jump to navigation

తెలంగాణ భాష, సంస్కృతికి ప్రమాదం సెప్టెంబర్ 18, 2006

Posted by Telangana Utsav in Essays, In News, Telangana, Telugu (తెలుగు).
trackback

సుందరయ్యకళానిలయం: తెలంగాణ భాష, సంస్కృతి, ఉనికికి ప్రమాదం ముంచుకొస్తుందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణవాదులపై ఉందని సీనియర్ జర్నలిస్టు అల్లం నారాయణ అన్నారు. ఆదివారం సుందరయ్యకళానిలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ‘తెలంగాణ ఉత్సవ కమిటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందినవారికి బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సభకు రేవతి అధ్యక్షత వహించగా, అల్లం నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ భాష, సంస్కృతులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కాపాడుకోకపోతె భవిష్యత్తులో వాటి ఉనికికి దెబ్బ అని అన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ నేడు నిర్వహించుకుంటున్న విమోచన దినోత్సవం నిజమైంది కాదని, ఇంకా తెలంగాణకు విముక్తి లభించలేదన్నారు. నిజమైన విమోచన దినం కోసం ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకురాలు దేవకీదేవి, తెలంగాణ ఉత్సవ కమిటీ కన్వీనర్ భరత్‌భూషణ్ మాట్లాడారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

Eenadu, News Today : Monday, September 18 – 2006

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: