jump to navigation

‘సామాజిక తెలంగాణ’ Social vs Geographic Telangana నవంబర్ 16, 2008

Posted by M Bharath Bhushan in elections, Identity, politics, Telangana, Telugu (తెలుగు).
Tags:
trackback

సామాజిక బాణం ‘కొత్త’ కోణం


తెలంగాణ మదిలో చేరిన చిరంజీవి
ఆకట్టుకున్న సినీ నేపథ్యం
అండగా నిలుస్తున్న కొత్త దనం
అస్పష్ట సందేశం ఒక లోపం
అన్ని పార్టీల ఓట్లకూ గండి?
టీఆర్‌ఎస్‌కే అధిక నష్టం
కరీంనగర్‌, వరంగల్‌ టూరుపై విశ్లేషణ

మోతడక సుధాకర్‌ – ఆన్‌లైన్‌, హైదరాబాద్‌ అది… వీర విప్లవ సీమ. ఆయన.. సినీ హీరో. అది ఉద్యమాల పురిటి గడ్డ. ఆయన… ‘నవజాత శిశువు’. అది ఎన్నో పార్టీలు పాతుకుపోయిన ప్రాంతం. ఆయనది… కొత్తగా బలం సాధించే ప్రయత్నం. అది… తెలంగాణ. ఆయన… కోస్తాలో పుట్టి పెరిగిన చిరంజీవి. చుట్టుముట్టిన ‘సెంటిమెంట్‌’ నడుమ సుడిగాలిలా ఆయన పర్యటన సాగింది.

చిరంజీవి తెలంగాణ పర్యటనకు జనం ఎలా స్పందించారు? రాజకీయాల్లో సినీ ప్రభావం అంతగా కనిపించని ప్రాంతంలో ఈ కథానాయకుడు ప్రజల్ని ఏ మేరకు ఆకట్టుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు ‘ఆన్‌లైన్‌’ ప్రయత్నించింది. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలలో చిరంజీవి పర్యటించిన మార్గంలో పలువురిని ప్రత్యక్షంగా పలకరించి.. వారి అంతరంగాన్ని తెలుసుకొని… అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం

(హైదరాబాద్‌-ఆన్‌లైన్‌) సామాజిక తెలంగాణ నా ధ్యేయం. ప్రత్యేక తెలంగాణకు మేం అనుకూలం’ అని నినదించిన చిరంజీవి ఈ ప్రాంత ప్రజలపై తనదైన ముద్ర వేయగలిగారు. ‘ఒక ఆలోచన’ను రేకెత్తించడంలో సఫలమయ్యారు. అదే సమయంలో… తన సందేశాన్ని బలంగా వినిపించడంలో, విస్తృతంగా వ్యాపింపచేయడంలో ఆయన విఫలమయ్యారు.

‘సామాజిక తెలంగాణ’ నినాదం అందరిలో ఆసక్తి రేకెత్తించింది. కానీ… ఆయన పదే పదే పఠించిన ‘మార్పు’ మంత్రంపై స్పష్టత లోపించింది. మార్పు ఎలా ఉంటుంది, ఎలా సాధిస్తారనే విషయం అర్థంకాలేదనే అభిప్రాయం వినిపించింది. గజ్జెకట్టి ఆడే ఆట, తూటాల్లాంటి మాటలతో ఉత్తేజితభరిత కార్యక్రమాలు జరిగే ఈ ప్రాంతంలో… చిరంజీవి ప్రసంగాలు ప్రజల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయనే భావన వ్యక్తమైంది.

నినాదం… ఫలితం…
కరీంనగర్‌లోని సిరిసిల్ల నుంచి వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌దాకా… చిరంజీవి పర్యటించిన ప్రాంతమంతా ఒకప్పుడు నక్సల్స్‌ ప్రాబల్యమున్నదే. ఈ జిల్లాలు… రాజకీయ చైతన్యంలో ముందున్నవి. టీఆర్‌ఎస్‌ బలం, బలగం అధికంగా ఉన్నవి. టీడీపీ, కాంగ్రెస్‌లకూ బలమున్నవి. వామపక్షాలు, బీజేపీ వంటి పార్టీలకూ తమదైన ఓటుబ్యాంకు ఉన్నవి. అన్నింటికీ మించి… గట్టి తెలంగాణ సెంటిమెంట్‌కు కేంద్రాలివి.

అన్నిపార్టీల ప్రభావం అంతో ఇంతో కనిపించే ప్రాంతంలో చిరంజీవి కొత్తగా అడుగుపెట్టారు. ‘సామాజిక తెలంగాణ’ బాణం వదిలారు. ఈ అస్త్రం రెండురకాలుగా పనిచేసిందనే అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణలో బీసీల జనాభా ఎక్కువ. వారికి పెద్దపీట వేస్తామనే సందేశాన్ని పంపుతూ… చిరంజీవి ‘సామాజిక’ నినాదం చేశారు. రాజకీయంగా ఇది బాగా పనికొచ్చే అంశం.

కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో రాజకీయంగా వెలమల ప్రాబల్యం కొనసాగుతుండగా… అక్కడినుంచి చేనేత వర్గీయుడికి టిక్కెట్‌ ఇస్తామని ప్రకటించారు. రెడ్డి కులస్థుల బలమున్న నర్సంపేటలో వెనుకబడిన వర్గానికి చెందిన ముదిరాజ్‌ మహిళకు అవకాశం ఇస్తామన్నారు. బీసీలు ప్రజారాజ్యం గురించి ఆలోచించేందుకు ఇవి కారణాలయ్యాయి. అదే సమయంలో… ఇవే నిర్ణయాలు ఇప్పటికే కొండంత ఆశతో చిరంజీవి పార్టీలో చేరిన ఇతర వర్గాల వారిలో నిరాశకు దారితీశాయి.

సిరిసిల్లలో వెలమ వర్గానికి చెందినవారు పెద్దసంఖ్యలో ప్రజారాజ్యంలో చేరా రు. కాంగ్రెస్‌కు చెందిన రవీందర్‌రావు సోదరుడు గాంధీబాబు ఇదివరకే పార్టీలో చేరారు. క్రియాశీలకంగా పని చేయసాగారు. కానీ… అక్కడ బలహీన వర్గాలకు టికెట్‌ ఇస్తున్నట్లు ప్రకటించడంతో గాంధీబాబులో నిస్తేజం మొదలైంది. అయితే… మావోయిస్టులు, వామపక్షాలు, ఇతర పార్టీలు ఇప్పటికే నిర్మించిన ‘సామాజిక నేపథ్యం’ చిరంజీవికి చక్కగా ఉపయోగపడిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

సూటిగా లేకున్నా…
తెలంగాణ సెంటిమెంట్‌ గాఢంగా అల్లుకున్న కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ఈ అంశంపై చిరంజీవి చేసిన ప్రకటన సూటిగా లేదనే భావన నెలకొంది. అయితే… ఆయన తెలంగాణకు అనుకూలమనే విషయం మాత్రం స్పష్టమైంది. ‘చిరంజీవి మనవాడే’ అని అనుకోవడానికి కారణమైంది. టీఆర్‌ఎస్‌కు గుబులు పుట్టించింది కూడా ఇదే. చిరు క్రమంగా చొచ్చుకుపోయి తమ ఓటుబ్యాంకును కొల్లగొడతారనే ఆందోళన మొదలైంది. చిరంజీవి పర్యటన మార్గంలో పలువురిని ప్రశ్నించినప్పుడు ఇది నిజమేనని తేలింది. పరకాల-భూపాలపల్లి మధ్య ఉన్న ఒక ఊరిలో 1500 ఓట్లున్నాయి.

గతంలో ఈ ఓట్లన్నీ దాదాపు గుండగుత్తగా టీఆర్‌ఎస్‌కు పడినవే. ఇప్పుడు 70 శాతం వరకు చిరంజీవివైపు మొగ్గు చూపే అవకాశముంది. “వెలుగు ఉద్యోగిగా నేను 9 గ్రామాల్లో తిరుగుతుంటాను. ఆ ఊర్లలో 15వేల దాకా ఓట్లున్నాయి. ఇవన్నీ గతంలో టీఆర్‌ఎస్‌కు పడినవే. ఇప్పుడు 10వేల దాకా ఓట్లు ప్రజారాజ్యానికి పడే అవకాశముంది. టీఆర్‌ఎస్‌కు ఇంతకు ముందున్న ఊపు ఇప్పుడు లేదు. చిరంజీవి ఊపు మొదలైంది” అని ఒక వ్యక్తి తెలిపారు.

యువతే బలం…
‘చిరంజీవికి థ్యాంక్స్‌ చెప్పాలి. ఆయన రాకవల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. మాకు మేలు జరుగుతుంది’.. ఇది వైఎస్‌ సూత్రీకరణ. వ్యతిరేక ఓటు మాటెలా ఉన్నా… ప్రభుత్వ సానుకూల ఓటును కూడా చిరంజీవి చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘మా పథకాలే మాకు శ్రీరామరక్ష’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా… ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత చిరుకు ఉపయోగపడుతున్నట్లు చెబుతున్నారు.

యువత, పెద్దగా చదువుకోని వారిలో ప్రజారాజ్యంపై మొగ్గు కనిపిస్తోంది. అంతమాత్రాన అభిమానులు, ప్రభుత్వ లబ్ధిదారులంతా ప్రజారాజ్యానికే ఓటు వేస్తామని చెప్పడంలేదు. చిరంజీవి తన పర్యటనలో భాగంగా కొందరు నాయీబ్రాహ్మణ వర్గానికి చెందిన యువకులను పలకరించారు. ఆప్యాయంగా మాట్లాడారు. వీరంతా గతంలో టీఆర్‌ఎస్‌కు ఓటు వేసినవారే. ‘మెగాస్టార్‌ చిరంజీవి’కి అభిమానులే. కానీ… ఈసారి ఖచ్చితంగా ప్రజారాజ్యానికే ఓటు వేస్తామని వీరు చెప్పలేకపోతున్నారు. “మా అమ్మకు పెన్షన్‌ వస్తుంది. చిరంజీవికి ఓటేయడమంటారా! ఆ సంగతి ఎన్నికలప్పుడు చూద్దాం!” అని వేములవాడకు చెందిన దేవయ్య అనే వ్యక్తి అన్నారు.

ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధిపొందని వారు, ఏ పార్టీల ప్రభావం పడని వారిలో మాత్రం చిరంజీవిపై సానుకూలత నెలకొందని చెప్పవచ్చు. “రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్నా, లేకపోయినా యువకుల్లో మాత్రంపై చిరంజీవిపై ఆసక్తి నెలకొంది. పెద్దవయస్కుల్లో మాత్రం అది కనిపించడంలేదు” అని వేములవాడ-కోరుట్ల మధ్యనున్న రుద్రంగి గ్రామంలో జరిగే కార్తీక పౌర్ణమి జాతరలో పాల్గొనేందుకు వచ్చిన కృష్ణ అనే ఉపాధ్యాయుడు అభిప్రాయపడ్డారు.

“ఓటు వేయనివారుంటారుకానీ… సినిమాలు చూడని వారు దాదాపుగా ఉండరు. చిరంజీవికి సినీ ఆకర్షణ ఉంది. ఆయన కొత్తవాడు. తెలంగాణ వాసులు ఆయనను వ్యతిరేకించేందుకు కారణాలు కనిపించడంలేదు. సముద్రం తీరాన్ని మెల్లగా కోసినట్లు… ప్రజారాజ్యం కూడా టీఆర్‌ఎస్‌, టీడీపీ, కాంగ్రెస్‌ల ఓట్లను కోస్తుంది. చాపకింద నీళ్లలా విస్తరించే అవకాశముంది’ అని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.

కానీ… తెలంగాణ గ్రామాల్లో ఓటు వేసే విషయంలో పెద్దల మాట వినడం రివాజు. యువత, మహిళలు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని సొంతంగా నిర్ణయం తీసుకోవడం కొంత తక్కువే. దీనిని బట్టి చూస్తే… చిరంజీవి యువతతోపాటు పెద్ద వయస్కులనూ ఆకట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అదేసమయంలో… టీడీపీ లేదా టీఆర్‌ఎస్‌తో చిరంజీవి పొత్తు పెట్టుకుంటే ఇక ఎదురే ఉండదనే అభిప్రాయం కూడా వినిపించింది.

ముందున్నది…
ఉత్తరాంధ్రలో చిరంజీవి పర్యటనకు ఆయన ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. దాంతో పోల్చితే… ఉత్తర తెలంగాణ పర్యటనలో అంత ఊపు లేదు. ప్రభావపరంగా చూస్తే… అది ఉత్తర కోస్తాలో పాలపొంగులా ఉబికి మళ్లీ చల్లారింది అనే అభిప్రాయం వినిపించింది. తెలంగాణలో అలాంటి హంగులు, పాలపొంగులూ కనిపించలేదు.

అభిమానుల రూపంలో చిరంజీవికి ‘రెడీమేడ్‌’గా ఎక్కడికక్కడ కార్యకర్తలు లభించారు. ఇతరులు ఒక ‘హిట్‌ సినిమా’ను చూసినట్లు చూశారు. వెళ్లారు. అయినప్పటికీ… తన గురించి జనం ఆలోచించేలా చేయడంలో చిరంజీవి విజయం సాధించారు. తెలంగాణ ప్రజలపై ఒక ముద్ర వేయగలిగారు. ఆ ప్రభావాన్ని అలాగే కొనసాగిస్తూ… ఎన్నికల నాటికి మరింత బలోపేతం చేయగలిగితేనే ఆయన ఆశించిన ఫలితం లభించే అవకాశముంటుంది.

source:andhra jyothy, 16 nov 2008

వ్యాఖ్యలు»

1. Kastury - జనవరి 8, 2009

The history of democracy in India which began as an irony in Nehru era has xulminated with the entry of people in the tinsel world trying to guide the destinies of the people. The entry of people like Amithabh Bachan Jayabahadhuri and Satrughna Sinha, Jayaprada etc have made the democratic debate into a theatrical farce. The entry of late N.T.Rama Rao in A.P and MGR in Tamilnadu and the DMK AIDMK has proved the recundancey of an idealogical framework for the politicaL system. These people made the legislative processes insignificant in shaping the destinies of people. The Beauracracy, The Police are now running the country with a pliable judiciary Peurile issues were made to gain importance and centre stage while the capitalists have looting spree in colusion with world bank and IMF. The economic aspects were least debated. The fascist forces gained popularity. The need for idealogical and political perspectives became less important and theatrics and histironics became substitutes for the expression of meaning ful dissent and logical protests to secure the peoples welfare. That a person should become a cheif minister as the peoples desire has become the empty desire instead of seeking to redress effectively peoples problems. This is worse than the slogan India is Indira and Indira is India at least which sprouted at a coterie level in the past. That people are no longer serious about what for we we elect people except to see their favourite hero as CM or PM while the general attention is diverted like this the fascist forces of Hindutva are making serious inroads into the polity with its venom of hatred and war. I am yet to know sho can save the poor of this country


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: