jump to navigation

తెలంగాణ ఫొటోగ్రాఫర్ డి. రవీంద్రరెడ్డి : ఫెయిల్యూర్ స్టోరీ జూలై 22, 2007

Posted by M Bharath Bhushan in Articles, Photos, Telugu (తెలుగు).
trackback

Failure Storyరాత్రి పన్నెండు గంటల సమయంలో ఫోన్ లో తనకు వినిపించిన-
‘యు సేవ్ డ్ మై హెడ్ ‘ అంటూ కృతజ్ఞత ధ్వనించే పెన్ బర్తె మాటలను మరోసారి ఇష్టంగా జ్ఞాపకం చేసుకున్నారు డి.రవీంద్రరెడ్డి తన స్టూడియోలో.

పెన్ బర్తె ఎవరంటారా?
‘యు సేవ్ డ్ మై హెడ్ ‘ అని ఆయన రవీంద్రరెడ్డితో ఎందుకన్నాడంటారా? అసలు రవీంద్రరెడ్డి ఎవరంటారా? ఆయన ఓ ఫోటోగ్రాఫర్ . ఆయన ఫెయిల్యూర్ స్టోరీయే ఇది

తన అసిస్టెంట్ కు ఏదో అసైన్ మెంట్ గురించి చెబుతూనే-
‘నాది మొదటి నుంచి కూడా దూకుడు మనస్తత్వమే గురూ’ అంటూ నవ్వారు రవీంద్రరెడ్డి. ‘ఆ దూకుడే నాలో లేకపోతే ఆరోజు అంత డేర్ చేసేవాడిని కాదు’ అంటూ దాని గురించి చెప్పడం ప్రారంభించారు.

1992 డిసెంబర్ నెల.
‘ఈసారి బాబ్రీమసీదును తప్పనిసరిగా కూలగొడతారు’ అని అందరూ బలంగా నమ్ముతున్న సమయం.
మీడియా అప్రమత్తమైంది. ఒక విధంగా చెప్పాలంటే మీడియా అయోధ్యలో మోహరించింది.
నేను డిసెంబర్ 5న అయోధ్యకు చేరుకున్నాను. సంచలనాత్మకమైన ఫోటోలు తీయాలనే కోరికతో నేను అక్కడకు వెళ్లలేదు. కేవలం ఆసక్తితో మాత్రమే వెళ్లాను. ఏమిటి ఆ ఆసక్తి అంటే…రఘురాయ్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ ఫోటో జర్నలిస్ట్ లు అక్కడికి వస్తారు. వాళ్లు ఫోటోలు ఎలా తీస్తారు? నేను ఎలా తీస్తున్నాను? అని కంపేర్ చేసుకోవడానికి అది చక్కని అవకాశంగా భావించి వెళ్లాను.
డిసెంబర్ ఆరు. మధ్యాహ్నం ఒంటిగంట సమయం.

ఒకవైపు నేతల వేడి ఉపన్యాసాలు. మరో వైపు లక్షలాదిమంది కరసేవకులు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. ఇంక కొద్దిసేపట్లో ఏదో జరగబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దేశ, విదేశాల ఫోటోగ్రాఫర్లు బాబ్రీమసీదు వైపు కెమెరాలు తిప్పి రెడీగా ఉన్నారు.
‘జై శ్రీరామ్ ‘ నినాదాలు మిన్ను ముడుతున్నాయి. అనుకున్నట్లుగానే బాబ్రీవిధ్వంసం మొదలైంది.
అందరిలా ముందు వైపు నుంచి కాకుండా బాబ్రీమసీదు లోపలికి వెళ్లి ఫోటోలు తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. నిజానికి ఆ సమయంలో అదొక ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే దూరం నుంచి ఫోటోలు తీయడమే అప్పుడు ఒక సాహసం. కరసేవకులు దొరికిన వాడిని దొరికినట్టు కొట్టి కెమెరాలు పగలగొడుతున్నారు.

‘ఫోటోల సంగతి దేవుడెరుగు. ప్రాణాలతో మిగిలితే అదే పదివేలు’ అంటూ పారిపోయిన ఫోటోగ్రాఫర్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి సమయంలో బాబ్రీమసీదు లోపలికి వెళ్లి ఫోటోలు తీయాలనుకోవడం పిచ్చిపని. కాని ఆ సమయంలో నాకెందుకో అలా అనిపించలేదు. ఎలాగైనా సరే ఫోటోలు తీయాలనే పట్టుదలతో కెమెరా ఎవరికి కనిపించకుండా మేనేజ్ చేస్తూ బాబ్రీమసీద్ లోపలికి వెళ్లాను.

