తెలంగాణ భాష ! మార్చి 6, 2007
Posted by JayaPrakash Telangana in Essays, Telugu (తెలుగు).4 comments
తెలంగాణ ప్రజలు ఎంతో అర్దవంతమైన భాష మాట్లాడుతున్నారు. ఉదాహరణకి మేర అన్న పదాన్ని పరిశీలించండి. ఈ పదాన్ని ఇతర ప్రాంతీయులు “దర్జీ” అంటున్నారు. అది ఉర్దూ పదం.
మేరల (హద్దులు) మేరకు గుడ్డల్ని కత్తిరించి కుట్టే వ్యక్తి మేర. ఇదేమో తెలుగు పదం. తెలంగాణలో వ్యవహరించబడే కాపోల్లు, కాపుదనపోల్లు అనే మాటలు అసలు సిసలు తెలుగు పదాలు.
పంట పండించి కాపు (కాపలా)గా వుండేవాళ్ళు కాపోల్లు. దీనికి సమానార్థకంగా ఆంధ్రప్రాంతంలో రైతులు అంటున్నారు. రైతు ఉర్దూ పదం. (ఇంకా…)




