త్యాగం పోరునారులై మెలిచిందో? ఓరుగల్లు కోటను, కరీంనగర్‌ బాటను, నల్లగొండ అగ్నిని, ఆదిలాబాద్‌ అడవిని ఎవరి నెత్తురు ఎర్రబారించిందో? ఆ వీరుల వారసు లు వాళ్లు. ఆ వీరులు చాలుబోసిన నెత్తుటి త్యాగాల చరితను గానం చేస్తున్నారు వాళ్లు.

తెలంగాణ ఒక ఆవు నిడిసిన లేగ. అడవి నిడ్సిన బిడ్డ. పాత గోడలు, పందిరి గుంజలు సిన్న బోయిన ఇండ్లు దుమ్ము రేగిన నేల. బంగారు మాయలేడి పోలవరంలో తాతల గుండెల్లాంటి పాపికొండలను, అమ్మల తలపాపి డి లాంటి గోదారి పాయలను పోగొట్టుకొన్నది తెలంగాణ. మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్టు, మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్టు నెత్తిన బోనమెత్తి శివసత్తులు దుంకినట్టు (మిత్ర) పాటల వెల్లువెత్తుతున్నది. తెలంగాణ వారసులు, భావి నిర్ణేతలు రచయితలూ… కళాకారులే!

source: andhra jyothyi – January 24, 2009

వ్యాఖ్యలు»

1. Srinivas Goud - జనవరి 24, 2009

Telangana people are once again cheated by Capitalists, corporates, Banks and Political Parties. All the resources are not only enjoyed by other than the locan habitats, but also exloited to the core by forcefully converting the agriculture lands in to commerical ventures. The orgins of the land are forced to sell thier livelihoods. Many families in rural India have become Landless and the children are leaving behind their parents in villages and migrating to cities or other countries for livelihood. Telanganites are once again betrayed by this country’s poor political systems. If this country and political system is not sensitive to people’s emotions and do not respect their sentiments and demand for self rule, we continue to face this humiliation.

Arise, shout big and fight to win

2. vageesh - జనవరి 26, 2009

Resspected Allam Anna,

Kavulu Kala kaarulu and Gaayakulu Enduko naayakulugaa maaraledu?
Telangaana E theerugundaalno Kala gana galiginamee gaani Karyacharana chese Niirmaanam ( Paarlamentary Raajakeeyalaku Baita) eevallatiki Nirmichalesu— Kavulu Kalalkarulu Gaayakulu.

Dayachesi vaalaku andariki cheppandi ,Parlamentaree Rajakeeyalaku Aavala unse Telanganakosam Cheyalsindemito.

Andarau Kalakarulakoo kavulaku gayakulaku Vandanaalotho

3. T.SAIBABA - ఫిబ్రవరి 5, 2009

Namasthe sumaru 40 samvastharala nundi marachipoyina telangana udhyamamu eppudu galli nundi delhi varaku andra varithosaha telangana nama japamu chepisthunna meerandaraku telangana prajalu entho runapadi unnaru

4. T.SAIBABA - ఫిబ్రవరి 7, 2009

Telangana rastram gurinchi enno samvathsarala nundi kantunna kalalu nijamayye roju daggaralo undi eppude manamu andaramu okka mata meeda undalani andaririki cheppavalasinia bhadyatha nayakula meeda unnadi

5. T.SAIBABA - ఫిబ్రవరి 10, 2009

Andra varini,rayalaseemavarini telangana evvamani adigithe vallu etla estharu? Aina mana rastram manamu theesukovali kani adukkunte radhu— T.Saibaba.9441175959

6. vasu - ఫిబ్రవరి 16, 2009

Telangana rastram votlathoti seetlathoti radu kevalam vudyamala thote vasthundi.kabatti kavulu,kalakarulu mariyu medavulu ee bhadhyathanu thesukovalani manavi chesthunna.endukante gathamulo chennareddy okkani meeda nammakamu unchithe emichesindo okasari manamu gurthuku chesukovali.eppudunna rajakeeyakulu atuvantivaru kadanukuntunnanu-vasu.9492436539

7. vasu - ఫిబ్రవరి 18, 2009

-“Maa rastram maku echi migatha enni mukkalaina chesukondi”ani prakatinchina KCR gariki telangana prajala abhinandanalu.eppatikaina migatha rajakeeyanayakulu dhairyanga bayatiki ravalasina avasaramundi-warangal vasu-9492436539

8. g.sidramappa - ఏప్రిల్ 19, 2009

dongavotlaprAjaswamyamlo labeeying la to telangana radu ,telangana kavulara,kalakarulara udyamabata pattandi veeratelelangana yodhulam kavalisindi ugadi kavitalu kaadu udyamakavitalu,veeratelangaanaviplavakavitalu poratam dwara gujjar rajasathanlo demand sadhincharu pg oradithepoedemiledu banisa sankellu tappa , telangana okka gonthui pata padina ekkadundu ysr ;tokamuduvare lagadapati


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: