ఎచ్చెమ్మ కతల యశోదమ్మ Yashoda Reddy అక్టోబర్ 8, 2007
Posted by Telangana Utsav in In News, Telangana People, Telugu (తెలుగు).add a comment
‘తెలంగాణ పిల్ల’ యశోదమ్మ
- ముదిగంటి సుజాతారెడ్డి
అభిమానం గల తెలం గాణ ముద్దుబిడ్డ యశోదారెడ్డి. 1929లో మహబూబ్‌నగరం జిల్లా బిజినేపల్లి గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పాకాల యశోదారెడ్డి తన సహజమైన ప్రతిభతో విశ్వవిద్యాలయం ఆచార్యులుగా ఎదిగారు. అంతేగాక అధికార తెలుగు భాషాసంఘం చైర్మన్ పదవిని అధిష్ఠించిన ఏకైక మహిళ ఆమె. మంచి వక్త. అటు సంస్కృత సమాసభరితమైన శైలిలో ఇటు తెలంగాణ జాతీయాలు, సామెతలు, పలుకుబడులు నిండిన శైలితో ఆమె సమానంగా ధారాళంగా వేదికల మీద మాట్లాడేవారు.
తెలంగాణలో స్త్రీలు చదువుకొని వేదికలు ఎక్కి మాట్లాడటం అరుదైన కాలంలో ఆమె వక్తృత్వ ప్రతిభను చూసి ప్రసిద్ధ చిత్రకారుడు పి.టి.రెడ్డి ఆకర్షితుడై ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆయన గీసిన అనేక చిత్రాలకు ఆమె స్ఫూర్తి. యశోదారెడ్డి కూడా స్వతహాగా కళాపిపాసి.




