1908-2008 వరద మూసీకి వందేళ్ళు ! సెప్టెంబరు 28, 2008
Posted by mbbhushan in Essays.Tags: Add new tag, floods, Hyderabad, Musi
1 comment so far
ఎం. వేదకుమార్
సరిగ్గా వందేళ్ళ క్రితం…
1908 సెప్టెంబర్ 28
హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదలు ముంచెత్తాయి. ఆ వరద బీభత్సాన్ని తట్టుకునే శక్తి ఆ మహానగరానికి లేకపోయింది. ఫలితంగా కేవలం 48 గంటల్లో 15 వేల మంది మృతి చెందారు. 80 వేల ఇళ్లు కూలిపోయాయి. ఒకే ఒక్క రోజులో 17 అంగుళాల వర్షపాతం నమోదైంది. అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో 11 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించింది. నగరంలో మూడోవంతు నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఉత్పాతాలను తట్టుకునే, నివారించే ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు ఏమీ లేని ఆ రోజుల్లో అలా జరగడం సహజమే కావొచ్చు. కాని వందేళ్ల తరువాత 2008లో నేటి పరిస్థితి ఏమిటి? నేటికీ అదే దుస్థితి. మరింత దీనావస్థ. నమ్మశక్యం కాకున్నా నమ్మితీరాల్సిన చేదు నిజం. నేడు మూసీకి వరదలు వస్తే, కళ్ళప్పగించి చూడడం తప్ప చేయగలిగిందేమీ లేదంటే గుండె మండిపోతుంది. ఆనాటి వరద బీభత్సం ప్రకృతి ప్రకోపం అని సరిపెట్టుకున్నా రాబోయే బీభత్సాలు మాత్రం అక్షరాలా మానవ తప్పిదాల కారణంగానే. (ఇంకా…)
అప్పుడూ ఇప్పుడూ… నేను ‘పద్యాల’ భూమయ్యనే! సెప్టెంబరు 7, 2008
Posted by mbbhushan in Culture, Poetry & Songs, Telangana People, Telugu (తెలుగు).add a comment
అనుమాండ్ల భూమయ్య, తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్
అనుమాండ్ల భూమయ్యగా కన్నా ‘పద్యాల’ భూమయ్యగానే ఆయన చాలామందికి తెలుసు. కాలేజీ క్లాసురూములో ఆయన పద్యాలు రాగయుక్తంగా పాడుతుంటే విద్యార్థులు మైమరచి వింటారని పేరు. పద్యకావ్యంలో భూమయ్య చేసిన కృషి విశిష్టమైనది. సాధారణ జూనియర్ లెక్చరర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ … కాకతీయ యూనివర్శిటీలో తెలుగు డిపార్ట్‌మెంట్ హెడ్‌గా… అనేక సెమినార్లను నిర్వహించడమేగాక పలు పుస్తకాలు రాసిన భూమయ్య ఇటీవలే పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులయ్యారు. “నా తొమ్మిదవ తరగతిలోనే పద్యాలను రాగయుక్తంగా పాడటం అనే విద్య మా మాస్టారి ద్వారా అబ్బింది. అప్పట్నించే ‘పద్యాల’ భూమయ్య అని పిలిచేవారు. పెద్దయ్యాక నేను పద్యాలు రాస్తూ అదేపేరును కొనసాగించడం నా అదృష్టం”






