jump to navigation

కరపత్రం – తెలంగాణ విమోచన దినం సందర్భంగా, వ్యాసరచన పోటీలు ఆగస్ట్ 29, 2006

Posted by Telangana Utsav in Appeals, Telangana, Telugu (తెలుగు).
trackback

తెలంగాణ విమోచన దినం సందర్భంగా వ్యాసరచన పోటీలు

ఒక ప్రాంతానికి తనదైన ప్రత్యేక సంస్కృతి, అస్థిత్వం ఉంటాయి. అలాగే తెలంగాణాకూ ఉన్నాయి.

దేశానికి ఆగష్టు 15, 1947 న స్వాతంత్ర్యం వచ్చింది. హైదరాబాదు, విమోచన మాత్రం సెప్టెంబర్ 17, 1948 న జరిగింది. ఎనిమిది సంవత్సరాలు తెలంగాణా స్వతంత్రంగా మనుగడ సాగించంది. ఆ తర్వాత ఆంధ్రప్రాంతం మద్రాసు నుంచి విడిపోయి వద్దువద్దన్నా తెలంగాణాను పెద్దమనుషుల ఒప్పందం పేరుతో కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కానీ ఆంధ్ర ప్రాంత అభివృద్ధి, వలస పెత్తనం క్రింద తెలంగాణ చరిత్ర వారసత్వం, సంస్కృతి, అస్థిత్వం తల్లడిల్లుతూనే ఉన్నది. ఇంకా తెలంగాణాకు నిజమైన విముక్తి రావల్సి వున్నది. ఈ సంధ్యా సందిగ్ద సందర్భాల్లో మన వారసత్వం, మన చరిత్ర ,  మన సంస్కృతి, ఔన్నత్యం, కట్టుబొట్టూ, యాస, భాష మన భావితెలంగాణ పౌరులు తెలుసుకోవలసిన అవసరం ఉంది.

          మీ అభిప్రాయాలను, మీ భావాలను అందరితో పంచుకోవడానికి ఇది వేదిక. గొంతు విప్పండి. మీ కలాలకు భావాలను ఊపిరిగా అందించండి. వ్యాసాల రూపంలో మాకు పంపించండి. 

వ్యాసరచన పోటీల విషయాలు – వివరాలు

Essay Writing Competition 2006 Prize details Table 

వ్యాసరచన పోటీదారులకు సూచనలు

వయో పరిమితి:  

జూనియర్స్ -12-15 సం||

సీనియర్స్ – 16-20 సం||

వ్యాసం నిడివి : 

జూనియర్స్, సీనియర్స్ – 3000 పదాలకు మించకుండా

యూనివర్సిటీ – 8000 పదాలకు మించకుండా

వ్యాసాలతో పాటు మీ పూర్తిపేరు, వయసు, చిరునామా, కేటగిరీలను స్పష్టంగా రాయడం మరవద్దు. వ్యాసాలను పంపించవలసిన చిరునామా…

M.Anita, Coordinator, TUC, c/o Telangana Information Trust,

Green Channel, Khairatabad, Hyderabad-4

Email : telanganautsav.coordinator@gmail.com

 మూడున్నర కోట్లకు పైగా ఉన్న తెలంగాణా నుండి కనీసం ఒక్క శాతం జనం ముందుకొచ్చి చేయూతనిచ్చినా ఎన్ని అద్భుతాలు సృష్టించ వచ్చో ఒక్కసారి ఆలోచించండి.

మీరు రాయలేకపోయినా, రాయగలిగినవాల్లను ప్రోత్సహించి పాల్గొనేట్టు చేయండి.

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: