jump to navigation

No Second Opinion- 2nd SRC Is Fool’s Recipe జనవరి 11, 2008

Posted by Telangana Utsav in Articles, Telangana.
trackback
ఇప్పుడు వీస్తున్న గాలి ఎస్సార్ ఛీ
తిరస్కరించిన తెలంగాణ
దాంతో ప్రత్యేక రాష్ట్రం అసాధ్యం
ఇది మూడు ప్రాంతాల మనోగతం
జిల్లాల వారీగా….
ఎస్సార్సీ వద్దే వద్దు!
సర్వే చేసిందిలా! ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ఎస్సార్సీ వేయాలన్న కాంగ్రెస్ ప్రతిపాదన వివాదాస్పదమైన నేపథ్యంలో… దీనిపై జనాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించింది. ఎస్సార్సీ ఖాయమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వీరప్పమొయిలీ ప్రకటించిన 24 గంటల్లోపే… గురువారమే… రాష్ట్రవ్యాప్తంగా ‘ఆన్లైన్ నెట్వర్క్’ ద్వారా ర్యాండమ్ సర్వే నిర్వహించాం.
ప్రతి జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని, ప్రతి నియోజకవర్గంలో 50 మందిని పలకరించాం. రాజధాని హైదరాబాద్ విస్తృతిని దృష్టిలో ఉంచుకుని.. అక్కడ 450 మందితో మాట్లాడాం. ఇంటింటికీ తిరిగి కాకుండా… బస్టాండ్లలో, కూడళ్లలో, ఆఫీసుల్లో, గ్రామ చావిడిల్లో, పట్టణ చౌరస్తాల్లో కనిపించిన వారినుంచి… మూడు ప్రశ్నల ద్వారా అభిప్రాయాన్ని సేకరించాం. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు రెండు నియోజకవర్గాల వంతున ఎంచుకొని మొత్తం 2,650 మందిని సర్వే చేశాం. – ఆన్లైన్ న్యూస్ నెట్వర్క్
నిరసనలతో కరీంనగారా
తెలంగాణ నినాదంతో తెరాస అధినేత కేసీఆర్ రెండోసారి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన స్థానం కరీంనగర్. ఆ జిల్లాలో ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ అత్యంత బలంగా ఉందన్నది తాజా సర్వేలో రుజువైంది. రెండో ఎస్సార్సీ ఏర్పాటు సమంజసం కానే కాదని ఈ జిల్లాలో నూటికి 85 మంది ఘంటాపథంగా చెప్పారు. ఎస్సార్సీతో తెలంగాణ రాదని నూటికి 87 మంది తేల్చేశారు.
కాంగ్రెస్కు ‘గ్రేటర్’ ఇబ్బందే?
రాష్ట్ర రాజధానిలో తెలంగాణ వారే కాకుండా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ రెండో ఎస్సార్సీ ప్రకటన పట్ల రాజధానిలో వ్యతిరేకతే కనిపించింది. ఎస్సార్సీ ఏర్పాటు సమంజసం కాదని ఇక్కడ 62 శాతం మంది చెప్పగా, దీనితో ప్రత్యేక రాష్ట్రం రాదని దాదాపు 70 శాతం మంది తేల్చిచెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్కు ఇది ఇబ్బందులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇది దగా అంటోంది తెలంగాణ. ఎస్సార్సీకి ససేమిరా అంటోంది తెలంగాణ. ‘చెయ్యి’వ్వడం అన్యాయమని ఎలుగెత్తుతోంది తెలంగాణ. ఎంతమాత్రమూ దీన్ని అంగీకరించబోమంటోంది తెలంగాణ.
ప్రత్యేక తెలంగాణ డిమాండ్పై పరిశీలనకు రాష్ట్రాల రెండో పునర్వ్యవస్థీకరణ సంఘం (ఎస్సార్సీ) వేయాలన్న కాంగ్రెస్ నిర్ణయం పట్ల తెలంగాణ వాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది ఎంతమాత్రం ఆశించిన ఫలితమివ్వదని నమ్ముతున్నారు. ఎస్సార్సీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వీరప్పమొయిలీ ప్రకటించిన నేపథ్యంలో…. దీనిపై రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించింది. మొయిలీ ప్రకటన వెలువడిన 24 గంటల్లోపే రాష్ట్రవ్యాప్తంగా ర్యాండమ్ సర్వే నిర్వహించింది. 2650 మంది అభిప్రాయాలను సేకరించింది. ఇందులో ఆసక్తికర విశేషాలు వెల్లడయ్యాయి.
అది వద్దే వద్దు!
ఎస్సార్సీ ప్రతిపాదనను తెలంగాణ వాసులు నిర్ద్వం ద్వంగా తిరస్కరించారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని 70 శాతం మంది స్పష్టం చేశారు. కోస్తాంధ్ర, రాయలసీమల్లో మెజారిటీ ప్రజలు ఎస్సార్సీ ఏర్పాటును సమర్థించినప్పటికీ, కోస్తాలో దీన్ని వ్యతిరేకించిన వారి సంఖ్య కూడా దాదాపు సగం (47 శాతం) ఉండడం గ మనార్హం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే ఎస్సార్సీ వే స్తున్నట్టు కాంగ్రెస్ నేతలు నమ్మబలుకుతుండగా…. ఎ స్సార్సీతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎంతమాత్రం సాధ్యం కాదని రాష్ట్ర ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ విషయంలో ప్రాంతాలకు అతీతంగా స్థూలంగా ఏకాభిప్రా యం వ్యక్తమైంది.
ఎస్సార్సీతో తెలంగాణ రాదని తెలం గాణలో 71 శాతం మంది తేల్చిచెప్పగా… కోస్తా రాయలసీమల్లో సైతం దాదాపు 60 శాతంమంది ఇదే మాట అన డం విశేషం. తద్వారా కాంగ్రెస్ మాటలు బూటకమని తెలుగు ప్రజలు దృఢంగా భావిస్తున్నట్టు తేటతెల్లమైంది. ఎస్సార్సీ ద్వారా కాంగ్రెస్ తెలంగాణకు న్యాయం చేయబోదని కూడా మెజారిటీ ప్రజలు పేర్కొన్నారు. తద్వారా కాంగ్రెస్ ఆడిన మాట తప్పిందనే అభిప్రాయా న్ని పరోక్షంగా వ్యక్తంచేశారు.
తెలంగాణలోని మొత్తం పది జిల్లా లూ ముక్తకంఠంతో తమకు ఎస్సార్సీ వద్దని స్పష్టంచేశా యి. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్పై ఆగ్రహం మరీ తీవ్రస్థాయిలో ఉంది. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆ దిలాబాద్లో నూటికి 80 మంది తాజా ప్రతిపాదనను తప్పుబట్టారు. కరవు జిల్లా మహబూబ్నగర్లో కూడా ఇదే స్పందన. కోస్తాను ఆనుకుని ఉండే ఖమ్మంలో మా త్రం కాంగ్రెస్ ప్రతిపాదనపై వ్యతిరేకత కొంత తక్కువగా కనిపించింది. మినీ ఆంధ్రప్రదేశ్ అయిన రాజధాని హైదరాబాద్లో 62 శాతం మంది ఎస్సార్సీని వ్యతిరేకించారు.
కోస్తాలో కొత్తదారి
కాంగ్రెస్కు కంచుకోటగా భావించే గుంటూరు జిల్లాలో… ఆ పార్టీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంకావడం ఆసక్తికరం. తెలంగాణ వాసులతో సమానంగా ఈ జిల్లాలో ఏకంగా 71 శాతం మంది… ఎస్సార్సీని వ్యతిరేకించారు. పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు ఇదే భావన కనిపించింది. తామూ వెనకబడ్డామనీ, తమకూ ప్రత్యేక రాష్ట్రం కావాలనీ ఇటీవలి కాలంలో గొంతెత్తుతున్న ఉత్తరాంధ్రలో సైతం ఎస్సార్సీ ప్రతిపాదనపై నిరసన వ్యక్తమైంది.
విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 69 శాతం మంది ఎస్సార్సీ ఏర్పాటు సమంజసం కాదని స్పష్టంచేశారు. కోస్తాలోని 9 జిల్లాలకుగాను నాలుగు జిల్లాల్లో ఎస్సార్సీ పట్ల వ్యతిరేకత వ్యక్తంకావడం విశేషం. అయితే కృష్ణా నదీ జలాలపై ఎక్కువగా ఆధారపడిన కృష్ణా జిల్లాతో పాటు నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా ల్లో …. కాంగ్రెస్ నిర్ణయానికి అనూహ్య మద్దతు లభిం చింది. ఇక రాయలసీమలో ఎస్సార్సీ పట్ల ఎక్కువ సానుకూలత కనిపించింది.
ముఖ్యమంత్రి సొంతజిల్లా కడపలో ఇదీ మరీ అధికంగా ఉంది. ఎస్సార్సీ ఏర్పాటు స మంజసమా? కాదా? అన్న విషయంలో తెలంగాణ, తెలంగాణేతర ప్రాంతాల మధ్య విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, ఎస్సార్సీ ద్వారా తెలంగాణ రాదన్న విషయంలో మాత్రం రెండు ప్రాంతాల ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. సర్వే చేసిన వారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు (మూడింట రెండు వంతుల మంది) ఇదే మాట చెప్పారు. ఎస్సార్సీతో తెలంగాణకు న్యాయం చేయాలన్న ఉద్దేశం కాంగ్రెస్కు లేదని రాష్ట్రవ్యాప్తంగా 61 శాతం మంది భావిస్తున్నారు.
Source : aandhrajyothy, 11 Jan 2008

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: