Telangana sentiment – Myth & reality జనవరి 23, 2008
Posted by Telangana Utsav in Articles.trackback
‘సెంటిమెంట్’ కాదు చైతన్యం
– కడెంపల్లి సుధాకర్
– కడెంపల్లి సుధాకర్
ప్రత్యేక తెలంగాణ వివేచనకు దూరమైన ఒక భావోద్విగ్నత అంశం కాదు, అది ఒక అస్థి త్వ అవసరం. ‘వివేచన లేకుండా భావోద్వేగానికి లోను కావడం’ ఇది, ‘సెంటిమెంట్’ అనే పదానికి ‘ఆక్స్ఫర్డ్ నిఘంటు వు’ ఇచ్చిన నిర్వచనాలలో ఒకటి. ప్రజ్ఞా పాటవాలు లేని ప్రాజ్ఞులు, రాజకీయాలలో సద్యోగంలేని రాజకీ యవేత్తలు, రాజకీయాలు చేసే రాజకీయేతరులు, మోజుతో మీడియావారు ‘సెంటిమెంట్’ అనే పదాన్ని తెలంగాణ విషయంలో ఎంతగా దుర్వినియోగం చేయాలో అంతగా దుర్వినియోగం చేస్తున్నారు. తెలం గాణ డిమాండ్‌ను రెండు వర్గాల ప్రజలు పక్కదోవ పట్టించారు. సెంటిమెంట్ అంటే ఏమిటో తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా పక్కదోవ పట్టించిన వారు కొంతమంది కాగా తెలంగాణ సెంటిమెంట్ అంటే అర్థం తెలియకుండానే ఆ పదాన్ని ఉప యోగిస్తున్న వారు మరికొందరు. మొదటి వర్గం వారు తెలివైన వాళ్ళు, చతురులు కాగా రెండోవర్గం వారు అజ్ఞానులు. వీరెవరో మీకు మీరే నిర్ణ యించుకోవచ్చు.
ఇక్కడ రెండు విషయాలు చెప్పవలసివుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజ లు ఎల్ల్లెడలా తమ సహజ పరిస్థితులలో – సాంస్కృతికమైనవైనా, సామాజికమైనవైనా- ఒకలానే ఉంటారు. కాగా పేదలు ఎక్కడైనా పేద లే! ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, ఉత్తర అమెరికా, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రలో పేదలు ఒకేలా ఉండటం పరిపాటి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు ఆ మహా సంఘ టన ప్రపంచ ప్రజాస్వామ్య పురోగతిలో ఒక మైలురాయిగా అభివర్ణిం చడం జరిగింది. అయితే తద్విరుద్ధమైన ఘటన పశ్చిమ, తూర్పు జర్మ నీల ఏకీకరణను కూడా అదేవిధంగా పరిగణించడం జరిగింది! వీటి వెనుక ప్రజలు తీసుకొనే దృక్పథము, రాజకీయ వైచిత్రి ఉన్నాయి. పది హేను సంవత్సరాల క్రితం అమెరికా అధ్యక్షుడు ఎవరు అన్న విషయమై ఇతర దేశాలవారు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు.
అయితే ఇప్పటి పరి స్థితి వేరు. 30 కోట్లమంది అమెరికన్లు ఎన్నుకొనే అ«ధ్యక్షుడు (అధ్యక్షు రాలునీ ఎన్నుకొంటారని ఆశిద్దాం) ప్రపంచంలోని మిగతా 500 కోట్ల మంది ప్రజల జీవితాలను కూడా ప్రభావితం చేయగలుగుతున్నారు! మనం ఏం తినాలి, మనం ఏం కొనాలి, మనం ఏం తాగాలి, ఏ విధం గా ఓటు వేయాలి అనే విషయాలను ఒక్కమాటలో చెప్పాలంటే మన సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వానికి ఏది శుభప్రదమో మిగతా ప్రపంచానికి కూడా అదే శుభ ప్రదమైనదనేది దీనివెనుక ఉన్న తాత్వికత. దీనితో మీరు విభేదిస్తే సెంటిమెంట్‌కు పోతున్నావని దూషి స్తారు. చనిపోయిన ప్రజాప్రతినిధి భార్య లేదా సమీప బంధువు ఉప ఎన్నిక లేదా ప్రధాన ఎన్నికలో గెలవ డానికి సెంటిమెంట్ తోడ్పడవచ్చు. అయితే తెలంగాణ సెంటిమెంట్ కాదు. ఈ క్రింది విషయాలను నిశితంగా పరిశీలించండి. తెలంగాణ సెంటిమెంటా లేక డిమాం డా అనే విషయాన్ని మీకు మీరే నిర్ణయించుకోండి.
* తెలంగాణలోని 80 శాతం భూభాగం గుండా రెండు ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి. ఎక్కడ చూసినా నీరే. అయితే తాగడానికి కాని, పొలాలను సాగుచేసుకోవడానికి కాని చుక్కనీరు లేదు! నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి భారిన పడినవారు వేల సంఖ్యలో ఉన్నారు. మరి వారి వెతలు సెంటిమెంట్స్ మాత్రమేనా? * పోతిరెడ్డిపాడు, పోలవరం, పులిచింతల. ఎవరికి వరాలు? ఎవరి కి చింతలు? ఎవరికి పాడులు? తెలంగాణ వారి చింతలు సెంటి మెంటా?
* తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు సెంటిమెంట్లే ప్రోద్భలమా? పాలమూరు జిల్లాలో వృద్ధులు, బాలలు మాత్రమే మిగిలారు. మిగతావారు ఎక్కడికి వెళ్ళారు! ఇదీ ఒక సెంటిమెంటేనా?
* సెంటిమెంట్ల కారణంగానే తెలంగాణ ప్రజలు దోమల కాటుకు, పోలీసు వేధింపులకు, నక్సలైట్ల దాడులకు లోనవుతున్నారా?
* ఉస్మానియా, గాంధీ సర్కారీ దవాఖానాలకు వెళ్ళడం సెంటి మెంట్ తోనేనా?
* నిజాం పాలనలోను, రజాకార్ల ఆగడాలలోను, తెలంగాణ సాయుధ పోరాటంలోను, ఆ తరువాత 1969 ప్రత్యేక రాష్ట్ర ఆం దోళనలోను వేలాది ప్రజలు చనిపోయారు. సెంటిమెంట్ కోసమే వీరందరూ చనిపోయారా?
* అభివృద్ధిపేరిట సెజ్‌లకు ఇవ్వడానికి గాను ప్రజల నుంచి వేలా ది భూములను ప్రభుత్వం కారుచౌకగా తీసుకొంటోంది. ప్రభు త్వ చర్యలపై ప్రజల వ్యతిరేక భావాలు సెంటిమెంట్లేనా?
* తెలంగాణ, నల్లగొండ విశ్వవిద్యాలయాల వైస్చాన్సలర్లను కార్యాలయాల సామాగ్రిని పరిరక్షించడానికే నియమించారా? ఇలా ప్రశ్నించడం కూడా సెంటిమెంటేనని భావిస్తారా?
* సినిమాలను నిర్మించడం, అందులోని దుష్టపాత్రలకు తెలంగాణ మాండలికాలను వినియోగించడం తెలంగాణ ప్రజలను హేళన చేయడం కాదా? ఇదీ ఒక సెంటిమెంటేనా?
* తెలంగాణ ప్రజలు వెర్రి వెంగళప్పలై పోయారు. వారు నిరక్షర కుక్షులని, సంస్కృతీ మర్యాదలు తెలియనివారని మీడియా పరి హసించడంలేదా?
* కాలే కడుపులతో తెలంగాణ పేదలు గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నారు. వారి ఆకలికేకలు విన్పించుకోని వారు, వారి సెంటిమెంట్‌ను ప్రశ్నిస్తున్నారు.
* పారదర్శకత పేరుతో టాయ్‌లెట్ పేపర్ కొనుగోలుకు ఇ-టెండ ర్లు పిలుస్తున్నారు. అయితే కోట్లాదిరూపాయల విలువ చేసే కాంట్రాక్టులను నామినేషన్ పద్ధతిన ఇస్తున్నారు. దీనిని ప్రశ్నించ డం కూడా సెంటిమెంట్‌తోనే నంటారా?
* హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒక ప్రభుత్వాసుపత్రి (కింగ్ కోఠీ దవాఖానా) ఉంది. అక్కడే ఇటీవల ఒక ప్రైవేట్ ఆస్పత్రి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వారి సైన్ బోర్డ్ ప్రైవేట్ ఆస్పత్రినే సూచిస్తుంది కాని, పేదలు పోయే సర్కా రీ ఆస్పత్రిని కాదు!
* జి.ఓ. 610 అమలులో స్థానికులందరూ స్థానికేతరులైపోయారు. వారికి రావలసిన న్యాయమైన ఉద్యోగాలను అడిగితే సెంటి మెంట్ అంటున్నారు! ఇలా తెలంగాణ ప్రజల సెంటిమెంట్లను ఎన్నైనా పేర్కొనవచ్చు. పండితులు, రాజకీయవేత్తలు, మేధావులు, పార్టీలు – ఉద్యమాల ప్రతినిధులకు ఒక విజ్ఞప్తి. తెలంగాణను దూషించడానికి సెంటి మెంట్ అనే పదాన్ని ఉపయోగించవద్దు. మీరు తెలంగాణకు అనుకూలురా వ్యతిరేకులా అన్నది అనవసరం. తెలంగాణ ప్రజ ల ఆకాంక్షలను సెంటిమెంట్ అని మీరు మాట్లాడితే తెలంగాణ ను, ఆ గడ్డ ప్రజలను మీరు అవమానించినట్టే.

annadhrajyothy 22 jan 2008
ప్రకటనలు
వ్యాఖ్యలు»
No comments yet — be the first.