లెక్కలు తేల్చాలి, అపోహలు పోవాలి – చలసాని శ్రీనివాస్ డిసెంబర్ 22, 2012
Posted by bharath in Andhra, Congress, Hyderabad, Polavaram, Rayalaseema, regionalism, suicide, Telangana, Telugu (తెలుగు), YSR.add a comment
లెక్కలు తేల్చాలి, అపోహలు పోవాలి
- చలసాని శ్రీనివాస్
1972లో ఆంధ్ర ఉద్యమాన్ని అణిచివేస్తూ డిసెంబరు 21న ప్రధాని ఇందిర అధికారికంగా రాష్ట్రాన్ని విడగొట్టేది లేదని ఆంధ్రులు శాశ్వతమని నమ్మారు. అదే రోజు విడిపోయి వుంటే తీర సీమాంధ్రలు దేశంలోనే నెంబర్ 1గా ఉండేవి. పోయి మీ ప్రాంతాలలో స్వాభిమానంతో పాటు బతకండని, తెలంగాణ వస్తే లక్షల మంది ఉద్యోగాలు లాక్కుని తీరుతామని బెదిరిస్తుంటే అక్కడ స్థిరపడ్డ మిగతా ప్రాంతవాసులు ఎక్కడికి పోవాలి.. చావాలా అంటూ ఆవేదన చెందే వారి ఇబ్బందులను పట్టించుకోవాలి కదా?
ఆంధ్రులూ ఆలోచించాలని లవణం, రమణ, రాంప్రసాద్‌లు రాసిన వ్యాసాల తీరు వేరుగా ఉన్నా మూడూ ఆంధ్రుల ఆవేదనను వెలిబుచ్చాయి. తీర సీమాంధ్రులు అన్ని విధాలుగా త్యాగంచేసినా ఎంతకాలమీ గొడవని విసుగు చెందే లవణం గారు ప్రత్యేక రాష్ట్రం కోరి ఉండవచ్చు. కోస్తా అభివృద్ధిని అడగక ఫక్తు రాజకీయ స్వార్థం కోసం జై ఆంధ్ర వాదులని విమర్శించే కొందరు సమైక్య వాదులు ఉన్నారు. అదే విధంగా కొద్దిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లో లేదా కొందరు ప్రత్యేక తెలంగాణ నాయకుల కాల్మొక్కి వారి దయతోనో నీళ్ళెవడికీ అక్కర్లేదంటూ హైదరాబాద్ కె సిఆర్ గారి సొత్తనే జై ఆంధ్రవాదులూ ఉన్నారు.
వాస్తవానికి నీటి పారుదల, హైదరాబాద్‌లో స్థ్థిరపడ్డ వారి భవిష్యత్తు, తీర సీమాం ధ్ర యువత ఉపాధి-ఉద్యోగాల సమస్యలని విభజనకు ‘ముందే’ పరిష్కరించకుండా విభజనకి ఎవరు అంగీకరించినా అది కోస్తా , రాయలసీమ ప్రాంతాల వాసులకు ఖచ్చితంగా ఆత్మహత్యా సదృశమే అవుతుంది. నిజంగానే అలా హక్కులని తాకట్టు పెడితే ఇప్పుడు పెరిగిన రేట్లు నీటిపై రాసిన మాటలై గాలి బుడగలై నీరు, నిధులు, ఉద్యోగాలు ఏమీ దక్కవు; ఆ తరువాత కోస్తా, సీమ ప్రజలు బోరున విలపించినా లాభం ఉండదు. మోసపోవడం ఆంధ్రులకి కొత్త కాదు. (more…)
Chindu Bhagavatam comes of age ఆగస్ట్ 30, 2012
Posted by bharath in Art, Culture, Deccan, heritage, Identity, SC, Telangana, Telugu (తెలుగు).Tags: Chavadi Kottaalu, Chindu, Chindu Bhagavatam, Chindu Yellamma, Chinna Madiga, Dance Academy, Deshmukhs, Gadi, Goddess Yellamma, Jamba Mahamuni, Jamba Puranam, Madiga, Nataraja Ramakrishna, Pedda Madiga, Peddabalasiksha, Ravindra Bharati, State Culture Council, Telugu theatre, Yakshaganam
add a comment
Arts/ Theatre
Chindu Bhagavatam comes of age
Gudipoodi Srihari, The Hindu August 30, 2012
Recently, a Chindu Bhagavatam performance brought to the fore a hitherto little-known art form that is widely performed in Telangana. The art form has evolved over time from being restricted to a small sub-sect within a community to being performed all over the region and utilised by the State government.
History goes that within the ‘Madiga’ community, a sect considered itself ‘Pedda Madiga’ (Big madiga) and another sect that was living on begging, performing yakshaganas, as ‘Chinna Madigas’, (Small madiga). These Chindu Bhagavatas were not permitted to perform beyond their own community. A lot has changed since then. The late Chindu Yellamma, a respected icon from Nizamabad, was invited to perform with her troupe at Ravindra Bharati by the erstwhile Dance Academy headed by the late Nataraja Ramakrishna. The academy had also published a small booklet on this art and the Chindu Bhagavatas at that time.
The word ‘Chindu’ in Telugu means ‘jump’. As their presentation is interspersed with leaps and jumps, it gained the name of Chindu Bhagavatam. Most of the stories narrated are from ‘Bhagavatam’. Gaddam Sammayya, a leader of these troupes, claims that though the Chindu Bhagavatas were seen as a lowly section of society, they trace their origin to Jamba Mahamuni, and believe their clan is the most ancient sect. “Hence most of our dramas open with ‘Jamba Puranam’ with the opening pallavi that goes ‘Ekkuvani Mari Palukabokumura, Ekkuvevvaru Mari Telisi Palukumura’ (don’t speak of being high, speak knowing who is higher) ,” he says. (more…)
లక్ష్మి ఆసు యంత్రం Aasu weaving machine inventor Mallesham from Aleru జూన్ 8, 2012
Posted by bharath in Art, Culture, Economy, heritage, Identity, livelihoods, Nalgonda, Telangana, Telugu, Telugu (తెలుగు).Tags: Aasu, Aleru, artisan, handloom, invention, rural science and technology, rural technology, weaving
add a comment
…అమ్మకో నూలుపోగు
అతనొక శాస్త్రవేత్త కాదు. ఇంజనీరు అంతకన్నా కాదు. వచ్చీ రాని చదువు చదివిన ఓ పల్లెటూరి బిడ్డ మాత్రమే. కానీ, తల్లి కష్టాన్ని చూసి చలించి, ఆ పనిని సులువు చేసే యంత్రాన్ని కనిపెట్టిండు. తాను రూపొందించిన యంత్రం విజయవంతం కావడంతో దానికి తల్లి పేరే పెట్టుకుని రుణం తీర్చుకున్నడు ఆ గ్రామీణ శాస్త్రవేత్త, తెలంగాణ ముద్దుబిడ్డ మల్లేష్, అతడికి స్ఫూర్తినిచ్చిన తల్లి లక్ష్మిపై ‘బతుకమ్మ’ ప్రత్యేక కథనం.
~ రచ్చ శ్రీనివాస్, టీన్యూస్, ఆలేరు టౌన్
నల్లగొండ జిల్లా ఆలేరు మండలం శారాజిపేట గ్రామానికి చెందిన చింతకింది మల్లేష్ రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిండు. ఏడేళ్ల నిరంతర శ్రమ ఫలితంగా ‘ఆసు పోసే యంత్రానికి’ రూపకల్పన చేసిండు. మొదట్లో పడరాని పాట్లు పడ్డడు. వినరాని మాటలు విన్నడు. కానీ, ఇవ్వాళ ఆ యంత్రం పనితీరు విజయవంతం కావడంతో అందరితో ‘శెభాష్’ అనిపించుకుంటున్నడు. తాను ఆవిష్కరించిన ఆ యంత్రానికి పేటెంట్ హక్కును కూడా సంపాదించుకున్నడు. అన్నిటికీ మించి, అమ్మ పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయి దాన్ని సులువు చేసే యంత్రాన్ని కనిపెట్టిన ఈ బిడ్డ ఆ యంత్రానికి ‘లక్ష్మి అసు యంత్రం’ అని తన తల్లి పేరే పెట్టుకున్నడు. అట్ల తల్లి రుణం తీర్చుకున్న ఈ బిడ్డ రాష్ట్రంలోనే కాదు, దేశంలోని నేతకారులందరికీ ముద్దుబిడ్డ అయ్యిండు. అయితే, ఆయన తన ఆవిష్కరణకు మూలం ‘కులవృత్తే’ అన్నడు. తామందరూ వదిలి పెట్టకుండా కొనసాగుతున్న కుల వృత్తే నన్ను ‘శాస్త్రవేత్త’ను చేసిందని అన్నడు. అష్టకష్టాలు పడైనా సరే, తమ వృత్తిని కొనసాగించుకోవాలన్న స్పృహే తనను ఇవ్వాళ నలుగురిలో గుర్తింపుకు కారణమైందని ఆయన సవినయంగా మనవి చేసిండు. అదీ ఈ నల్లగొండ బిడ్డ వినవూమత. ఇంతకీ మల్లేష్ కనిపెట్టిన ఆ యంత్రం ఏమిటి? అసలు ‘అసు’ పోయడం అంటే ఏంది? మొత్తంగా, ఎట్లా ఆయన ఆ సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించిండో చూద్దాం….

కులవృత్తిని వదల లేక…
రాష్ట్రంలో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 40 వేల కుటుంబాల దాకా చేనేత వృత్తిపై ఆధారపడి బతుకుతున్నయి. ఎంత కష్టపడినా వాళ్ల పేదరికం పోతలేదు. ఎన్ని రకాల బట్టలు నేసినా వారి కష్టాలు తీరడం లేదు. చింతకింది మల్లేష్ కుటుంబం కూడా అటువంటిదే. తనది ఆలేరు మండలం శారాజిపేట అనే చిన్న గ్రామం. 7వ తరగతి దాకా చదువుకున్నడు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో మల్లేష్ తండ్రి తన ఇద్దరు కొడుకుల్ని చదువు మాన్పించి మగ్గం నేయమన్నడు. మగ్గం నేయడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. మొదట చీర నేయాలంటే ముందు ‘ఆసు’ పోయాలి. ‘ఆసు పోయడం’ అంటే పట్టుదారాన్ని కొయ్యకు చుట్డడం. ఒక కొయ్య నుంచి 40 కొయ్యలకు 9 వేల సార్లు అలా చెయ్యి తిప్పాలి. (more…)
March 2012 by-elections in Andhra Pradesh – Vote for Telangana again! మార్చి 21, 2012
Posted by bharath in Adilabad, agitation, BCs, BJP, Congress, CPI, CPI-M, Economy, elections, Identity, JAC, KCR, Mahabubnagar, Mulki, Muslim, NRIs, politics, regionalism, SC, ST, TDF, TDP, Telangana, Telugu (తెలుగు), TRS, Y S Jagan, youth, YSR.Tags: byelections, Ibrahim, Kamareddy, Kollapur, Kovur, Nagam, Nagarkurnool, Station Ghanpur
add a comment
మార్చి 2012 ఎన్నికల్లో మల్లొకసారి జై తెలంగాణ!
బై ఎలెక్షన్ల ఫలితాలు అనుకొన్నట్టే ఒచ్చినయ్. రాజీనామా చేశినొల్లకు, తెలంగాణ అన్నోల్లకు, తెలంగాణ జెండెత్తుకొన్నోల్లకు మల్లొకసారి వోటు!
Assembly Party
Adilabad TRS
Kamareddy TRS
Kollapur TRS
Mahabubnagar BJP
Nagarkurnool Independent
Station Ghanapur TRS
Kovur YSRC
అదిలాబాదు, కామారెడ్డి, కొల్లాపూర్, స్టేషన్ ఘనపూర్, నాగర్ కర్నూల్ అటు కోవూరుల పాతోల్లకే వోటు. పార్టీలు కొత్తవి
కొల్లాపూరు, స్టేషన్ ఘనపూర్, కామారెడ్డి, అదిలాబాదులతో పాటు నాగర్ కర్నూలుల నాగం విజయం జై తెలంగాణకు వోటు
2009ల కాంగ్రేసుకున్న కొల్లాపూరు, స్టేషన్ ఘనపూర్, తెలుగు దేశంకున్న కామారెడ్డి, అదిలాబాదులు ఇపుడు టీ.ఆర్.ఎస్ కు బదిలీ
ఒక్కదగ్గర కొత్తగా బీజేపీ ప్రవేశం. టీ.ఆర్.ఎస్ ను ఓడించి మహబూబునగర్ బీజేపి గెలిశింది. ఎవ్వరితో పొత్తు లేకుండ ఒంటరిగా పోరుయాత్ర చేశి విజయం సాధించింది.
పట్నం తగవులో పరుల స్వార్థం : శ్రీనివాసులు, చెన్న బసవయ్య అక్టోబర్ 14, 2011
Posted by bharath in 1969, Andhrapreneurship, corruption, Deccan, Economy, heritage, Hyderabad, landuse, Mulki, Nizam, politics, Settler, TDP, Telangana, Telugu (తెలుగు), TRS, universities, YSR.Tags: 2G spectrum, Allwyn, capital city, CBN, geography of identity, industrialisation, land administration in Hyderabad, land mafia, NTR, privatisation, real estate, Republican Forge, Sarf - e - Khas, SLPEs, state owned enterprises, union territory
add a comment
పట్నం తగవులో పరుల స్వార్థం
కె.శ్రీనివాసులు, ఎం.చెన్న బసవయ్య, రాజనీతి శాస్త్ర ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం
ప్రస్తుత తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన చర్చలలో హైదరాబాద్ స్థాయి కీలక వివాదాంశంగా మారింది. హైదరాబాద్ నగరం చారిత్రకంగా, భౌగోళికంగా రాజకీయంగా, సంస్కృతీపరంగా తెలంగాణకు గుండెకాయ లాంటిది అని తెలంగాణ వాదులు వాదించడం సహజంగానే అర్థం చేసుకోదగ్గది . కానీ హైదరాబాద్‌పై సీమాంధ్రుల వాదనను ఏ కోణం, దృక్పథం నుంచి అర్థం చేసుకోవాలి ? హైదరాబాద్ ఈ స్థాయికి ఎదగడానికి కేవలం తమ పెట్టుబడులే కారణమని సీమాంధ్రులు వాదించడం సరైనదా? కాదా? ఈ వాదన వెనుక నిగూఢ ఎజెండాలేమైనా ఉన్నాయా? ఈ వివాదం పైకి కనపించినంత సులభమైనది కాదు.
మన దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ చరిత్రాత్మక ప్రత్యేకతను కలిగివున్నది. ఈ ప్రత్యేకతకు గల కారణం నిజాం రాజ్యంలో ఉండిన భూపాలన వ్యవస్థ. దీని కారణంగానే నేడు రాష్ట్ర విభజన చర్చలలో హైదరాబాద్ అత్యంత కీలక సమస్యగా మారింది. వీటిని అర్థం చేసుకోవాలంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ తరువాత పారిశామిక, వ్యాపారాభివృద్ధి క్రమంలో భాగంగా మారిపోయిన హైదరాబాద్ భూ దృశ్యపు తీరు తెన్నులను, హైదరాబాద్ పట్టణ పెరుగుదలకు గల రాజకీయార్థిక నేపథ్యాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది.
నిజాం కాలంలో భూపాలనా వ్యవస్థ మూడు రకాలుగా ఉండేది. ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియా, ప్రావిన్సియల్ సిరీస్, హైదరాబాద్ స్టేట్ (1909) ప్రకారం అవి ఇలా ఉండేవి: (అ) సర్ఫ్-ఏ-ఖాస్ భూములు (రాజమాన్యాలు); (ఆ) జాగీరులు, సంస్థానాలు; (ఇ) ఖాల్స లేదా దివానీ. నిజాం రాజ్యంలోని మొత్తం భూమిలో సర్ఫ్-ఏ-ఖాస్ భూములు పది శాతం ఉండగా, జాగీరులు, సంస్థానాల క్రింద 30 శాతం భూములు ఖాల్స లేదా దివానీల రకం భూములు 60 శాతం ఉండేవి. సర్ఫ్-ఏ-ఖాస్ భూములు అన్నీ (సుమారు 1,30,000 ఎకరాల పైచిలుకు) కూడా అత్రాఫ్-ఇ-బల్దా అంటే హైదరాబాద్ మునిసిపాలిటీ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండేవి. (more…)
deja vu Telangana అవే మాటలు, అవే చేతలు, అవే ప్రతిజ్ఞలు… – కె. శ్రీనివాస్ జూలై 3, 2011
Posted by bharath in 1969, agitation, Congress, corruption, drama, JAC, KCR, regionalism, Sonia, suicide, TDP, Telugu (తెలుగు), TRS.Tags: Janareddy, Keshav Rao, Nagam Janardhan Reddy, resignations, Srikantha Chary, Telangana movement, TTDF
1 comment so far
సందర్భం
అవే మాటలు, అవే చేతలు, అవే ప్రతిజ్ఞలు…
- కె. శ్రీనివాస్
…………………………………………….
తెలంగాణ నేతల దగ్గర కానీ, సీమాంధ్ర ప్రతినిధుల వద్ద కానీ కొత్త ఆయుధాలేమీ లేవు. కొత్త ఆలోచనలు కూడా లేనట్టున్నాయి. రాజీనామాలు చేయండి, రాజకీయ కల్లోలం సృష్టించండి, కానీ, మళ్లీ పోటీచేయడం ఎందుకు? దానివల్ల ఉపయోగమేమిటి? ఇప్పుడున్న అంకగణితమే అప్పుడూ ఉంటుంది కదా? – అని ప్రశ్నించేవారి గొంతు పీలగా మాత్రమే వినిపిస్తుంది. భావదారిద్య్రం వల్ల జరిగే పునరుక్తికి కూడా చారిత్రక పునరావృత్తానికి ఇచ్చే గౌరవం ఇవ్వగలమా?
…………………………………………….
డెజా వూ అన్న ఫ్రెంచి మాటకు అర్థం – ఇంతకు ముందే చూసినది – అని. ఒక దృశ్యం కానీ, సన్నివేశం కానీ, పరిస్థితుల సంపుటి కానీ ఎదురయినప్పుడు – అది ఇంతకు మునుపే అనుభవంలోకి వచ్చినట్టు అనిపించడమే డెజా వూ. మనోవైజ్ఞానిక శాస్త్ర పరిభాషగా వాడుకలోకి వచ్చిన ఈ మాట, ఇప్పుడు ఇతర శాస్త్ర, కళారంగాల రచనల్లోనూ, సాధారణ వ్యక్తీకరణల్లో కూడా భాగమైంది. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన జరిగిన 80ల చివర్లో వరవరరావు డెజావూ శీర్షికతో ఒక గొప్ప దీర్ఘ కవిత రాశారు.
చరిత్ర పునరావృత్తం అవుతుందంటారు. నిజమే, కానీ యథాతథంగా కాదంటారు మార్క్స్. మొదటిసారి విషాదంగా జరిగినది రెండోసారి ఆభాసగా జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి మనిషికి సొంత జ్ఞాపకశక్తి ఉంటుంది, అంతేకాదు, సామూహిక జ్ఞాపకాలను చరిత్రగా, పురాణాలుగా భద్రపరచుకోవడం మనిషికి తెలుసు. విజయమో అపజయమో, సంబరమో సంక్షోభమో తారసపడినప్పుడు, గతంలోని అటువంటి సందర్భాలు గుర్తుకురావడం సహజం. అటువంటి అనేక పునరావృత్తాల నుంచి మనిషి అనుభవమూ జ్ఞానమూ పదునెక్కుతూ వచ్చింది.
తరచు ఎదురుపడే ఒకేరకమైన సందర్భాలను చూసి విసిగిపోయో, అర్థం చేసుకునే శక్తిలేకో మనిషి వేదాంతంలో పడిపోయి, జీవితం రంగులరాట్నం అనీ, చరిత్ర అంటే చర్విత చర్వణం అనీ, నిరంతరం ఒకే సంఘటనల క్రమం వలయాకారంలో జరుగుతుంటుందని నిర్ధారణకు వచ్చాడు. కానీ, అది నైరాశ్యంతోనో చమత్కారంగానో చెప్పుకునేదే తప్ప హేతువుకు నిలిచేది కాదని భౌతికవాదులు ఖండిస్తూనే వస్తున్నారు. ‘చరిత్ర పునరావృత్తమయ్యేదే నిజమైతే, మనిషి ఊహించని సంఘటనలు ఇన్ని ఎట్లా జరుగుతాయి? జరిగేది ప్రతీదీ మునుపెప్పుడో జరిగినదే అయితే, మనిషి తరచు ఎదురుదెబ్బలు ఎందుకు తింటున్నాడు? అనుభవం నుంచి నేర్చుకోవడంలో మనిషి ఉట్టి శుంఠ అన్న మాట’ – అంటాడు జార్జి బెర్నార్డ్ షా.
గతంలో జరిగిన సంఘటనలు ఏదో ఒక రూపంలో స్ఫురించే అవకాశమే లేకపోతే చరిత్రకు అర్థం లేదు. పోల్చుకునే సామర్థ్యమే లేకపోతే అనుభవానికి అర్థమే లేదు, చరిత్ర నుంచి అనుభవం నుంచి నేర్చుకోకపోతే మనిషికి జ్ఞానమే లేదు. అయినప్పటికీ, మనుషుల్లో కొందరు పోల్చుకోరు, నేర్చుకోరు, జ్ఞానాన్ని ఖాతరే చేయరు. తమబోంట్లకు చరిత్రలో ఏ గతిపట్టిందో తెలిసినా, తామొక్కరే భిన్నమనుకుంటారు. కాలం మునుముందుకే సాగుతుందని ఎన్ని సాక్ష్యాలున్నా, తిరోగమనం సాధ్యమేనని నమ్ముతారు.
న్యాయపక్షంలో నిలబడి ఓడిన వీరుడు మరణిస్తూ పునరుత్థానాన్ని వాగ్దానం చేస్తాడు. జనం చేతిలో చావు దెబ్బతిన్న వ్యవస్థ, ఆదమరిస్తే తాను మళ్లీ తలెత్తుతానని హెచ్చరిస్తుంది. అవశేషమైన చెడు మళ్లీ మళ్లీ పుడుతుంది. మిగిలిపోయిన మంచి కూడా మరోసారి ప్రయత్నిస్తూనే ఉంటుంది. పునరావృత్తం ఎందుకైనా సరే అది ఒక అసమగ్రతకు చిహ్నం, పట్టువదలని విక్రమార్కానికి సంకేతం. ప్రపంచగమనం నిండా అడుగడుగునా డెజా వూ లే.
తెలంగాణ ఉద్యమంలో మళ్లీ చెలరేగిన రాజీనామాల కలకలం మాత్రం ఆభాసా కాదు, అనివార్య పునరావృత్తమూ కాదు. కేవలం ఒక చర్విత చర్వణం. ఇప్పటికి ఎన్నిసార్లు రాజీనామాలు, ఎన్నిసార్లు ఉప ఎన్నికలు! ఇదే సన్నివేశం ఇంతకు ముందు పదే పదే జరిగినట్టు తెలిసిపోతూనే ఉన్నది. జానారెడ్డి ఇంటికి కెసిఆర్ – ఎప్పుడో విన్నట్టు లేదూ? డిసెంబర్ 9 వాగ్దానాన్ని నెరవేర్చనందుకే రాజీనామాలు చేస్తున్నట్టు లేఖ – ఇదీ జరిగినట్టే లేదూ? ఒక నిమిషంలో తేలేది కాదు తెలంగాణ – ఇదీ చిరపరిచితమే కదూ? రాజీనామాల వల్ల ఒరిగేదేమీ లేదు, ఎవరో చెబితే మేం చేస్తామా, మా నేత వేరు – ఈ మాటలూ అలవాటయినవే కదా? తెలంగాణ కోసం ప్రాణత్యాగమైనా చేస్తాం- తుప్పు పట్టిపోయినమాట. (more…)
Telangana is topic of research in universities of the region ఏప్రిల్ 23, 2011
Posted by bharath in 1969, agitation, Andhrapreneurship, conflict resolution, Culture, Deccan, Economy, GHMC, Godavari, heritage, Hyderabad, Identity, Kakatiya, movement, Mulki, Osmania, politics, regionalism, Settler, suicide, Telangana, Telugu, Telugu (తెలుగు), universities, Urdu, violence.Tags: colonialism, economics, Gramsci, linguistic nationalism, literature, political science
add a comment
Scholars in a scramble to do research on T
Nikhila Henry, TNN, April 23, 2011
HYDERABAD: The “T” agitation that has played havoc with academic schedules of state universities has had an inadvertent `academic’ side effect. Varsities are now reporting a spurt in research on Telangana this admission season in politically charged university campuses.
Making a beeline to study all things about `T’ are young researchers wanting to take up topics related to the agitation for political and social analysis. Officials of both state and central universities say they are flooded with PhD proposals on cultural and political topics that are specific to the region.
If until a couple of years ago, research on Telangana was largely done in the domain of history, political science and sociology, students from literature and even media classrooms are applying for PhDs on the `T’ region. Subjects they are choosing range from public policy and conflict resolution in the region, economics of regional politics to cultural representations of the region in Telugu literature and linguistic nationalism. (more…)
హైదరాబాదు రంగులు – C B Rao ఏప్రిల్ 10, 2011
Posted by bharath in Art, Culture, Deccan, heritage, Hyderabad, Identity, Photos, Poetry & Songs, politics, Telangana, Telugu, Telugu (తెలుగు).Tags: Aelay Laxman, CB Rao, Deepika Reddy, Indian Art, Jagadish Mittal, Jagdish Mittal, Kamla MIttal, Museum, Ravi Photo Gallery, Ravinder Reddy
add a comment
ఛాయాగ్రాహకుడు డి. రవీందర్ రెడ్డి ఫొటో గాలరీ ఆవిష్కరణ
C B Rao
1964 లో, పెద్దపల్లి (కరీంనగర్) లో జన్మించిన రవీంద్రరెడ్డి, ఆంధ్రప్రదేష్ గర్వించతగ్గ ఛాయాచిత్రకారులలో ఒకరు.
డిశంబర్ 6, 1992 లో అతి ప్రమాదకర పరిస్థితులలో బాబ్రి మసీదు విధ్వంసం ఛాయాచిత్రాలను తీసి, ప్రాణాలుగ్గపెట్టి, కరసేవకుల నుంచి తప్పించుకొని అయోధ్య రైల్వేస్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి ఫరిదాబాద్, లక్నో ల మీదుగా ఢిల్హి వెళ్లి ఇండియా టుడే, టైం పత్రికలకు సకాలంలో చిత్రాలను అందించే సాహసం చేసినవాడు రవీందర్. లాతూర్ (మహారాష్ట్ర) లో భూకంపం వచ్చినప్పుడు, మృత శిశువు చెయ్యి శిధిలాల్లోంచి పైకి వచ్చి కనిపించే దృశ్యం చూస్తే గుండె ఝల్లుమనకమానదు. రవీందర్ చిత్రాలలోని మానవీయత చూపరులను ఆకట్టుకుంటుంది. రవీందర్ జీవితం లో ఇలాంటి ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. వాటికి అందుకున్న పురస్కారాలు ఎన్నో. రవీందర్ జీవిత విశేషాలు, తన ఛాయాచిత్ర పుస్తకాలు వగైరా విశేషాలతో కూడిన ఈ చిన్న లఘు చిత్రం చూడండి. ఈ చిత్రం చూశాక రవీందర్ ఇంత మంచి పేరు ఎలా సంపాదించాడో మీకే అర్థమవగలదు.
సినిమా కవిగా కే సీ ఆర్ జనవరి 1, 2011
Posted by bharath in agitation, Andhra, cinema, Congress, CPI-M, elections, Hyderabad, Identity, KCR, livelihoods, Mulki, Poetry & Songs, politics, Rayalaseema, regionalism, Settler, TDP, Telangana, Telugu (తెలుగు), TRS, youth.Tags: Jai Bolo Telangana, lyrics, Sankar
add a comment
TV9, 31 December 2010
చమత్కారాలు పదునైన విమర్శలతో ప్రసంగించే కే సీ ఆర్ కవిగా మారారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న జై బోలో తెలంగాణ సినిమా కోసం పాట రాశారు. సమైక్యాంధ్రలో తెలంగాణాకు అన్యాయం జరిగిందని ఎలుగెత్తారు. అరవై ఏళ్ళుగా తెలంగాణా మోసపోతుందని గుర్తు చేసిన పాట మీ కోసం
http://www.freelinks.ulmb.com/index.php?url=t4hnYOFvsWY&source=youtube
Click Here
మూలం: TV9, 31 డిసెంబర్ 2010
ఇగ ఆంద్ర హీరోలతో తెలంగాణ సినిమాలు ఒస్తున్నయి – Jai Bolo Sahajeevana Telangana నవంబర్ 10, 2010
Posted by Telangana Utsav in Andhra, Andhrapreneurship, cinema, Culture, drama, KCR, Media, Mulki, Osmania, Settler, students, Telangana, Telugu, Telugu (తెలుగు), TRS.Tags: box office, fans, Jagapathi babu, Kavita, Nagarjuna, Srikrishna
add a comment
T-time for Nag?
TNN, Nov 11, 2010,
The Tollywood superstar is expected to do a film based on the Telangana upheaval
After breathing life into historical roles like ” Annamayya” and ” Sri Ramadasu”, superstar Nagarjuna is reportedly invoking a legend from Telangana region, this time around. The period drama set in 1946 to 1956 depicts the armed struggle against unification of Nizam region with Andhra state. The tale of a valiant revolutionary is being helmed by writer-turned-director Vijayendraprasad. It is learnt that KCR, president of Telangana Rasthra Samiti, has approved of the script.