Babri Masjidఫటా.. ఫటా.. కంటికి కనిపించినదానినల్లా తీశాను.
ఇంతలో ఎవరో నన్ను చూడనే చూశారు.
‘ఉస్ కో పక్ డో’ అని మిగతా వాళ్లను అప్రమత్తం చేశారు. ఆ సమయంలో నేను చేయాల్సినవి రెండు పనులు. ఒకటి నన్ను నేను రక్షించుకోవడం. రెండు నేను తీసిన ఫోటోలను కాపాడుకోవడం. పరుగు. పరుగు.

ఒకరిద్దరికి దొరికినట్లే దొరికాను. దెబ్బలు తింటూనే చాకచక్యంగా తప్పించుకొని దూరంగా పారిపోయాను.

అయోధ్య రైల్వేస్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి ఫరిదాబాద్ వెళ్లాను. ఆ తరువాత లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లాను. అప్పుడు నేను ‘ఇండియా టుడే’కు ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాను. ఆ పత్రిక ఆఫీసుకు వెళ్లి నేను తీసిన ఫోటోలు ఇచ్చాను. అలాగే ‘వీక్ ‘ పత్రికకు కూడా ఇచ్చాను. పి.టి.ఐ ఆఫీసులో నాకు తెలిసిన మిత్రుడు ఉండడంతో అతన్ని కలుసుకోవడానికి వెళ్లాను. పి.టి.ఐ ఉన్న భవనంలోనే అంతర్జాతీయ పత్రిక ‘టైం’ కార్యాలయం ఉందని తెలుసుకొని నేను తీసిన ఫోటోలు వాళ్లకూ ఇవ్వడానికి వెళ్లాను.

‘వుయ్ డోంట్ వాంట్ ఎనీ ఫోటోస్ ‘ అన్నాడు పెన్ బర్తె ‘ఇక నువ్వు వెళ్లొచ్చు’ అనే అర్థంలో. పెన్ బర్తె ‘టైమ్ ‘ పత్రికకు సౌత్ ఏషియన్ బ్యూరో చీఫ్ . అయోధ్యకు తమ పత్రిక ఫోటోగ్రాఫర్ ను కూడా పంపినట్లు ఆయన చెప్పారు.

‘నాకు డబ్బులేమీ అవసరం లేదు. ఈ ఫోటోలు తీసుకోండి’ అని ఇవ్వబోయాను. ‘మా మేనేజర్ కు ఇచ్చి వెళ్లండి’ అని ఆయన తన పనిలో మునిగిపోయారు.

సరిగ్గా మూడురోజుల తరువాత రాత్రి పన్నెండు గంటల సమయంలో ఫోన్ మోగింది. ‘యు సేవ్ డ్ మై హెడ్ ‘ అన్నారు పెన్ బర్తె. ‘టైమ్ ‘ పత్రిక ఫోటోగ్రాఫర్ కెమెరాను కూడా కరసేవకులు ధ్వంసం చేయడంతో వారికి బాబ్రీ విధ్వంసంపై ఫోటోలు లేకుండా పోయాయి. ఆ సమయంలో నేను ‘టైం’ కార్యాలయంలో ఇచ్చి వచ్చిన ఫోటోలే వారికి ఆధారమయ్యాయి. ‘నీ ఫోటోలే గనుక మా దగ్గర లేనట్లయితే నా ఉద్యోగం పోయేది. ఛాలా థ్యాంక్స్ ‘ అన్నారు పెన్ బర్తె. ‘ఇండియా టుడే’, ‘వీక్ ‘లాంటి జాతీయపత్రికలలో, ‘టైం’లాంటి అంతర్జాతీయ పత్రికలో నా ఫోటోలు ప్రముఖంగా రావడంతో ఎక్కడలేని గుర్తింపు లభించింది నాకు. ప్రాణాలు పణంగా పెట్టి ఫోటోలు తీశాను. ఫలితం దక్కినందుకు సంతోషించాను.

‘యు సేవ్ డ్ మై లైఫ్ ‘ అని నేను అనాల్సి వస్తే ఎవరితో ఈ మాట అంటానో తెలుసా?
‘ఫోటోజర్నలిస్ట్ గా పేరు తెచ్చుకోవాలి’ అని నాలో బలీయంగా ఉన్న కోరికకు! ఈ కోరికే దాదాపు చచ్చిపోయిన నన్ను బతికించింది. దాని గురించి కూడా చెప్పుకోవాలి….

