కపట సమైక్యతావాదం కుత్తుకపై తెలంగాణా ఖడ్గం కరీంనగర్ ప్రజల తీర్పు జనవరి 1, 2007
Posted by Telangana Utsav in Essays.trackback
– కె. సీతారామారావు (కాకతీయ విశ్వవిద్యాలయం)
కరీంనగర్ ప్రజల తీర్పు చారిత్రాత్మకం, పరిణితి చెందిన వ్యూహాత్మక రాజకీయ చతురతకు నిదర్శనం, మహోన్నత ప్రజాస్వామిక చైతన్యానికి ప్రతీక, మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల చిరకాల సజీవ ఆకాంక్షను కరీంనగర్ ప్రజల గొంతుతో ఎలుగెత్తి చాటిన తరుణం, తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవాన్ని హిమాలయ శిఖరోన్నతంగా నిలిపిన ఆనంద సమయం, దుష్ప్రచారాలను, విపరీత ప్రలోభాలను, రకరకాల అధికార దుర్వినియోగ ఆటంకాలను నిశ్చలమైన మనోస్ధైర్యంతో ఎదుర్కొని కపట సమైక్యతా భావాన్ని, బూటకపు అభివృద్ధి నినాదాన్ని కాలదన్ని స్వరాష్ట్ర వాంఛను, స్వపరిపాలన ఇచ్చను భారతావనికంతా వెదజల్లిన పరిమళం, పార్టీలు, జెండాలు పక్కనబెట్టి తెలంగాణా ప్రజలు ముక్త కంఠంతో తమ ఆకాంక్షను, ఆశయాన్ని నినదించిన తీరు అద్భుతం, అమోఘం, అద్వితీయం, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ శిలాశాసనం, రాజకీయాల్లో చెప్పేదొకటి చేసేదొకటైతే ప్రజలు నిర్విదంగా తిరస్కరిస్తారని రాజకీయ పార్టీలన్నింటికి నేర్పిన గుణపాఠం, తెలంగాణా ప్రజలు కొత్త దిశకు ఆహ్వానం పలుకుతున్న వైనం, “ఆంధ్రదేశం విచ్ఛిన్నమస్తు తెలంగాణా రాష్ట్రం ప్రాప్తిరస్తు” అంటూ ఇచ్చిన ప్రజాదీవెన. ఎవరికిష్టమున్నా లేకున్నా, ఎవరు వ్యతిరేకించినా సమర్ధించినా ఇకపైన “తెలంగాణా వాదమే” రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల వైఖరికి నిర్ణాయకాంశం కాబోతున్నదనేది అక్షర సత్యం. ఇదీ కరీంనగర్ ప్రజల తీర్పు విశిష్ఠత.
కపట సమైక్యతావాదం OK
మరి 2004 ఎన్నికల ఫలితాలను అనుకూలంగా పక్కన పెడదామా?
పొటీ చేసింది :52 గెలిచింది: 26 (మొత్తం తెలంగాణా:100+)
అంటే 25% మాత్రమే ప్రజల సమర్దించారు అనవచ్చా? లేక 75% వదన్నార?
నిన్నటి మునిసిపల్స్ సంగతి మరి? వాదించే టప్పుడు ప్రజలకు అన్నిచెప్పాలిగా తమరు?
—
తెలంగాణ ఇంకొక రాజకీయ నేతకు ముఖ్య మంత్రి పదవి ముక్తి
బీద ప్రజలకు లేదు విముక్తి
తెలుగుదనం ఒక్కటే మనందరికి ముక్తి
జై తెలుగునాడు/తెలుగు ప్రదేశ్