Protest Against Abuse of Telangana in Telugu Cinema మార్చి 23, 2007
Posted by mbbhushan in English, In News.trackback
When will Telangana be formed? Ha ha ha
Telugu film, Okkudunnadu, ridicules demand for a separate state; face the ire of state supporters
Roli Srivastava
Hyderabad: A comedy scene in a Telugu film, Okkadunnadu, has raised hackles among supporters of a separate Telangana state. In a dialogue in the film, released on March 3, one comedian asks the other to make him laugh. At this, Brahmanandan, a leading comic actor in Tollywood, asks “Telangana eppudu vastundi (when will Telangana materialise)” at which both the actors laugh
![]() |
| A scene from the film Okkadunnadu |
While the comedy implied that the issue of a separate Telangana state has been going on for several years and nobody knows when it would materialise, Telangana supporters believe that the pun ridicules their demand for a separate state.
“Such dialogues damage the cause (of a separate state). It’s a film being shown all over the state and has a huge audience. We had appealed to people to boycott the film” said Bharath Bhushan, Chairman, Telangana Utsav Committee, an organisation of Telangana supporters. He added that such a dialogue is a serious political statement and cannot be viewed as a humour.
Meanwhile, the Telangana proponents found support for their protest against the film in social worker Meera Naidu. She said it is high time that the cause of a separate state is depicted correctly in Telugu movies.
Director Chandra Sekhar Yeleti, however, said that the dialogue in the film was only used to create a light-hearted moment and that there was no intention to hurt anyone.“We wanted to use a current political issue. But, at the same time we did not think of it deeply. It was simply used for humour” Yeleti told Mumbai Mirror. He said that there was no ulterior motive to hurt anyone, adding, he didn’t expect a controversy on this rather harmless dialogue.
Mumbai Mirror, March 23, 2007






ఒకప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో కూడా ఆంధ్రుల్ని ఈ విధంగానే వెక్కించేవారు.. ఈ విధమైన వెక్కిరింతలే ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావానికి మూలకాలుగా పని చేస్తాయి. ఇప్పుడు ఆంధ్రులు కూడా ప్రత్యేక తెలంగాణా వాదుల్ని అదే విధంగా వెక్కిరించి ప్రత్యేక తెలంగాణా వాదుల్లో పౌరుషాగ్నిని రెచ్చగొట్టి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి సమాయుత్తం చేస్తున్నారు. కాలం వారి వెక్కిరింతల్ని హేళన చేసే కాలం దగ్గరలోనే ఉంది.
@ Post , Madan mohan
c’mon this is bullshit , as the director said it was just created for a
light-hearted joke !! I (i hope almost everyone except morons ) couldn’t
see any thing political or sarcastical about it !!
there are always people who wanna make shit outta notthin !!
మాటిమాటికీ ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణాని పోల్చుకోవడం హాస్యాస్పదం అలాగే ఎవరైనా ఏదైనా జోకేసినా జోకు పేరుతో ఏమీ వెయ్యకపోయినా ఊరికే ఉడుక్కోవడం అనాగరిక లక్షణం. ఒక చిన్న సవరణ మద్రాస్ రాష్ట్రంలో తెలుగువారికి ఏ విధమైన అవమానాలూ జరగలేదు. ఆ రోజుల్లో తెలుగువారే అక్కడ highly dominant వర్గం. బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాల ఏర్పాటు వల్ల మాక్కూడా ఒక భాషారాష్ట్రం ఇవ్వమని తెలుగువారు డిమాండ్ చేశారంతే. అసలు తమిళనాడుని 400 ఏళ్ళ పాటు పరిపాలించింది మన తెలుగువారే.అందుచేత తమిళులు మనల్ని ద్వేషించారు గాని మనం ఎవరినీ ద్వేషించలేదు.ఆంధ్రరాష్ట్ర డిమాండు తెలంగాణా డిమాండ్ లాగా అసూయా ద్వేషాల్లోంచి పుట్టుకొచ్చింది కాదు.అది మన తెలుగు జాతీయవాదోద్యమం. ఇహపోతే నేను కూడా తెలంగాణా రాదని చెబుతున్నా. ఊరికే కోపగించుకోకన్నా. Be realistic. ఈ వాస్తవంలో నవ్వించేటంత జోకూ లేదు. బాధపడేటంత విషాదమూ లేదు. తెలంగాణా రాకపోవడమే మనందరికీ మంచిది.
ఎవరేమి అనుకున్నా తెలంగాణ వస్తుంది. అదికూడా చాలా త్వరగానే రాబోతుంది. జోకులేసినా, వెక్కిరించినా తెలంగాణా ప్రత్యేక రాష్టాన్ని ఆపలేరు. “నవ్విన నాప చేనే పండుతుంది.”
డా.దార్ల వెంకటేశ్వర రావు
ఎవరేమి అనుకున్నా తెలంగాణ వస్తుంది. అదికూడా చాలా త్వరగానే రాబోతుంది. జోకులేసినా, వెక్కిరించినా,గుండెలు బాదుకున్నా తెలంగాణా ప్రత్యేక రాష్టాన్ని ఆపలేరు. “నవ్విన నాప చేనే పండుతుంది.”
తెలంగాణే కాదు రేపు కళింగాంధ్ర, రాయలసీమ ఇలా ఎన్ని రాష్ట్రాలుగా విడిపోయినా నష్టం లేదు. న్యాయం జరగడం లేదనుకున్నప్పుడు, కలిసి మెలిసి ఉంటున్నామంటూ కొందరికి అవకాశాలను రానివ్వనప్పుడు జరిగే పరిణామాలకు తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర పోరాటం గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది.
- డా.దార్ల వెంకటేశ్వర రావు
తెలంగాణ వస్తుందో, రాదో, అవసరమో, కాదో అన్న దాని మీద నేను వ్యాఖ్య చెయ్యదలచుకోలేదు కానీ ఇలా ఇక ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపించి అనవసరమయిన లేని పోని యాంగిల్స్ చూపించి అసలు ఏదన్నా మాట్లాడాలన్నా పది సార్లు ఆలోచించే లా చేస్తున్నారు. ఇది మాత్రం సరి కాదని నా అభిప్రాయం.
సినిమాల్లో వంద విషయాలు చూపిస్తున్నారు. కామెడీ రక రకాలు గా ఎంత మందినో టార్గెట్ చేస్తూ వచ్చింది. కొన్ని సార్లు అది బాగుండచ్చు, కొన్ని సార్లు బాగుండకపోవచ్చు. ఇక ప్రతీ విషయాన్ని అలా చూడకుండా ఈ ఒక్క సారి మాత్రమే దాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసారనడం ఎంత వరకూ ఔచిత్యమో ఆలోచించుకోవాలి.
‘పోలవరం కట్టకుండా ఎవరు ఆపుతారో చూద్దాం’ అని అల్లు అర్జున్ తోటి (బన్నీ) డైలాగు కొట్టించినప్పుడె సురుకు పెట్టు ఉంటె ఇప్పుడు ఈ కమేడియన్ల తోటి ఇలాంటి డైలాగులు కొట్టించడానికి నాలుగు సార్ల ఆలోచించేవాల్లు.
‘… as the director said it was just created for a light-hearted joke !!…’ nobody cares what the director thinks or what his point of view is at this juncture? (of course there is not a single person we’ve seen so far who has made a valid statement as why Telangana shouldn’t materialize. then where is a chance of a point of view, other than just ‘Blindly oppose when ever someone talks about Telangana’ )
Telangana is a fireball now, each & every un-thoughtful statement that is made against it will fuel it.., time will decide who is bulshitting whom?
‘…అందుచేత తమిళులు మనల్ని ద్వేషించారు గాని మనం ఎవరినీ ద్వేషించలేదు…’ అలాంటప్పుడు మరి తెలంగాణ అన్న రాష్ట్రం పక్కన పెట్టండి, తెలంగాణ పేరు ఎత్తితెనే ఎందుకంత ద్వేషం?
‘…ఆంధ్రరాష్ట్ర డిమాండు తెలంగాణా డిమాండ్ లాగా అసూయా ద్వేషాల్లోంచి పుట్టుకొచ్చింది కాదు….’ అన్న స్టేట్‌మెంట్‌కి ‘… తిన్నదరగక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు…’ అని చేసిన స్టేట్‌మెంట్‌కి పెద్ద తేడా ఏమి లేదు.
‘…అది మన తెలుగు జాతీయవాదోద్యమం…’ అవసరం ఉన్న దగ్గర ‘మన… మేము’ అని కలుపుకోవడం, అవసరం లేని దగ్గర ‘మీరు… మేము’ అని విడదీయడం తెలంగాణ ప్రజలకు చాతకాదు మరి.
‘…కానీ ఇలా ఇక ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపించి అనవసరమయిన లేని పోని యాంగిల్స్ చూపించి అసలు ఏదన్నా మాట్లాడాలన్నా పది సార్లు ఆలోచించే లా చేస్తున్నారు….’ తెలంగాణ గురించి మాట్లాడేముందు పది సార్లు కాదు, ఖచ్చితంగా వంద సార్ల ఆలోచించాలి. అవగాహన లేని విషయాలలో ఉన్న మిడిమిడి జ్ఞనంతో ఏదో అనేస్తే ఊరుకునేంత దుర్భర స్థితిల తెలంగాణ ప్రజలు లేరు…
‘…సినిమాల్లో వంద విషయాలు చూపిస్తున్నారు. కామెడీ రక రకాలు గా ఎంత మందినో టార్గెట్ చేస్తూ వచ్చింది….’ ఎన్ని తీర్ల, ఎంత మందిని, ఎట్ల అన్న టార్గేట్ చేసుకోనీ, తెలంగాణ గురించి ఒక్కమాట అన్నా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఊరుకోరు. “ఆ ! ఏమి పీకుతారులే వీళ్ళు ! ” అన్న attitude మార్చుకోకపోతే ఏమి జరుగుతయో సమయమే నిర్ధారిస్తది. ఏదో జరగాలని ద్వేషం తోటి మాత్రం అస్సలు కోరుకుంటలేను నేను, కాని ‘ఎన్నెన్ని దారుణాలు జరుగుతయో’ అన్న భయంతోటి అంటున్న.
“…ఇక ప్రతీ విషయాన్ని అలా చూడకుండా ఈ ఒక్క సారి మాత్రమే దాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసారనడం ఎంత వరకూ ఔచిత్యమో ఆలోచించుకోవాలి….” అసలు తెలంగాణ గురించి ముందు ఔచిత్యం లేకుంట మాట్లాడడం మానుకోవాలి… తర్వాత దేన్ని టార్గెట్ చెయ్యకూడదో ఆలోచిద్దాం.
అంటే జయప్రకాష్, తెలంగాణా ప్రజలకు అందరికీ తెలంగాణ పట్ల పూర్తి అవగాహన వుందంటావా? అయితే తెరాసాలో ఇన్ని గ్రూపులెందుకన్నా? ఒకరినొకరు తిట్టుకుని తెలంగాణను ఎందుకు కామెడీ చేస్తున్నారు. ముందు ఆ కామెడీని ప్రజలు అర్ధం చేసుకుంటే మంచిగుంటదన్నా..తర్వాత మన సినిమాల కుళ్ళు కామెడీ పని పట్టొచ్చు.
లేదని మీ ఖచ్చితమైన నమ్మకం అనుకుంట ?
తెలంగాణ అంటే ‘తెరాస’ అని మాత్రమే ఎందుకు మీ భావన ? తెలంగాణల మూడున్నర కోట్ల కంటె ఎక్కువ ప్రజలు ఉన్నరు, కొన్ని వందల సంస్థలుగ ఏర్పడి తెలంగాణ కోసం కొట్లాడుతున్నరు, వాల్లను చూడలేక పోవటం, వాటి గొంతు కావాలని వినిపించుకోకపోవటం అమాయకత్వమా? ఇంకా ఏమన్నా నా ?
అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెబితే నిజమవుతుందనుకుంటారు కొందరు. మన బాలసుబ్రహ్మణ్యం గారు ఇటువంటి పనులు చేయడం లో సిద్ధహస్తులు. తెలంగాణా ఉద్యమం పై ఆయన గారు అల్లుతున్న అబద్దాలు, అర్ధ సత్యాలు చూస్తేనే సమైక్యవాదం అనేది ఎంత గోముఖ వ్యాఘ్రమో అర్ధం అవుతుంది. తెలంగాణా వాదం అసూయా ద్వేషాల్లోంచి పుట్టింది కాదు నాయనా, అది ఒక ప్రాంత ప్రజల స్వయం పాలానా కాంక్ష. ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, భాష ఉన్న ప్రాంతం ప్రజలు ఒక రాష్ట్రం గా ఏర్పడాలనుకుంటే మీకెందుకయ్యా ఇంత అక్కసు?
నేను రాసిన వ్యాఖ్యలో ఎక్కడా తెలంగాణా గురించి గానీ, అది వద్దు అని కానీ, దానికి వ్యతిరేకంగానో గానీ లేదు. అయినా దాంట్లో కి మీరు తెలంగాణా ని ఎందుకు లాక్కొస్తున్నారో అర్థం కాలేదు.
ఆవేశం ఉండచ్చు గానీ ఇక ఇతరులు ఏది మాట్లాడినా మీరు మీ భావాల్ని దాంట్లో కి జొప్పించి అసలు సంబంధం లేకుండా రుద్దాలని చేసే పనియితే ఇక వ్యాఖ్య చెయ్యడంలో అర్థం లేదనుకుంట.