jump to navigation

తెలంగాణ వాసులార ఉద్యమించ లెండిరో ఆగష్టు 1, 2007

Posted by Telangana Utsav in Poetry & Songs, Telangana, Telugu (తెలుగు).
trackback

తెలంగాణ వాసులార                                      – ఎన్నారు నర్సింహ

తెలంగాణ వాసులార తెగువతొ లేవండిరో
ఉప్పెనై  రండిరో తెలంగాణ వాసులార
ఉద్యమించ లెండిరో తెలంగాణ తమ్ములార

విశాలాంద్ర పేరున విషాదమె మిగిలెరో ..తెలంగాణ వాసులార

తెలంగాణ వస్తె దప్ప వెలుగు మనకు లేదురో.. తెలంగాణ తమ్ములార
పెద్దమనుషుల ఒప్పందం పేరుకె మనకు మిగిలిందిరో ..తెలంగాణ వాసులార
ముల్కి నిబంధనలు మూలనపడ్డయిరో

పాలకుల మాటలన్ని నీటి మూటలాయెరో ..తెలంగాణ వాసులార
 
ఆంధ్ర సంపన్నులకు విషాలాంధ్ర వరమురో ..తెలంగాణ వాసులార
తెలంగాణ సంపదను దోసుక పోతున్నరో ..తెలంగాణ తమ్ములార
ఆనందం వాల్లకై తె ఆకలితో చస్తిమిరో ..తెలంగాణ వాసులార
నీల్లన్నీ వాల్లకయితె కన్నీళ్ళె మిగిలెరో ..తెలంగాణ తమ్ములార

తలాపున నదులున్నా తాగ నీళ్ళు లేవురో
తెలంగాణ రైతులకు ఉరి తాళ్ళె దిక్కాయెరో ..”తెలంగాణ “
కంపెనీల మూతపెట్టి కార్మికుల చంపిరో .. తెలంగాణ వాసులార

కొలువులన్ని వాల్లకైతె కాలుష్యం మిగిలెరో ..తెలంగాణ తమ్ములార
చదువులను అంగట్ల సరుకులను జేసిరో .. తెలంగాణ వాసులార
హైటెక్కు మోసాలాతో గారడి జేస్తున్నరో
తెలంగాణ వాల్లకేమి తెలివి లేదన్నరో .. “తెలంగాణ “

న్యాయం కోసం అడిగితె నేరస్తులు అన్నరో .. తెలంగాణ వాసులార
పట్టపగలె పట్టుకొని కాల్చెపిస్తున్నరో .. తెలంగాణ తమ్ములార
తెలంగాణ పల్లెలను జైళ్ళు జేస్త వున్నరో .. తెలంగాణ వాసులార
జీవించె హక్కును కాలరాస్త ఉన్నరో .. తెలంగాణ తమ్ములార

పోలీసుల ఎగదోసి రక్తం పారించిరో
ప్రతి ఊరు ప్రతి పల్లె గొల్లు గొల్లు మన్నయో .. తెలంగాణ వాసులార
భూములన్ని కబ్జా జేసి దొరలై .. తెలంగాణ వాసులార
ఉన్న భూములమ్ముకొని కూలి లైతున్నమో  .. తెలంగాణ తమ్ములారా

కన్నగడ్డ మీదనె పరాయొల్లమైతిమో .. తెలంగాణ వాసులార
తెలంగాణ గడ్డమీద అడ్డా బిటాయించిరో .. తెలంగాణ తమ్ములార
దగాపడ్డ తెలంగాణ దండుగట్ట మన్నదో
విప్లవాల గడ్డ మీద వీరులై  లెండిరో .. 3
 

………………………
మూలం:  ఎన్నారు పాట
(April 2007)
 
Copies Available at:
H.M.Hemalatha, 6-69, Bank colony, P.R.Pally, Sangareddy, Medak District, telangana -502 001
Mobile no 9440927559
 
and
 
Sahachara BookMark, Bagh Lingampally, Hyderabad,
Navodaya, vishalandra, prajashakthi, disha.
 
Price: Rs. 30

వ్యాఖ్యలు»

No comments yet — be the first.