jump to navigation

People’s Movement for Telangana vis-a-vis- Political Parties – A Comment జనవరి 23, 2008

Posted by Telangana Utsav in Articles, Six Point Formula, Telangana, Telugu (తెలుగు).
add a comment

 అణచినకొద్దీ రగులుతున్న ‘తెలంగాణ’

- వెల్చాల జగపతిరావు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది ‘హమీల’ ఉల్లంఘనకు వ్యతిరేక ఉద్యమం. ఇంకొకప్పుడు వివక్షకు వ్యతిరేకంగా, సమతుల్యానికి, సమభాగస్వామ్యం కోసం చేసిన న్యాయబద్ధమైన పోరాటం. మరొకప్పుడు రాజ్యాంగ హక్కులకు రగిలిన ప్రజాందోళన. తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమం వెనుక ఒక బలీయ కారణం ఉంది. చెల్లని ఒప్పందాలు, నెరవేరని హామీలు, అమలు చేయని మార్గదర్శక సూత్రాలు, రద్దుచేసిన ‘ముల్కీ రూల్స్‌’, తెలంగాణ ప్రాంతీయ కమిటీ, తెలంగాణ అభివృద్ధి మండలి రద్దులు, నీరూ, నిధుల పైన దురాక్రమణ, వనరుల వాడకంలో దగా- ఇంకా ఎన్నెన్నో కారణాలు. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ సంఘర్షణ నిరంతరంగా కొనసాగింది. విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళనకు చొరవచూపారు. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో తెలంగాణ ప్రజల వాణిని విన్పించారు. సదస్సులు, సమావేశాలు, చర్చలు, పుస్తకాల ప్రచురణ, పాటల ద్వారా తెలంగాణ రాష్ట్ర నినాదం ఇంటింట మారుమ్రోగింది.
1990-95 సంవత్సరాల మధ్య శాసనసభలో ‘తెలంగాణ అఖిలపక్ష శాసనసభ్యుల ఫోరం’ ఏర్పడ్డది. మజ్లిస్‌, బిజెపి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌ తెలు గుదేశం ఎమ్మెల్యేలు ఒకే వేదికపై కలిసి తెలంగాణకు సం బంధించిన ప్రతి సమస్యపై ‘ఆరా’ తీసి జరిగిన, జరుగు తున్న అన్యాయాన్ని ఎత్తి చూపారు. తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను ఎండగ ట్టారు. ఈ ‘ఫోరం’ సభ్యులు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి మెమోరాండంలు సమర్పించారు. శాసనసభలో ముఖ్యమంత్రితో నిర్దిష్టమైన హమీలు పొందారు. ఆనాటి పాలకపక్షం ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని ఎదిరించారు. ఎవరికి వారికి సొంత ఎజెండా ఉన్నా ప్రతి ఒక్కరూ తెలం గాణ సమస్యతో మమేకమయ్యారు. వేరు కుంపట్లు పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయలేదు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (తెరాస) ఏర్పడి నాలుగు సం వత్సరాలు గడిచిపోయాయి. ఆ పార్టీ వ్యవస్థాపకుడు కె. చంద్రశేఖర రావు తన మాట చాకచక్యంతో తెలంగాణ ఉద్యమానికి కొంత స్ఫూర్తిని ఇచ్చారు.
(ఇంకా…)

Telangana sentiment – Myth & reality జనవరి 23, 2008

Posted by Telangana Utsav in Articles.
add a comment
‘సెంటిమెంట్’ కాదు చైతన్యం
- కడెంపల్లి సుధాకర్
ప్రత్యేక తెలంగాణ వివేచనకు దూరమైన ఒక భావోద్విగ్నత అంశం కాదు, అది ఒక అస్థి త్వ అవసరం. ‘వివేచన లేకుండా భావోద్వేగానికి లోను కావడం’ ఇది, ‘సెంటిమెంట్’ అనే పదానికి ‘ఆక్స్ఫర్డ్ నిఘంటు వు’ ఇచ్చిన నిర్వచనాలలో ఒకటి. ప్రజ్ఞా పాటవాలు లేని ప్రాజ్ఞులు, రాజకీయాలలో సద్యోగంలేని రాజకీ యవేత్తలు, రాజకీయాలు చేసే రాజకీయేతరులు, మోజుతో మీడియావారు ‘సెంటిమెంట్’ అనే పదాన్ని తెలంగాణ విషయంలో ఎంతగా దుర్వినియోగం చేయాలో అంతగా దుర్వినియోగం చేస్తున్నారు. తెలం గాణ డిమాండ్ను రెండు వర్గాల ప్రజలు పక్కదోవ పట్టించారు. సెంటిమెంట్ అంటే ఏమిటో తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా పక్కదోవ పట్టించిన వారు కొంతమంది కాగా తెలంగాణ సెంటిమెంట్ అంటే అర్థం తెలియకుండానే ఆ పదాన్ని ఉప యోగిస్తున్న వారు మరికొందరు. మొదటి వర్గం వారు తెలివైన వాళ్ళు, చతురులు కాగా రెండోవర్గం వారు అజ్ఞానులు. వీరెవరో మీకు మీరే నిర్ణ యించుకోవచ్చు.
ఇక్కడ రెండు విషయాలు చెప్పవలసివుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజ లు ఎల్ల్లెడలా తమ సహజ పరిస్థితులలో – సాంస్క­ృతికమైనవైనా, సామాజికమైనవైనా- ఒకలానే ఉంటారు. కాగా పేదలు ఎక్కడైనా పేద లే! ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, ఉత్తర అమెరికా, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రలో పేదలు ఒకేలా ఉండటం పరిపాటి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు ఆ మహా సంఘ టన ప్రపంచ ప్రజాస్వామ్య పురోగతిలో ఒక మైలురాయిగా అభివర్ణిం చడం జరిగింది. అయితే తద్విరుద్ధమైన ఘటన పశ్చిమ, తూర్పు జర్మ నీల ఏకీకరణను కూడా అదేవిధంగా పరిగణించడం జరిగింది! వీటి వెనుక ప్రజలు తీసుకొనే దృక్పథము, రాజకీయ వైచిత్రి ఉన్నాయి. పది హేను సంవత్సరాల క్రితం అమెరికా అధ్యక్షుడు ఎవరు అన్న విషయమై ఇతర దేశాలవారు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు.
(ఇంకా…)