jump to navigation

నా తెలంగాణ మార్చి 21, 2007

Posted by M Bharath Bhushan in Poetry & Songs, Telugu (తెలుగు).
trackback

నా తెలంగాణ
మమత కురిసేటి సోన
నా తెలంగాణ
ప్రేమ విరిసేటి కోన

కల్మషం ఎరుగని కష్టజీవుల సేన
వెలిసెనీ అనురాగ మూర్తి గర్భాన               // నా తెలంగాణ//

కల్మషం ఎరుగని కష్టజీవుల సేన
వెలిసెనీ అనురాగ మూర్తి గర్భాన               // నా తెలంగాణ//

దర్జాగ దక్కను పీఠ భూమిన నిలిచి
కృష్ణ గోదావరుల పెంచి పోషించి
దండకారణ్యమ్ము వొడి లోన తలవుంచి
నల్లమల అడవుల్ల చల్లగా నిదురించి
కొండలు, గుట్టలు నాపరాళ్ళ నడుమ
వాగులొంకలు వొర్రెలెన్నివేలో గన్న               // నా తెలంగాణ//

కాళ్ళ పారాణోలె ఎర్ర నేలలు
పలుగు రాళ్ళ తళ్కులోన చక్కని చెల్కల్లు
నిగనిగల మెరిసేటి నల్లరేగళ్ళు
బంగారు వన్నెలదీను దుబ్బలిసుకల్లు
చినుకు రాలంగనే తనువునింకించుకొని
తేమ చేనుకి పంచి సాకె వొనరున్న              // నా తెలంగాణ//

సజ్జ జొన్న మక్క తైదలార్కలు కొర్ర
కందులాముదాలు బెబ్బరుల్వలు మిరప
పల్లి పత్తి శనగ ఉల్లి పసుపు కుసుమ
ధనియాలు అల్లము నువ్వులావాలు
కార్తెలను కాలాన్ని చిందు చెమటను నమ్మి
మెట్ట పంటలదిట్టగెదిగెనా రైతన్న                 // నా తెలంగాణ//

సంద్రాలు పోలేటి చెరువులున్నా ధరణి
ఘన ఆనకట్టల మత్తడిల మాగాణి
వజ్రాలు దోసిళ్ళ వెలికి తీసిన గని
బొగ్గు నిక్షేపాల రాణి సింగరేణి
సహజ వనరులనెన్నొ మేనంత నింపుకొని
షహరు హైదరాబాదు తన గుండెగానున్న         //నా తెలంగాణ//

జ్గ్నాన పథమున నడుపు జానపదుల పాట
కవి కృషీవలుల తరగనీ పంట
చేతివృత్తుల చేవ జాతికే వన్నెంట
శ్రామికుల శ్రమచేరె దేశదేశాలంత
రుచులు భాషలు కళల సంస్కృతుల కలబోత
ప్యారు మొహబ్బతుల భర్పూర్ ఖజాన            //నా తెలంగాణ//

అడవితల్లి ముద్దు బిడ్డ ఆదిలబాదు
రైతు ఉద్యమ పురిటి గడ్డ నల్లగొండ
గంగ గల గల పారు కరీంనగరిందూరు
శ్రమకు మారు పేరు మెదకు పాలమూరు
సిరుల ముంగిళ్ళుగా ఖమ్మమోరుగల్లు
రంగరెడ్డి జిల్ల వడ్డాణమై వున్న                    // నా తెలంగాణ//

                                                             ……. పల్లా నరేంద్ర 
                                        email:  pallanarendra@rediffmail.com

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: