jump to navigation

Woes of Singareni coal miners ఫిబ్రవరి 28, 2008

Posted by Telangana Utsav in Essays, Karimnagar, Telangana, Telugu (తెలుగు), livelihoods.
add a comment

నేను…రాజపోషవ్వను మాట్టాడుతున్నా….!

2008, ఫిబ్రవరి 15న రామగుండం ఓపెన్‌ కాస్టు-3 బొగ్గు గని విస్తరణలో భాగంగా మంగళపల్లి – పెద్దంపేట గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. ఆ సభలో ప్రభుత్వ పర్యావరణ శాస్త్రవేత్తలతోపాటు కరీంనగర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, సంబంధిత సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, యూనియన్‌ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అక్కడికి మురికి బట్టలతో… నెరిసిపోయిన జుట్టుతో.. పీక్కుపోయిన మొహంతో ఓ అవ్వ అక్కడికి వచ్చింది. ఆమె పేరు రాజపోషవ్వ. అరవై ఏళ్ల దళిత మహిళ. ఆమె మాట్లాడిన మాటలు బొగ్గు గనుల కింద నిర్వాసితులు అవుతున్న స్థానికుల ఆవేదనకు, ఆక్రందనకు, దుఃఖానికి సజీవ సాక్ష్యంగా నిలిచిపోతాయి..

“అయ్యా నేను రాజపోషవ్వను మాట్లాడుతున్నా…
నాకు ఇద్ద రు కొడుకులు.., ఎవరు తిండి పెడ్తలేరు… కైకిలి చేసుకొనే బతుకు మాది… కైకిలి దొరికితనప్పుడు దొరుకుతుంది, దొరకనప్పుడు దొరకదు… వాళ్ళ పోర గాండ్లకే తిండికి సరిపోతలేదు… నాకేం పెడ్తరు…” చాతనై చాతకాక కూలికిపోతా..! పడుసు పొరగాండ్లకే పనులు దొరుకత లేవు… నా అటువంటి ముసలిదానికి పను లేమి దొరుకు తాయి… పని దొరికినప్పుడు తింటా.. లేనప్పుడు కాళ్ళు కడుపులకు దోపుకొని పస్తులు పంట… నిన్నటి నుంచి తిండి లేదు… ప్రాణం సొడ సొడలు పోతాంది… మాట్లాడ వస్తలేదు… అయి నా మాట్లాడుతా… ఇప్పుడు మాట్లాడ కుంటే ఇక ఎప్పుడు మాట్లాడినా దండుగే… నాకు గీ కష్టం వస్తదనుకోలే… నా పెండ్ల యిన ఎరుకల మా పెద్దంపేట ఊరు ఎట్లా ఉండే… జల్లారం చెరువు కింద పన్నెండు నూర్ల ఎకరాలు పారే ది… తీరొక్క పంట పండేది… గుమ్ముల కొద్దీ చేసుకొని బ్రతికినం… అన్ని రకా ల పంటలు పండించుకొని బ్రతికినం… బారెడు లోతు తవ్వితే జలజల మం టూ గంగమ్మ తన్నుకొని బయటికి వచ్చేది… ఇంటి ముందు ‘అమ్మ’ అని అడుక్కోను వచ్చినోడెవడు వట్టి చేతులతోని వెనక్కి పోయేటోడుకాదు… చెట్టు, చేమ, పుల్ల, పురుగు, పక్షి అంతా కలిసి బ్రతికినం…ఆ రోజులు పోయి నాయి… ఏదో మాయ కమ్మింది… ఎవరికన్నా కోపం వస్తే నీ ఇంట్ల మన్ను బొయ్య అని తిడ్తరు… కాని ఏ కోపం లేకుండానే కంపినోడు మా బ్రతుకుల మీద టన్నుల కొద్ది మన్ను గుట్టలు గుట్టలుగా పోసిండు… మా బతుకులు ఆగమైనవి… (ఇంకా…)