* * *

1996. నిప్పులు చెరిగే ఎండాకాలం.
ఒక ఎసైన్ మెంట్ కు వెళ్లి రాత్రి ఒంటిగంట సమయంలో రాజ్ భవన్ రోడ్డు మీదుగా బైక్ పై వస్తున్నాను. హెల్మెట్ డిప్ప పైకి తీశాను. చల్లని గాలి తాకింది. బాగా అలసిపోయి ఉన్నాను. నాకు తెలియకుండానే కళ్లు మూత పడ్డాయి.
అంతే … తూలి మెట్రోరెసిడెన్సి దగ్గర్లోని రోడ్ డివైడర్ గ్రిల్స్ మీద పడ్డాను. శరీరంలో ఇనుపచువ్వలు దిగాయి. షర్ట్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. బండి వెనకాల కూర్చొని ఉన్న మా కజిన్ కు స్వల్పంగా దెబ్బలు తగిలాయి. అతను భయంతో వణుకుతున్నాడు.
‘రాజ్ భవన్ కు వెళ్లి అంబులెన్స్ కోసం ఫోన్ చేయించు’ అన్నాను. అతను పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
సెకండ్ షోకు వెళ్లివస్తున్నవారు నా కంట పడ్డారు.
‘నన్ను బతికించండి. హాస్పిటల్ కు తీసుకెళ్లండి’ అంటూ ప్రతి ఒక్కరిని బతిమిలాడడం ప్రారంభించాను.
ఘోరమైన విషయమేమిటంటే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్లాలనే దయ ఎవరికీ కలగలేదు. ఎవరి హడావిడిలో వాళ్లు పోతూనే ఉన్నారు. ఇంతలో మా కజిన్ వచ్చి-
‘రాజ్ భవవన్ లో నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు’ అన్నాడు.
ఇంతలో ఒక అబ్బాయి నన్ను చూసి ఆటో తీసుకొని వచ్చాడు. అప్పటికే నేను కోమాలోకి వెళ్లాను. నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేశారు.

కార్డియాక్ అరెస్ట్ (గుండె ఆగిపోవడం) అయింది. కృత్రిమశ్వాస పెట్టారు. రెండు మూడు రోజుల తరువాత కోమా నుంచి బయటికి వచ్చాను. మూడు నెలల పాటు ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాను. లక్షరూపాయల వరకు ఖర్చు అయింది. ఈ ఖర్చు మాట ఎలా ఉన్నా ప్రమాదం జరిగిన తీరును గుర్తుకు తెచ్చుకుంటే అసలు నేను బతకడమే ఒక పెద్ద వండర్ ! గుండెకు కొద్ది దూరంలో రాడ్ దిగింది. అది ఏ కొంచెం గుండెను తాకినా చనిపోవడమే! ఇంత విషమపరిస్థితుల్లోనూ నేను బతికానంటే అది నా ఆశయ మహిమే. ఏదో ఒకటి సాధించకుండా కన్ను మూయవద్దు అనే నా ఆశయంలోని బలమే నన్ను బతికించింది అని పూర్తిగా నమ్ముతున్నాను.

* * *

1996 నుంచి నాకు రెండో జీవితం మొదలైంది.
నేను అనుసరిస్తున్న విధానాల్లో కూడా మార్పు తెచ్చాను. కేవలం ఫోటో జర్నలిస్ట్ గా పనిచేయడమే కాకుండా పిక్టోరియల్ డాక్యుమెంటరీలను తీసుకురావాలని అనుకున్నాను. ఎందుకంటే ఇవి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. 2000 సంవత్సరంలో ‘ఇండియా- ఆంధ్రప్రదేశ్ ‘ అనే పుస్తకం తీసుకువచ్చాను. అతది చాలా సక్సెస్ అయింది. ఈ పుస్తకానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి. నా ప్రయత్నాన్ని అభినందిస్తూ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉత్తరం కూడా రాశారు.

* * *

ఆ లేఖను ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించారు రవీంద్రరెడ్డి. దీనికి కొద్ది దూరంలో నల్లటి ఫ్రేమ్ తో పాత ఇన్ లాండ్ లెటర్ ఒకటి కనిపించింది.

‘ఆ పాత లెటర్ ను ఫ్రేమ్ కట్టించుకున్నారు ఎందుకు?’ అని అడిగితే ఆయన ఇలా చెప్పారు:
‘ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ లెటరే నా టర్నింగ్ పాయింట్ కు కారణమైంది. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’ అన్నారు. దీని గురించిన వివరాలు అడిగినప్పుడు ఆయన తన బాల్యంలోకి వెళ్లారు….

* * *

మా నాన్న వరంగల్ లో ఇంజనీర్ గా పనిచేసేవారు. చదువు తప్ప ఏ విషయం మీదైనా సరే నాకు చాలా ఆసక్తిగా ఉండేది. కెమెరా లవ్వులో ఎప్పుడు పడ్డానో, ఎలా పడ్డానోగానీ అదంటే నాకు చాలా వ్యామోహంగా ఉండేది. నా పిచ్చిని చూసి పదవతరగతిలో ఐసోలి-2 అనే కెమెరాను కొనిచ్చారు నాన్న. వరంగల్ లోని ఆంధ్రా బ్యాంకులో పనిచేసే ఉద్యోగి ఒకరు ఫోటోలు బాగా తీస్తాడని విని నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్లాను. మొదట్లో కాస్త చెప్పేవాడుగానీ ఆ తరువాత నా అతి అసక్తి చూసి ఆయన ముఖంలో చిరాకు తొంగిచూసేది. నాకు ఫోటోగ్రఫి నేర్పించే ఉద్దేశం అతనికి లేదని తెలిసిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఫోటోగ్రఫి గురించి తెలుసుకోవాలనే పట్టుదల పెరిగింది. ఒకరోజు ఎక్కడో ఫోటోగ్రఫి మీద రాసిన ‘హౌ టు డు ఇట్ ?’ అనే చిన్న పుస్తకం చూసి వెంటనే కొన్నాను. అది మొదలు ఫోటోగ్రఫి మీద నా ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. స్వంతంగా డార్క్ రూం తయారుచేసుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ కెమికల్స్ కొని ఫోటోలు వేసేవాడిని.

‘వీడికి ఫోటో పిచ్చి పట్టింది. ఇలాగైతే చదవడం కష్టం’ అని నా దృష్టి మరల్చే ప్రయత్నాలు సామ దాన దండోపాయాలతో ఇంట్లో వాళ్లు చేసినా నా పిచ్చి నాదే. ఈ పిచ్చిలో పడి ఇంటర్మీడియెట్ లో ఇంగ్లీష్ తప్పాను. ప్రభుత్వం అయిదు గ్రేసు మార్కులు కలపడంతో పాసయిన అయిష్టంగానే డిగ్రీలో చేరాను. ఫోటోగ్రఫి మాట ఎత్తినప్పుడల్లా నాన్న తిట్టేవాడు. పి.జి అయ్యాకగాని నువ్వు ఫోటోగ్రాఫర్ కావడానికి వీలు లేదు అని షరతు పెట్టారు. అత్తెసరు మార్కులతో డిగ్రీ పాసైన తరువాత మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న విక్రం యూనివర్శిటీలో ఎం.ఏ ఇంగ్లీష్ లో చేరాను. ఇదే యూనివర్శిటీలో మా ఫ్రెండ్ చదువుకునేవాడు. ఇక్కడ కూడా నాకు చదువు కంటే ఫోటోగ్రఫి మీదే ఆసక్తి ఎక్కువగా ఉండేది. మా ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఎల్ .ఎస్ .శర్మగారికి కూడా నాలాగే ఫోటోగ్రఫి అంటే యమపిచ్చి. ఆయన ఒకరోజు నా రూమ్ కు వచ్చి ‘నువ్వు తీసిన ఫోటోలు చూపించు’ అని అడిగితే చూపించాను. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. వెంటనే మా నాన్నకు ‘ఇతనికి ఇంగ్లీష్ సాహిత్యం మీద ఆసక్తి లేదుగానీ ఫోటోగ్రఫి మీద మాత్రం చాలా ఆసక్తి ఉంది. నా దృష్టిలో మీ అబ్బాయి ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్ . మీరు ఇతన్ని ప్రోత్సహించండి. మీరు గర్వించేలా తయారవుతాడు’అని ఉత్తరం రాశారు. ఈ ఉత్తరంతో మా నాన్నలో మార్పు వచ్చింది. నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టారు.అందుకే దాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టాను. ఎం.ఏ పూర్తయిన తరువాత జెఎన్ టియులో స్టిల్ ఫోటోగ్రఫి కోసం ఎంట్రెన్స్ రాస్తే మొదటి ర్యాంకు వచ్చింది! కోర్సు చేస్తూనే దక్కన్ క్రానికల్ లో కొంత కాలం ఫోటోజర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తరువాత ప్రెస్ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా పనిచేయడం ప్రారంభించాను.

పెంగ్విన్ వాళ్లు ‘ది డెఫనెటివ్ ఇమేజెస్ ‘ పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. 1858 నుంచి వచ్చిన అత్యుత్తమ ఫోటోలను ఇందులో ప్రచురించారు. ఈ పుస్తకంలో నేను తీసిన బాబ్రీమసీద్ ఫోటో, లాతూరు భూకంపానికి సంబంధించిన ఫోటో చోటు చేసుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నాను. చరిత్రలో ప్రతి సామాజిక ఘట్టాన్నీ కెమెరాతో రికార్డ్ చేయాలనేది ఒట్టి కోరికే కాదు నా బలమైన ఆశయం కూడా.

– యం.డి.యాకుబ్ పాషా

Source: Failure Story- D Ravindra Reddy, Andhra Jyothy, 15 July, 2007

వ్యాఖ్యలు»

1. Bhoomaiah Dasari - జూలై 23, 2007

Thank you for wonderful artcle on Mr. reddy. I know him much before joining JNTU and I used to admire the interest he used to show the love for photography. I still remember his curiosity and keen observations when we were taking pics in Indira park or sanjeevaiah park way back in 1985. I am really happy and proud of him for taking heights of JNTU alumi fame across the country. Though I am little far awaay from him I pray God for his good health.

Dasari Bhoomaiah
Technical Officer
Central Institute of Fisheries Education
Mumbai
http://www.cife.edu.in
09323705656

2. Bhaskar - జూలై 23, 2007

He is a fantastic photographer and a nice person to talk. I know him through a common friend, hmm…friends…

Bhaskar

Dr. TLS Bhaskar
9866656176

3. Pasham Yadagiri - జూలై 23, 2007

Dear friends,
I am really thrilled at the sight of the scanned of copy of Telugu gadda.Late Masmidi Ramakantha rao was great journalist of unswerving commitment to journalism and Telangana. I went to his house in Rahmatnagar along with my guru S.V.V.Subbarayudu some twenty five years ago.Fire in him was still burning even at that age.He discussed at length his plans for revival of Telugu Gadda.He hoped that revival of his publication would lead to revival of Telangana struggle.Paucity of resources was the dampener.At the same time he was conscious that publication in the absence of popular struggle was a futile exercise.
Sadly, he was a victim of backlash that Telangana witnessed after 1969 agitation.I remember that arrest warrant was issued against him on the pretext of violation of Registration of Newspapers for India(RNI) regulations. Even this has not disheartened him.Subbarayudua even on his death bed,fondly remembered his colleague and compatriot Ramakantha rao and his contributions to Telangana struggle.I bow head to address salutations to both of them.I also thank those who posted the copy of Telugu Gadda that made me nostalgic this pleasant morning.

4. Rajasekhar Reddy Allipuram - జూలై 24, 2007

Ravi is a fantastic photographer and I am glad to be his friend.
I did check most of this works and they are reall fantastic
All the best for his future endeavours.

Thanks
Raj Allipuram
http://www.allipuram.com

5. ashok - అక్టోబర్ 25, 2008

Ravi is a fantastic photographer

Thanks
ashok (rudraksha-rudraksha).com
http://www.rudraksha-rudraksha.com

6. ashok - అక్టోబర్ 25, 2008

Ravi is a fantastic photographer

Thanks
ashok
http://www.rudrabandu.com

7. kiran D WGL - అక్టోబర్ 30, 2008

can i have contact number of the grt Photographer Mr. Ravindra reddy…
can nybody help me pls

8. Shashi Mettu - ఏప్రిల్ 18, 2009

Hi

Kiran,

Please emial him at ravistudios@gmail.com or you can reach him at 9866332244.Latest pics from Ravinder are Panoramas made with Gigapan please enjoy

Charminar
http://www.gigapan.org/viewGigapan.php?id=19862

Golkonda

http://www.gigapan.org/viewGigapan.php?id=19862

Regards
Shashi Mettu


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: